వైకాపా వలననే తెరాస దెబ్బ తినబోతోందా?

“వరంగల్ ఉప ఎన్నికలలో తెరాసకు మెజార్టీ తగ్గకుండా చూసుకోవడానికే తెరాస శ్రేణులు గట్టిగా కృషి చేయాలి” అని తెరాస నేతలు మేకపోతు గంభీరంగా ప్రదర్శిస్తూ చెప్పుకొంటున్నారు. కానీ గత 16 నెలల పాలనలో తమ ప్రభుత్వం తీసుకొన్న కొన్ని ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, రైతుల ఆత్మహత్యల వంటి సున్నితమయిన సమస్యలను విస్మరించడం వలన, వాటి గురించి ప్రతిపక్ష పార్టీలన్నీ కలసికట్టుగా చేస్తున్న ప్రచారం వలన తెరాస పట్ల ప్రజలలో ఎంతో కొంత వ్యతిరేకత నెలకొని ఉందనే సంగతి ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రహించినట్లే ఉన్నారు. అందుకే ఈ వరంగల్ ఉప ఎన్నికల గండం నుండి గట్టెక్కడానికి వైకాపాను రంగంలోకి దించారని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ప్రతిపక్షాల ఓట్లు చీల్చి తెరాసకు విజయం సాధించిపెట్టడానికే జగన్మోహన్ రెడ్డి స్వయంగా రంగంలో దిగారని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి.

వాటి ఆరోపణలు ఎలా ఉన్నా జగన్మోహన్ రెడ్డి మాత్రం కేసీఆర్ నిజంగానే తన బద్ద శత్రువు అన్నట్లుగా వీరావేశంతో నటించేస్తూ “ముఖ్యమంత్రి కేసీఆర్ ని హామీల అమలు గురించి నిలదీసి అడగండి..గట్టిగా అడగండి” అంటూ ప్రజలను రెచ్చ గొడుతున్నారు. తెరాస 16నెలల పాలనలో తప్పులను, లోపాలను చాలా నిశితంగా ఎత్తి చూపిస్తూ తెరాసను, ముఖ్యమంత్రి కేసీఆర్ ని కడిగిపడేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అంత ఆవేశంగా కేసీఆర్ ని విమర్శించడం చూసి వైకాపా నేతలే ముక్కున వేలేసుకొంటున్నారు. ఇక తెరాస నేతల పరిస్థితి ఎలాగ ఉంటుందో తేలికగానే ఊహించవచ్చును.

తెరాస-వైకాపాల మధ్య ఉన్న రహస్య అనుబంధం కారణంగానే వైకాపాను వరంగల్ ఉప ఎన్నికల బరిలోకి దింపారనే ఆరోపణలు నిజమనుకొంటే, ఇప్పుడు తెరాస అందుకు పశ్చాత్తాప పడుతుండవచ్చును. జగన్మోహన్ రెడ్డి తెరాస ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఏదో సున్నితంగా విమర్శిస్తారనుకొంటే, ఆయన మిగిలిన అన్ని ప్రతిపక్ష పార్టీల కంటే చాలా ఘాటుగా, చాలా లోతుగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ ఎన్నికల ప్రచారంలో మిగిలిన ఏ ఇతర రాజకీయ నాయకుడు కూడా జగన్మోహన్ రెడ్డి అంత ఘాటుగా కేసీఆర్ ని విమర్శిస్తూ ప్రజలను ఆకట్టుకోలేకపోతున్నరనే చెప్పవచ్చును. జగన్ రంగప్రవేశం చేయడం వలన ప్రతిపక్షాల ఓట్లు చీల్చడం మాటెలా ఉన్నా ముందు తెరాసకే అందరి కంటే ఎక్కువ ఇంకా నష్టం కలిగేలా కనబడుతోంది.

ఈ ఎన్నికలలో వైకాపా గెలవకపోయినా, తెలంగాణాలో వైకాపా మళ్ళీ బలపడేందుకు ఈ అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి చాలా చక్కగా ఉపయోగించుకొంటున్నారని చెప్పవచ్చును. ఆయన చాలా ఆవేశంగా…చాలా ఉదృతంగా చేస్తున్న ప్రచారంతో తెలంగాణాలో వైకాపా నేతలలో ఇప్పుడు సమరోత్సాహం ఉబికివస్తోంది. వారిలో ఒక నూతనోత్సాహం కలిగించగలిగారు. అలాగే ఆయన తన కేసీఆర్ వ్యతిరేక ప్రచారంతో జంట నగరాలలో స్థిరపడిన ఆంధ్రా ఓటర్లను కూడా ఆకట్టుకోగలిగారని చెప్పవచ్చును. తత్ఫలితంగా త్వరలో జరుగబోయే జి.హెచ్.ఎం.సి.ఎన్నికలను అధికారంలో ఉన్న తెరాస పార్టీ కంటే తామే చాలా దైర్యంతో ఎదుర్కోగలమనే నమ్మకం వైకాపా శ్రేణులకు ఆయన కలిగించి ఉంటే అందులో ఆశ్చర్యపోవలసినదేమీ లేదు.

తెలంగాణాలో వైకాపా బలహీనంగా ఉన్నంత వరకే అది తెరాసకు పరోక్ష సహకారాన్ని అందిస్తూ ఉంటుంది. కానీ తనంతట తానే ఎన్నికలలో పోటీ చేసి గెలవగలమనే నమ్మకం, ధీమా వైకాపాకి కలిగిన నాడు అది తెరాసపై నిజంగానే యుద్ధం ప్రకటించడం తధ్యం. ఒకవేళ ఈ ఉప ఎన్నికలలోనే వైకాపా గెలవలేకపోయినా దానికి భారీగా ఓట్లు పడినట్లయితే తప్పకుండా తెరాస పట్ల దాని వైఖరిలో మార్పు కనబడటం మొదలవవచ్చును. తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తన బద్ధ శత్రువయిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి దగ్గరయ్యేందుకు ఏ మాత్రం ప్రయత్నించినా జగన్మోహన్ రెడ్డి తెలంగాణాలో తన పార్టీని బలోపేతం చేసుకొనేందుకు స్వయంగా నడుం బిగించడం కూడా ఖాయం. ఈ ఉప ఎన్నికలలో వైకాపా ఏ కారణంగా పోటీ చేస్తున్నప్పటికీ దాని వలన వైకాపాకు ఎంతో కొంత మేలు తెరాసకు మున్ముందు నష్టం జరిగే అవకాశాలు కనబడుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close