అజిత్ సినిమా మెచ్చిన ఎన్.టి.ఆర్

రీసెంట్ గా కోలీవుడ్లో రిలీజ్ అయ్యి సూపర్ సక్సెస్ అయిన వేదలం సినిమా తమిళ నాట రికార్డుల పరంపరను కొనసాగిస్తుంది. అజిత్ హీరోగా నటించిన ఈ సినిమాను తెలుగు దర్శకుడు శివ డైరెక్ట్ చేశాడు. సినిమాలో హీరోయిన్ గా చేసిన శృతి లాయర్ క్యారక్టర్లో నటించింది. సిస్టర్ సెంటిమెంట్ తో నడిచే ఈ సినిమా కోలీవుడ్లో సూపర్ కలక్షన్స్ ని రాబడుతుంది. అయితే ఈ సినిమా చూసిన యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ శివ దర్శకత్వ ప్రతిభను మెచ్చుకుంటూ సినిమా బాగుందని తన సన్నిహితులతో అన్నాడట.

సినిమా కథ పాతదే అయినా సిస్టర్ సెంటిమెంట్ ని దర్శకుడు చూపించిన విధానాం బాగా వర్క్ అవుట్ అయ్యిందట. అజిత్ వేదలం సినిమాలో అజిత్ సిస్టర్ గా లక్ష్మీ మీనన్ నటించింది. ఈ దీపావళికి రిలీజ్ అయిన ఈ సినిమా 6 రోజుల్లోనే 45 కోట్ల కలక్షన్స్ ని రాబట్టి 100 కోట్లను టచ్ చేసే దిశగా పరుగులు తీస్తుంది. మరి సినిమా చూసి నచ్చిన యంగ్ టైగర్ సినిమాను తెలుగులో రీమేక్ చేసే ఆలోచనలో ఏమన్నా ఉన్నాడా అనేది తెలియాల్సి ఉంది.

ఇదిలా ఉంటే వేదలం ప్రొడ్యూసర్ ఏ.ఎం.రత్నం ఈ సినిమాను మెగాస్టార్ చిరంజీవి కోసం స్పెషల్ స్క్రీనింగ్ వేయించి చూపిస్తున్నాడట. సినిమా భారీ హిట్ అవుతుండటంతో ఇదే సినిమాను తెలుగులో మెగాస్టార్ చిరంజీవి తీసే ఆలోచన ఉన్నాడని ఫిల్మ్ నగర్ టాక్. మొత్తానికి సిస్టర్ సెంటిమెంట్ తో వచ్చిన అజిత్ వేదలం సినిమా టాలీవుడ్లో కూడా టాక్ ఆఫ్ ది టౌన్ అవ్వడం గొప్ప విషయం అని చెప్పొచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వెబ్ సిరీస్‌లు మ‌నకెక్కుతాయా?

ఇప్పుడు ఎవ‌రు చూసినా వెబ్ సిరీస్ ల గురించే మాట్లాడుతున్నారు. స్టార్లంతా అటువైపే చూస్తున్నారు. సినిమాకి మ‌రో గ‌ట్టి ప్ర‌త్యామ్నాయం వ‌చ్చింద‌ని బ‌లంగా న‌మ్ముతున్నారు. నిర్మాణ సంస్థ‌లు అటువైపే, హీరోల చూపూ అటుకేసే....

రద్దయ్యే మండలిలో ఎవరికి పదవులు ఇస్తే ఏంటి..!?

వైసీపీలో శాసనమండలి పదవుల చర్చ నడుస్తోంది. మొత్తం నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయినప్పటికీ.. ఒక స్థానం సమయం కేవలం 9 నెలలు మాత్రమే ఉండటంతో..ఎన్నిక జరగదు. మరో మూడు స్థానాల్లో రెండు...

న్యూ ఐడియా: ట్రైల‌ర్‌కీ టికెట్టు

ఎడారిలో ఇసుక అమ్మే తెలివితేట‌లు అచ్చంగా రామ్ గోపాల్ వ‌ర్మ సొంతం. ఓ సీ గ్రేడ్ షార్ట్ ఫిల్మ్ తీసి, దానికి వంద‌, రెండొంద‌లు టికెట్టు పెట్టి, ప్రేక్ష‌కుల నుంచి ఎంతో కొంత...

ఆర్ఆర్ఆర్ మరో లేఖ : భవన నిర్మాణ కూలీలకు సాయం ఏదీ..?

భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం పేరుతో.. వారికి సంబంధించిన సొమ్మును ప్రభుత్వం రూ. 1364 కోట్లు వసూలు చేసిందని... అయినా ఈ సంక్షోభ సమయంలో.. వారిని ఎందుకు ఆదుకోవడం లేదని.. నర్సాపురం ఎంపీ...

HOT NEWS

[X] Close
[X] Close