రాలేనంటూ హైకోర్టులో జగన్ పిటిషన్ ..!

సీబీఐ, ఈడీ కోర్టులు .. రావాలి జగన్ అన్న ఒక్క నినాదానికే ఫిక్సయిపోవడంతో.. ఏపీ ముఖ్యమంత్రి ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ముఖ్యమంత్రిగా ఉంటున్న తాను ప్రతి శుక్రవారం..కోర్టుకు వెళ్లడం ఏమిటన్న ఉద్దేశంలో ఉండటంతో.. మినహాయింపు కోసం మరోసారి కోర్టు మెట్లెక్కారు. వ్యక్తిగత హాజరు మినహాయింపు పిటిషన్లను సీబీఐ కోర్టు కొట్టి వేయడంతో.. ఆ ఆదేశాలను సవాల్ చేస్తూ.. ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. ముఖ్యమంత్రిగా తాను తీరిక లేకుండా పాలనా వ్యవహారాల్లో ఉంటున్నానని.. వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలని ఆయన పిటిషన్‌లో కోరారు.

మొదట సీబీఐ కేసుల్లో.. తర్వాత ఈడీ కేసుల్లో వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వడానికి సీబీఐ, ఈడీ కోర్టులు నిరాకరించాయి. తప్పనిసరిగా కోర్టుకు రావాల్సిందేనని స్పష్టం చేశాయి. 31వ తేదీన కోర్టుకు రాకపోతే.. తదుపరి ఆదేశాలు జారీ చేస్తామని హె్చచరికలు కూడా జారీ చేశాయి. ఈ క్రమంలో… హైకోర్టులో జగన్మోహన్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. నిజానికి గతంలో పాదయాత్రకు సిద్ధమైన సమయంలోనూ.. జగన్ ఇలాంటి పిటిషన్ దాఖలు చేశారు. అప్పుడు కూడా సీబీఐ కోర్టు కొట్టి వేసింది. ఈ ఉత్తర్వులపై హైకోర్టుకెళ్లారు. హైకోర్టు కూడా.. కింది కోర్టు నిర్ణయాన్ని సమర్థించింది.

దీంతో వారం వారం.. కోర్టుకు వస్తూ పాదయాత్ర చేశారు. కొద్ది రోజుల క్రితం.. సీబీఐ కోర్టు మరోసారి మినహాయింపు నిరాకరించినప్పుడు ఇచ్చిన తీర్పులో.. హైకోర్టు కూడా.. గతంలో మినహాయింపు ఇవ్వడానికి నిరాకరించినందున.. సుప్రీంకోర్టుకే వెళ్లే అవకాశాన్ని ఇచ్చింది. అంటే.. హైకోర్టుకు వెళ్లే అవకాశాన్ని సీబీఐ కోర్టు ఇవ్వలేదు. అయినప్పటికీ.. జగన్మోహన్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేయడం.. వ్యూహాత్మకంగా చేశారన్న అభిప్రాయాలు న్యాయవాద వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రివ్యూ: ‘బొంభాట్‌’

వేర్ ద లాజిక్ స్టార్స్ట్‌... డ్రామా ఎండ్‌, వేర్ ద డ్రామా స్టార్ట్స్ .. లాజిక్ ఎండ్‌ - అని హిచ్ కాక్ అనే ఓ పెద్దాయ‌న చెప్పాడు. లాజిక్‌వేసుకుంటూ వెళ్లిన చోట...

ర‌జ‌నీ మ్యాజిక్ చేయ‌గ‌ల‌డా??

రజనీకాంత్ రాజకీయం ఇప్పటి మాట కాదు. మూడు దశాబ్దాల నుంచి నానుతోంది. కానీ రజనీ మాత్రం ''దేవుడు ఆదేశిస్తాడు' అనే సినిమా డైలాగులతోనే సరిపెట్టేశారు. అయితే ఎట్టకేలకు రజనీ నుంచి పొలిటికల్ పార్టీ...

“తాపీ దాడి” కేసులో కొల్లు రవీంద్రకు నోటీసులు..!

మచిలీపట్నం పోలీసులు తాపీ దాడి కేసును మెల్లగా మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్ర వద్దకు తీసుకెళ్తున్నారు. ఆయనకు సెక్షన్ 91 కింద నోటీసులు పంపారు. విచారణకు హాజరు కావాలని...

ఏపీ అసెంబ్లీ : రెండో సైడ్ కనిపించకూడదు..! వినిపించకూడదు..!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వరుసగా నాలుగో రోజు కూడా టీడీపీ సభ్యుల్ని సస్పెండ్ చేసి సభను నిర్వహించారు. రాష్ట్రంలో అమూల్ మిల్క్ ప్రాజెక్ట్ అంశంపై చర్చ జరుగుతున్నప్పుడు.. తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని టీడీపీ...

HOT NEWS

[X] Close
[X] Close