కేంద్రం వద్ద పెండింగ్‌లో పది రాష్ట్రాల “మండలి” తీర్మానాలు..!

ఆరు రాష్ట్రాల్లో మాత్రమే శాసన మండలి ఉందని.. మన రాష్ట్రానికి శాసనమండలి అవసరం లేదని ముఖ్యమంత్రి గట్టిగా చెబుతూంటే… ధర్మాన వంటి ఆయన శిష్యులు.. ప్రపంచంలో ఎగువ సభల ఎన్నెన్ని దేశాల్లో ఉన్నాయో లెక్కలు వివరిస్తున్నారు. వాటిలో ఎంత నిజముందో.. వారికే తెలియాలి కానీ.. ప్రస్తుతం దేశంలో తమ రాష్ట్రానికి శాసనమండలి పెట్టుకునే అవకాశం ఇవ్వాలంటూ.. పది రాష్ట్రాలు కేంద్రానికి తీర్మానాలు పంపాయి. కేంద్రం ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. అప్పుడు శాసనమండలిని ఏర్పాటు చేసుకుందామని.. ఎదురు చూస్తున్నాయి. వీటిలో గతంలో.. శాసనమండలిని రద్దు చేసుకుని.. మళ్లీ కావాలని కోరుకుంటున్న రాష్ట్రాలు ఐదు ఉండగా… కొత్తగా ఏర్పాటు చేసుకునే చాన్సివ్వాలని మరో ఐదు రాష్ట్రాలు కోరుతున్నాయి.

శాసనమండలిని ఏర్పాటు చేసుకోవడం అనేది.. రాష్ట్రాల ఇష్టం. ఆ ప్రకారం… మొదట్లో కొన్ని రాష్ట్రాలు శాసనమండలిని ఏర్పాటు చేసుకున్నాయి. ఆ తర్వాత మధ్యప్రదేశ్, పంజాబ్, తమిళనాడు, బెంగాల్ అవసరం లేదని రద్దు చేసుకున్నాయి. మళ్లీ కొన్నేళ్లుగా.. తమకు మళ్లీ మండలి అవసరం ఉందని.. ఏర్పాటు చేయాలంటూ.. కేంద్రానికి తీర్మానాలు పంపుతున్నాయి. గత ఏడాది మధ్యప్రదేశ్ అసెంబ్లీ తీర్మానం చేసి పంపింది. అది ఇంకా పెండింగ్‌లో ఉంది. మధ్యప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు.. 2018లో మండలిని పునరుద్ధరించాలని మోదీ సర్కార్‌కు తీర్మానం పంపారు. కానీ దాన్ని కోల్డ్ స్టోరేజీలోనే పె్టటారు. పంజాబ్ ఇప్పటికి మూడు సార్లు తీర్మానాలు చేసి పంపింది. బెంగాల్ 2017లో తీర్మానం చేసి పంపినా.. కేంద్రం పట్టించుకోవడం లేదు.

ఇప్పటి వరకూ శాసనమండలి ఏర్పాటు చేసుకోని ఐదు రాష్టాలు.. తమ రాష్ట్రానికి అవకాశం ఇవ్వాలని కోరుతూ.. కేంద్రానికి తీర్మానాలు పంపాయి. ఒడిషా, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఇప్పటి వరకూ కౌన్సిల్ లేదు. గత రెండు, మూడేళ్లుగా ఈ రాష్ట్రాలు.. అసెంబ్లీల్లో తీర్మానాలు చేసి పంపినా.. ఇంత వరకూ కేంద్రం స్పందించలేదు. శాసనమండలికి సంబంధించి.. రాష్ట్రాలు పంపే తీర్మానాలను కేంద్రం… ఓ వరుసగా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఆ లెక్కన.. ఏపీ సర్కార్ చేసే తీర్మానం.. ఈ పది తీర్మానాల తర్వాతే… కేంద్రం పరిగణిస్తుంది. వాటినే ఏళ్ల తరబడి పెండింగ్‌లో పెట్టిన కేంద్రం.. జగన్మోహన్ రెడ్డి సర్కార్ చేసిన తీర్మానాన్ని ఆఘమేఘాల మీద పరిష్కరిస్తుందా..అన్నది చర్చనీయాంశంగా మారింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పవన్‌ను ఆశీర్వదించిన పిఠాపురం !

పిఠాపురం చరిత్రలో ఎప్పుడూ లేనంత భారీ ర్యాలీ జరిగింది. పవన్ తాను అద్దెకు తీసుకున్న చేబ్రోలులోని ఇంటి నుంచి నామినేషన్ వేసేందుకు ఆర్వో ఆఫీసుకు వచ్చేందుకు ఐదు గంటలకుపైగా సమయం...

సూరత్ తరహాలో సికింద్రాబాద్ చేజారుతుందా..?

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మల్కాజ్ గిరి, సికింద్రాబాద్ , చేవెళ్లలో ఎలాగైనా గెలవాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. మల్కాజ్ గిరి, చేవెళ్లలో అభ్యర్థుల ప్రచారంలో దూకుడుగా సాగుతున్నా సికింద్రాబాద్ లో మాత్రం...

వైసీపీకి ఏబీవీ భయం – క్యాట్ ముందు హాజరు కాని ఏజీ !

సస్పెన్షన్ లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కేసును వీలైనంతగా లేటు చేసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. విచారణకు హాజరు కావాల్సిన అడ్వాకేట్ జనరల్ డుమ్మా కొట్టారు. అదే కారణం...

అప్పుల క‌న్నా ప‌న్నులే ఎక్కువ‌… ప‌వ‌న్ ఆస్తుల లిస్ట్ ఇదే!

సినిమాల్లో మాస్ ఇమేజ్ ఉండి, కాల్ షీట్ల కోసం ఏండ్ల త‌ర‌బ‌డి వెయిట్ చేసినా దొర‌క‌నంత స్టార్ డ‌మ్ ఉన్న వ్య‌క్తి ప‌వ‌న్ క‌ళ్యాణ్. పిఠాపురం నుండి పోటీ చేస్తున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close