జగన్ రెడ్డి ఎలాంటివాడు ? ఈ ప్రశ్నకు వచ్చే ఆన్సర్ నూటికి నూరుశాతం అసెంబ్లీలో బాలకృష్ణ అన్న మాటే వస్తుంది. వైసీపీ నేతల నుంచి కూడా. కాకపోతే వారు బయటకు చెప్పరు. వైసీపీ నుంచి వచ్చేశాక చెబుతారు. కొంత మంది వైసీపీలో ఉండి కూడా చెబుతారు. సాధారణ ప్రజల సంగతి చెప్పాల్సిన పని లేదు. ఇతరుల్ని బూతులు తిట్టించి, పుట్టుకల్ని ప్రశ్నింపచేసి చిద్విలాసంగా నవ్వుకునే ఆయన తీరును చూసి ఎవరూ మరో విధంగా అనుకోరు. ఐదు సంవత్సరాల పాటు అధికారంలో ఉండి చేయించిన నిర్వాకాలను చూసి.. నిశ్చేష్ఠులవ్వని జనం లేరు. అందుకే ఆయనకు ఏకగ్రీవంగా ఆ బిరుదును ఇచ్చేశారు. కానీ ఇప్పుడు కొత్తగా ఆయన అది కాదు.. మంచోడు అని రుద్దేందుకు వైసీపీకి చాన్స్ వచ్చింది. ప్రారంభించేశారు.
జగన్ ఎలాంటివాడో అందరూ చూశారు కదా !
చిరంజీవి రాశారో లేదో తెలియదు కానీ.. బయటకు వచ్చిన లేఖ తర్వాత జగన్ రెడ్డి చిరంజీవిని అవమానించలేదని నమ్మించడానికి వైసీపీ నేతలు కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు. చిరంజీవిని అవమానించారో లేదో ప్రజల కళ్ల ముందే ఉంది. అధికారికంగా రిలీజ్ చేసిన వీడియో ను చూసిన ఎవరికైనా అది గౌరవమో.. మరొకటో అర్థమైపోతుంది. ఇప్పుడు కొత్తగా నమ్మించాల్సిన పని లేదు. కానీ చిరంజీవి పేరుతో ఓ ఫేక్ లెటర్ రిలీజ్ అయిందని.. దాని ఆధారంగా జగన్ మంచోడని రుద్దేందుకు ప్రయత్నిస్తుంది.
జగన్కు మంచి సర్టిఫికెట్ ఇవ్వాలని బేరాలు !
ఇదే సందు అనుకుని చిరంజీవి పేరుతో వచ్చిన ఫేక్ లెటర్ తరహాలోనే కొంద మంది స్టేట్ మెంట్లు ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఆర్ నారాయణమూర్తిని రంగంలోకి దించారు. ఇంకెవరూ ముందుకు రాలేదు. కానీ పార్టీ నేతలు మాత్రం అదే పనిగా జగన్ మంచోడని చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అసెంబ్లీలో కామినేని, బాలకృష్ణ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంది జగన్ రెడ్డి గురించి చేసినవి కాదు.. చిరంజీవి విషయంలో జరిగిన చర్చను మాత్రమే. అయినా జగన్ రెడ్డిని అన్న వ్యాఖ్యల్ని రికార్డుల నుంచి తొలగించాలని వారు సంబరపడుతున్నారు. అదే వారి చిత్తభ్రమకు నిదర్శనం. జగన్ గురించి మంచోడని సర్టిఫికెట్ ఇచ్చినంత మాత్రాన ఆయన మంచోడవుతారా?
జగన్ గురించి జనానికి అంతా తెలుసు
జగన్ గురించి జనానికి అంతా తెలుసు. ఆయన మంచితనమేంటో తెలుసు. ఆయన వ్యక్తిత్వం కూడా అందరికీ తెలుసు. తల్లి, చెల్లిపై ఆస్తుల కోసం కోర్టుకెక్కే.. అది కూడా అక్రమంగా సంపాదించిన వాటి కోసం.. వ్యక్తిత్వం తెలుసు. సొంత బాబాయ్ ను చంపేస్తే వ్యవహరించిన విధానం గురించి తెలుసు. ప్రజలిచ్చిన అధికారంతో అందర్నీ ఎలా హింస పెట్టారో అందరికీ తెలుసు. ఇలాంటి వ్యక్తి గురించి కొత్తగా ప్రజలను నమ్మించే ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. ప్రజలు అంత త్వరగా మర్చిపోలేరు.