వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవర్తన, మాటలను బట్టి చూస్తే ఆయన ఆరోగ్యం రోజు రోజుకు క్షీణించిపోతుందని ఎవరికైనా అనిపించడం సహజం. చంద్రబాబు మీద పట్టరాని ద్వేషంతో.. ఆయన దేనికైనా సిద్ధపడే వ్యక్తిగా మారుతున్నారు. జరగని వ్యవహారాలను జరిగినట్లుగా చెప్పడం దగ్గర నుంచి చచ్చిపొమ్మని సలహాలివ్వడం వరకూ జనగ్ ప్రవర్తన చేస్తూంటే..ఆ పరిస్థితి మరింత ముదిరితే జగన్మోహన్ రెడ్డిని కంట్రోల్ చేయడం కష్టమని మానసిక నిపుణలు భావిస్తున్నారు.
హిస్ట్రియోనిక్ పర్సనాలిటీ డిసార్డర్ అని ఓ మానసిక రోగం ఉంటుంది. ఈ రోగ లక్షణాలు ఏమిటంటే ” తమను తాము ఉన్నతంగా ఊహించుకుంటారు.. తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి లేదా ఇతరులను అణచివేయడానికి, వారు ప్రత్యర్థులపై అసహ్యమైన రూమర్స్ ప్రచారం చేస్తారు. సానుభూతి లోపం, ఇతరులను ఉపయోగించుకోవడం, డ్రామాటిక్ ప్రవర్తన, దృష్టిని ఆకర్షించడానికి లేదా ఇతరులను దెబ్బతీయడానికి రూమర్స్ సృష్టించడం” వంటివి చేస్తారు. ఈ ప్రవర్తనను ఒక వ్యాధిగా నిర్ధారించడానికి, ఒక అర్హత కలిగిన సైకియాట్రిస్ట్ లేదా సైకాలజిస్ట్ ద్వారా సమగ్ర మూల్యాంకనం అవసరమని వైద్య నివేదికలు సూచిస్తున్నాయి.
ఎప్పుడో పెద్దిరెడ్డి .. చంద్రబాబును కొట్టాడని ఇప్పుడు ప్రతీకారం తీర్చుకుంటున్నారని.. యాభై ఏళ్లకిందట వాటిని ఇప్పుడు రూమర్స్ గా ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు తనను చూసి భయపడుతున్నాడని అంటున్నారు. చంద్రబాబు బావిలో దూకాలని అంటున్నారు.ఇవే కాదు.. జరగని వాటిని జరిగినట్లుగా ఊహించుకుంటున్నారు. నల్లపురెడ్డి ఇంటిపై దాడి జరిగినప్పుడు ఆయన ఇంట్లో లేరు. కానీ ఆయన చేతికి దెబ్బలు తలిగినట్లుగా పరామర్శలో సమయంలో చేతిని .. తన చేతుల్లోకి తీసుకుని ఓవరాక్షన్ చేశారు.
ఇప్పటికి కూటమి పాలన ఏడాది మాత్రమే అయింది. ఇప్పుటికే పూర్తిగా జగన్ మానసికంగా దెబ్బతిన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. ముందు ముందు ఇంకా జగన్ చేసిన తప్పులకు చాలా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని టీడీపీ నేతలంటున్నారు. ఇప్పటికే తట్టుకోలేకపోతే.. ఎలా అని సెటైర్లు వేస్తున్నారు.