బెంగళూరు వెళ్లిపోయిన జగన్కు ఆలమట్టి డ్యాం ఎత్తుపెంపు, రాయలసీమప్రాజెక్టులపై నిర్లక్ష్యం, కృష్ణాజలాల్లో ఏపీ వంటి వాటి విషయాల్లో బెంగ పట్టుకుంది. ఏపీకి అన్యాయం జరిగిపోతోందని ఆందోళన చెంది వెంటనే చంద్రబాబుకు 9పేజీల లేఖ .. అది కూడా ఇంగ్లిష్ లో రాయించారు. దానికి సంతకం పెట్టి తన ట్విట్టర్ హ్యాండిల్ లో పోస్టు చేయించారు. తెలంగాణలో ఎవరైనా కృష్ణా జలాల పేరుతో స్పందించగానే ఇక్కడ జగన్ లేఖ విడుదల చేస్తారు.
చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే.. ఏపీకి కృష్ణా జలాల ఒప్పందం కుదిరింది. ఇప్పుడు తెలంగాణనే మళ్లీ మార్పులు చేయాలని కోరుతోంది. అది తెలంగాణ డిమాండ్ . ఏపీ అంగీకరించే అవకాశాలు లేవు. అప్పట్లో చట్ట ప్రకారం కేటాయించారు. రీ కేటాయింపులు చేయాలంటే కుదరదు. ఏపీ అంగీకరించదు. అయినా జగన్ గగ్గోలు పెట్టేస్తున్నారు. తెలంగాణ అడుగుతోందని చెబుతున్నారు. ఇక అలమట్టి ఎత్తు పెంపు గురించి కూడా తెగ మాట్లాడేస్తున్నారు. అసలు కర్ణాటక ప్రభుత్వం ఆ ఆలోచన జగన్ ఉన్నప్పుడు కూడా చేసింది. అప్పుడు ఒక్క మాట మాట్లాడలేదు. తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వమే వ్యతిరేకిస్తే.. కర్ణాటకలోకాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుంది?
ఇక రాయలసీమప్రాజెక్టుల గురించి జగన్ చెప్పుకొచ్చారు. ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందట. ఐదేళ్ల పాటు జరిగిన నిర్లక్ష్యాన్ని సరిదిద్ది వెంటనే పనులు చేయించడంతో ఈ సారి రాయలసీమలో చిన్నా, చితకాచెరువులతో సహా అన్నింటినీ నింపేశారు. బనకచర్లకు అడ్డం పడ్డారు. ప్రాజెక్టుల పనులను వేగంగా చేయిస్తున్నారు. అయినా జగన్ నిర్లక్ష్యం అని సెంటిమెంట్ పండించే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఐదేళ్ల పాటు.. రాష్ట్రం మొత్తం ప్రాజెక్టుల్ని నిర్లక్ష్యం చేసింది ఆయన మర్చిపోయినట్లుగా నటిస్తున్నారు.