జగన్, పవన్‌లకు రైతులందరూ పూజలు చెయ్యాల్సిందేనా?

అధికారంలోకి రావడం కోసం మాత్రమే రైతుల జపం చేస్తాడు చంద్రబాబు. అధికారంలోకి వచ్చాక మాత్రం రైతు సమస్యల గురించి ఆలోచించే తీరక చంద్రబాబుకు ఉండదు. అంతా కూడా కార్పొరేట్ వ్యవహారాలతోనే కాలం గడిపేస్తూ ఉంటాడు. పరిశ్రమల కోసం భూములు ఇవ్వాల్సిందే, రైతులు త్యాగాలు చెయ్యాల్సిందే అని చంద్రబాబు అంత కఠినంగా చెప్పే ముఖ్యమంత్రి ఇంకొకరు ఎవరైనా ఉన్నారా? రైతుల నుంచి భూ సేకరణ చేసి రాజధాని నిర్మిస్తానని, ఆ తర్వాత చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలన్నింటికీ కూడా రైతులందరూ సొంత భూములను త్యాగం చేస్తూ ఉండాల్సిందేనని 2014 ఎన్నికల ప్రచారం సమయంలో చంద్రబాబు ఎందుకు చెప్పలేదు? ఓట్లకు ఎసరు తెచ్చే ఆ నిజాలను ఎప్పుడూ చెప్పడు చంద్రబాబు. కానీ ఓట్లను గుంపగుత్తగా కొల్లగొట్టే అబద్ధాలు మాత్రం ఎన్నైనా చెప్తాడు. మరీ ముఖ్యంగా పదేళ్ళ పాటు పదవి లేకుండా ఉన్న నేపథ్యంలో 2014 ఎన్నికలను లైఫ్ అండ్ డెత్ పరిస్థితిగా తీసుకున్న చంద్రబాబు చెప్పిన అబద్ధాలు అన్నీ ఇన్నీ కావు. మరీ ముఖ్యంగా రైతులను అయితే పూర్తిగా మోసం చేశాడు చంద్రబాబు. మొదటి సంతకం రైతు రుణమాఫీ ఫైలుపైనే అని చెప్పి….ఆ మొదటి సంతకం నుంచే తన మోసాల చరిత్రను ప్రారంభించాడు చంద్రబాబు. ఎన్నికలకు ముందు ప్రజలకు అన్నీ మంచి మాటలు చెప్పి మోసం చేయడం, అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా వ్యతిరేకంగా పాలన చేయడం లాంటివి జరుగుతూ ఉండబట్టే ఎన్నికల వ్యవస్థపైన ప్రజలకు నమ్మకంలేేని పరిస్థితులు దాపురిస్తున్నాయి. ఓటింగ్ శాతం తగ్గుతూ ఉండడానికి ఇది కూడా ఒక ప్రధాన కారణమే. అయితే అధికారంలో ఉన్న వాళ్ళు తప్పులు చేయడానికి భయపడేలా చేయడం కోసం ప్రతిపక్ష పార్టీ వ్యవస్థను సమర్థవంతంగానే ఏర్పరిచారు మన రాజ్యాంగకర్తలు.

మీడియా అమ్ముడుపోవచ్చు. రాజకీయ విశ్లేషకులు, విమర్శకులు కూడా అధికారంలో ఉన్నవాళ్ళ మనసుకు తగ్గట్టుగా నడుచుకుని సొంత లాభం పొందవచ్చు. కానీ ప్రతిపక్షం మాత్రం ఎప్పటికీ ప్రజల తరపున పోరాడుతుందని, తప్పులు చేస్తున్న పాలకులకు వణుకు పుట్టేలా చేస్తుందని మన రాజ్యాంగ నిర్మాతలు భావించారు. మొదట్లో ఆ పరిస్థితులు ఉండేవి కూడా. కానీ ఇప్పుడు మాత్రం పూర్తిగా రివర్స్. మోడీని ఎదుర్కునే స్థాయి నేత ఒక్కరు కూడా లేరు అన్న మాట వాస్తవం. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా చంద్రబాబును ఎదుర్కునే సత్తా జగన్‌కి లేదేమోననిపిస్తోంది. మీడియా మొత్తం చంద్రబాబుకే భజన చేస్తూ ఉండవచ్చు. ప్రత్యేక హోదాతో సహా తాను పోరాటం చేయాలని నిశ్ఛయించుకున్న అన్ని సమస్యలపై కూడా చంద్రబాబు మనుషులే మరో పోరాట డ్రామాలు నడిపిస్తూ జగన్‌కి మైలేజ్ రాకుండా చేస్తూ ఉండవచ్చు. కానీ అలాంటి విపత్కర పరిస్థితుల నేపథ్యంలోనే కదా నాయకుడి సత్తా బయటపడేది. ఊరికే లోకేష్‌ని టార్గెట్ చేసినంత మాత్రాన జగన్ పెద్ద నాయకుడైపోడుగా.

మిర్చి రైతుల సమస్యల గురించి అమరావతిలో అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పటి నుంచీ కూడా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆ సందర్భంలో జగన్ కూడా ఒకసారి మిర్చియార్డుకు వెళ్ళి రైతుల సమస్యలు విన్నాడు. ఆ తర్వాత ఇన్నాళ్ళకు ఆ రైతుల సమస్యలు పరిష్కరించాలంటూ ధర్నాకు కూర్చున్నాడు. అది కూడా కేవలం ఒకటిన్నర రోజు అని చెప్పుకోవాలేమో. షరా మామూలుగానే చంద్రబాబును తిట్టినతిట్టు తిట్టకుండా తిట్టాడు. తన పార్టీ నేతల చేత కూడా లోకేష్‌ని కూడా కలిపి తిట్టించాడు. దీక్ష పట్టిన లక్ష్యం నెరవేరిందనుకున్నాడో ఏమో కానీ ఆ వెంటనే సో కాల్డ్ నిమ్మరసం డ్రామాతో ముగించేశాడు. మిర్చి రైతుల సమస్యలకు సంబంధించి జగన్ చేయగలిగింది ఇంతే అన్నమాట. ఎందకంటే ఆ వెంటనే న్యూజిలాండ్ సమ్మర్ వెకేషన్‌కి వెళ్తున్నాడు జగన్. ఆయన తిరిగి వచ్చేసరికి రైతుల కన్నీటి మంటలు అలాగే ఉంటాయి కానీ సమస్యను మాత్రం ఎవ్వరూ పట్టించుకోని స్థితికి వెళ్ళిపోతుంది.

ఇక ప్రజల తరపున ప్రశ్నిస్తా, ప్రాణాలిచ్చేస్తా అంటూ సినిమాల్లో కంటే కూడా రాజకీయాల్లోనే ఎక్కువ నటిస్తున్న పవన్ అయితే మరీ ఘోరం. జగన్‌ చేసిన ఒకటిన్నర రోజు దీక్షకు ఎక్కడ మైలేజ్ వస్తుందని ఫీలయ్యాడో ఏమో, లేకపోతే వెనుక నుంచి ఎవరైనా చెప్పారో ఏమో కానీ వెంటనే ట్వీట్స్ పేల్చాడు. అది కూడా అధికారంలో ఉన్న చంద్రబాబు పేరు కూడా ప్రస్తావించకుండా నాలుగు మాటలు మాట్లాడేశాడు. అదేంటో మరి….పవన్ టార్గెట్ ఎప్పుడూ అధికారంలో ఉన్న చంద్రబాబుకంటే జగన్ పైనే ఎక్కువ ఉంటోంది. మొత్తంగా షూటింగ్ గ్యాప్‌లో ఎసి కారవాన్‌లో కూర్చుని చేసిన ఒక్క ట్వీట్‌తో మిర్చి రైతుల సమస్యలను పరిష్కరించేశాడు పవన్. ఇక ఇప్పుడు ప్రభుత్వంపైన కోపంగా ఉన్న మిర్చి రైతులందరూ కూడా ఈ ఇద్దరు విపక్షనేతలకు పట్టం కట్టాలేమో.

రైతన్న దేశానికి వెన్నెముక లాంటి గొప్ప గొప్ప మాటలేమో రైతులకు, చేతలన్నీ కూడా కార్పొరేట్ సంస్థలకు. అందుకే రైతన్న రోజు రోజుకూ చచ్చిపోతున్నాడు……..కార్పొరేట్ జనాలు, వాళ్ళతో కుమ్మక్కయిన పాలకులు కోటాను కోట్లు సంపాదిస్తున్నారు. మధ్యలో బ్రోకర్స్ కూడా బాగానే బాగుపడుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close