జగన్ రెడ్డి విహారయాత్రకు యూరప్‌కు వెళ్తున్నారు. ఇప్పటికి రెండు వారాలుగా ఏపీలో లేరు. యూరప్ కు వెళ్లే ముందు ఏదో ఒకటి స్కిట్ వేయకపోతే ప్రజలు మర్చిపోతారని అనుకున్నారేమో కానీ.. మెడికల్ కాలేజీ సందర్శనకు ప్లాన్ చేసుకున్నారు. అనకాపల్లిలో పునాదులు వేసిన మెడికల్ కాలేజీని చూసేందుకు జగన్ రెడ్డి 9వ తేదీ వస్తున్నారని పార్టీ నేతలు ప్రకటించారు. ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు. జన సమీకరణలు.. దండాలతో పాటు తెల్ల కోట్లు వేసుకుని కొంత మందిని రంగంలోకి దింపే ఆలోచన కూడా చేస్తున్నారు.
ఇప్పటికే మెడికల్ విద్య పేదలకు దూరమైపోయిందని శోకాండాలు పెడుతూ.. టీవీల్లో పెయిడ్ ఆర్టిస్టుల వీడియోలు వేస్తున్నారు. పార్టీ నేతలు రోజువారీ ప్రదర్శనలు అక్కడక్కడా చేసి చానళ్లలో వేసుకుంటున్నారు. అసలు మెడికల్ కాలేజీలు పీపీపీకి ఇస్తున్నారంటే.. ప్రజలకు ఏమీ తెలియదని.. ప్రైవేటు పరం చేసేస్తున్నారని చెబితే నమ్మేస్తారని రాజకీయం చేయడమే విచిత్రం. పైగా తాము కట్టేశామని.. దాన్ని అమ్ముతున్నారని కూడా ప్రచారం చేస్తున్నారు. రియాలిటీ చూస్తే ఇసలు మొండిగోడలు కూడా లేవు.
ఇంతకు మించిన పెద్ద విషయం లేదన్నట్లుగా జగన్ ఈ మెడికల్ కాలేజీలను ఎందుకు పెట్టుకున్నారో కానీ.. లండన్ వెళలే ముందు ఆ అంశంపైనే ఓ సారి స్కిట్ వేసి వెళ్లాలనుకుంటున్నారు. తొమ్మిదో తేదీన అనకాపల్లి వెళ్లి ఆ తర్వాత పదిహేను లోపు ఆయన దేశం దాటుతారు. ఎందుకంటే కోర్టు పదిహేను రోజుల గడువు ఇచ్చింది. వెళ్లి వచ్చాక కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంది. హాజరవుతారా.. మరో పిటిషన్లు వేస్తారా అన్నది వెళ్లి వచ్చాక క్లారిటీ వస్తుంది.