ఉమ్మడి నెల్లూరు జిల్లాలో భాగమైన గూడూరు .. తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. జగన్ పార్లమెంట్ నియోజకవర్గానికో జిల్లా చేస్తానని చెప్పి అడ్డదిడ్డంగా జిల్లాలు ఏర్పాటు చేశారు. అప్పట్లో గూడూరు తిరుపతి జిల్లాలోకి పోయింది. జిల్లా కేంద్రం దూరమైపోయింది. అప్పుడు వైసీప నేలంతా సూపర్ సైలెంటుగా గా ఉన్నారు. ఒక్కరూ మాట్లాడలేదు. కానీ ఇప్పుడు మాత్రం గూడూరును నెల్లూరు జిల్లాలో కలపాలని ఆమరణదీక్షలు చేస్తామని బయలుదేరుతారు.
నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, కాకాణి గోవర్దన్ రెడ్డిలకు ఇంకేమీ ఇష్యూ దొరకలేదు. గూడురును నెల్లూరులో కలపకపోతే ఆమరణదీక్షలసు చేసి చచ్చిపోవడానికి సిద్ధమని ప్రకటనలు చేస్తున్నారు. వీరి ప్రకటనలు చూసి… గూడూరు ప్రజలు కూడా ఆశ్చర్యపోతున్నారు. అసలు నెల్లూరులో ఉన్న గూడూరును కలిపింది జగన్ రెడ్డి కదా.. అప్పుడెందుకు మాట్లాడలేదని సందేహపడుతున్నారు. గూడురు పట్ల ఇంతా ఆవేదన, అభిమానం ఉంటే.. ఇప్పుడు మాత్రమే ఎందుకు స్పందిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.
గూడూరును నెల్లూరులోనే ఉంచాలన్నది ప్రజల డిమాండ్. అక్కడ టీడీపీ ఎమ్మెల్యే కూడా అదే చెబుతున్నారు. కావాలంటే పదవి వదులుకుంటానంటున్నారు. కానీ గూడురు నియోజకవర్గం తిరుపతి జిల్లాలోనే ఉండాలని ప్రభుత్వ అనుకుంటోంది . అక్కడ పోర్టు ఉంది. ఆ పోర్టు వల్లనే తిరుపతి జిల్లాలో ఉంచాలని అనుకుంటున్నారు. ప్రభుత్వం ఇంకా అధికారికంగా నిర్ణయం తీసుకోలేదు. జగన్ రెడ్డి తప్పు చేస్తే..దాన్ని దిద్దారని వైసీపీ నేతలు .. ఆయన పార్టీలోనే ఉండి ఆమరణదీక్షలు చేస్తామని ప్రకటించడం.. రాజకీయానికే హైలెట్ అనుకోవచ్చు.