జగన్మోహన్ రెడ్డి వారంలో రెండు, మూడు రోజులు మాత్రమే తాడేపల్లిలో ఉంటారు. అది కూడా అన్ని వారాలు కాదు మధ్యలో పండుగలు, సెలవులు వస్తే ఆ వారం తాడేపల్లికి రారు. బెంగళూరులోని యలహంక ప్యాలెస్‌లో ఉన్నారు అన్న సమాచారం మాత్రమే తెలుస్తుంది. అక్కడ ఏం చేస్తున్నారు?. ఊరికనే ఇంట్లో తిని పండుకుంటారా? లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్తున్నారా? అన్నది ఎవరికీ తెలియదు. కానీ ఆయన కామ్‌గా ఉండే రాజకీయ నేత కాదు. రాజకీయం అంటే ఆయనకు తెలిసింది వేరు. అలాంటి రాజకీయం చేయడానికి ఆయన తన శక్తినంతా ఉపయోగిస్తారు. ఇప్పుడు బెంగళూరు ప్యాలెస్ లో ఉండి ఆయన అదే రాజకీయ వ్యూహాలు అమలుకు ప్లాన్లు వేస్తున్నారని టీడీపీ వర్గాలు బలంగా నమ్ముతున్నాయి. దానికి సంబంధించిన సమాచారం అందడంతోనే సీనియర్ నేత యనమల రామకృష్ణుడు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు వంటి వారు ఆరోపణలు ప్రారంభించినట్లుగా తెలుస్తోంది.
బెంగళూరు ప్యాలెస్‌లో బ్యాక్ ఆఫీస్
బెంగళూరు ప్యాలెస్‌లో జగన్మోహన్ రెడ్డి ఓ బ్యాక్ ఆఫీస్ ను నిర్వహిస్తున్నారని.. ఏపీ రాజకీయాల్లో పెట్టాల్సిన చిచ్చుల గురించి.. కుల, మత, ప్రాంత విబేధాలను ఎలా రెచ్చగొట్టాలి.. ఎక్కడెక్కడ గొడవలు జరిగితే.. ఇంపాక్ట్ ఉంటుంది.. ఓటు బ్యాంక్ ఎలా చీల్చాలి అన్న అంశాలపై మేథోమథనం జరుగుతోందని టీడీపీ వర్గాలకు పక్కా సమాచారం అందింది. ఇప్పటికే ఆ టీం వ్యూహంతోనే కొన్ని రాజకీయ పరిణామాలు జరిగినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా తిరుపతిలో మద్యం బాటిళ్ల డ్రామా అనేది యాధృచ్చికంగా చేసిన చిల్లర కుట్ర కాదని దాని వెనుక చాలా పెద్ద ప్లాన్ ఉందని నిఘా వర్గాలకు స్పష్టమైన సమాచారం ఉంది. ఇలాంటి కుట్రలకు బెంగళూరు బ్యాక్ ఆఫీసులోనే ప్లాన్లు రెడీ చేస్తున్నట్లుగా చెబుతున్నారు.
కుల, మత , ప్రాంత విద్వేషాలే రాజకీయాలు
జగన్ రెడ్డి ప్రజలకు మంచి చేసి.. లేదా వారి కోసం పోరాడి రాజకీయాలు చేయడం ద్వారా విజయం సాధించాలన్న ప్రజాస్వామ్య పాలసీపై ఎప్పుడూ నమ్మకం పెట్టుకోరు. ఆయన పాలసీ వేరు. గతంలో ఆయన ఒక్క సారి విజయం సాధించారు. అప్పుడు కేవలం కులాన్ని బూచిగా చూపి గెలిచారు. కానీ ఆయన కుల కుట్రలు తర్వాత బద్దలైపోయాయి. ఇప్పుడు మరోసారి అలాంటి ప్లాన్లే వేస్తున్నారు. ఈ సారి కూడా ఆయన కులాలు, మతాలు, ప్రాంతాలనే హైలెట్ చేయబోతున్నారు. రాయలసీమకు తానే అన్యాయం చేసినా అది చంద్రబాబు చేశారని ప్రచారం చేయడానికి ఇప్పటికే గ్రౌండ్ వర్క్ రెడీ అయిపోయింది. ఇక పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేసేందుకు సోషల్ మీడియాలో జనసేన కోసం పోస్టులు పెట్టి పదవులు రాని వారిని గోదావరి జిల్లాలలో చేర్చుకుంటున్నారు. గుళ్లలో అపవిత్రత పేరుతో ఇప్పటికే మత డ్రామాలు కూడా ప్రారంభించారు. ఇవన్నీ యాధృచ్చితంగా జరుగుతున్నవి కావని జగన్మోహన్ రెడ్డి రాజకీయాల గురించి తెలిసిన వారికి స్పష్టత ఉంటుంది.
తాడేపల్లిలో చేస్తే దొరికిపోతారని బెంగళూరు క్యాంపు
జగన్ రెడ్డి రెండు రోజుల రాజకీయాలు చేసే వ్యక్తి కాదు. ఆయన మళ్లీ పదవి కోసం ప్రయత్నించే వ్యక్తి.కానీ ఆయన నైజం.. ప్రజల్ని మెప్పించడం కాదు. అందుకే ఆయన తాడేపల్లిలో ఉండదల్చుకోలేదు. ఏదో రెండు రోజులు వచ్చి ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడి పోతే పనైపోతుందని అనుకుంటున్నారు. ఎన్నికలకు ముందు పాదయాత్ర చేస్తే చాలు.. ప్రజల్లో ఉన్నట్లే అవుతుందని అనుకుంటారు. అయితే తాను చేయాలనుకున్న రాజకీయ కుట్రలు తాడేపల్లిలో చేస్తే ఏదో విధంగా బయటకు వస్తుంది. అందుకే ఆయన బెంగళూరు ప్యాలెస్ ను ఎంచుకున్నారు. అక్కడే అసలు కుట్రలు జరుగుతున్నాయి. వీటిని టీడీపీ ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటున్నది ఇప్పుడు అత్యంత కీలకం.
