ప్రభుత్వం ఏ మంచి పని చేసినా మేమే..మేమే అని రావడం జగన్ రెడ్డికి అలవాటైపోయింది. చంద్రబాబు బుధవారం మూడులక్షలకుపైగా ఇళ్లు పేదలకు పంపిణీ చేశారు. వారు గృహప్రవేశాలు చేశారు. అంతే జగన్ రెడ్డి హేయం.. హేయం అంటూ ట్వీట్ పెట్టేశారు. చంద్రబాబు ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని మూడు లక్షల ఇళ్లు ఎక్కడ నుంచి వస్తాయని అవన్నీ మా హయాంలోనివేనని ఆయన వాదన.
పూర్తి కాని వెలిగొండ, హంద్రీనీవా ప్రాజెక్టులకే పెట్టుడు గేట్లు పెట్టి ఓపెన్ చేసిన రికార్డు ఉన్న జగన్ రెడ్డి.. తన హయాంలో మూడు లక్షల ఇళ్లు పూర్తయితే..వాటిని పేదలకు ఇవ్వకుండా ఎన్నికలకు వెళ్లి ఉంటారా అన్న చిన్న లాజిక్ అయన మిస్సయ్యారు. అదే విషయాన్ని ఆయన కూడా ఒప్పుకున్నారు. చంద్రబాబు పేదలకు ఇచ్చిన వాటిలో తాను దిగిపోయేనాటికి సగం పూర్తయ్యేదశలో ఉన్నాయట. మిగిలిన వాటిలో మళ్లీ సగం శ్లాబ్ వరకూ వేశారట.. మిగిలినవి పునాదులు వేశారట. అవన్నీ చంద్రబాబు హయాంలో పూర్తయ్యాయట. అంటే జగన్ రెడ్డి హయాంలో పూర్తి కానట్లేగా.
ఇళ్ల పేరుతో పేదల్ని అప్పుల పాలు చేశారు జగన్ రెడ్డి. టిడ్కో ఇళ్లపై అప్పులు తెచ్చి.. ఒక్క ఇళ్లు కూడా ఇవ్వలేదు. పేదలు మాత్రం ఈఎంఐ కట్టుకునేలా చేశారు అయినా ఇప్పుడు తగుదునమ్మా అంటూ.. క్రెడిట్ కోసం వచ్చేస్తున్నారు. చంద్రబాబు పేదలకు ఇళ్లు ఇచ్చారని చెప్పడం క్రెడిట్ చోరీ అని గగ్గోలు పెడుతున్నారు. ఈ క్రెడిట్ చోరీ స్కీమ్ ఏంటో కానీ.. జగన్ రెడ్డి గగ్గోలు చూసి..పాపం అని వైసీపీ కార్యకర్తలు కూడా జాలి పడుతున్నారు.


