వైసీపీ అధ్యక్షుడు జగన్ రెడ్డి శవరాజకీయాల్లో పది పీహెచ్డీలు చేశారు. ఆ విషయంలో ఎవరికీ డౌట్ లేదు. ఇప్పుడు కూడా ఆయన అదే పనిలో ఉన్నారు. గుంటూరు నుంచి సత్తెనపల్లి వెళ్లడానికే ఇద్దరు కార్యకర్తల్ని బలి చేశారు. ఇప్పుడు విశాఖ నుంచి మాకవరం పాలెం మెడికల్ కాలేజీకి వెళ్లడానికి రోడ్ షో ప్లాన్ చేశారు. రెండింటి మధ్య 70 కిలోమీటర్ల దూరం. పైగా జాతీయరహదారి. పార్టీ నేతలకు టార్గెట్లు ఇచ్చి మరీ జన సమీకరణ చేస్తున్నారు. ఇదేదో తేడా వ్యవహారంలా ఉందని పోలీసులు .. జాతీయ రహదారిపై రోఢ్ షో కు అనుమతి కుదరదని..జగన్ హెలికాఫ్టర్లో వెళ్లాలని సూచించారు.
అయితే పోలీసులు హెలికాఫ్టర్ లో వెళ్లమంటున్నారంటే ఏదో అనుమానంగా ఉందని.. జగన్ రోడ్ షో చేసుకుంటూనే వెళ్తారని గుడివాడ అమర్నాథ్ ప్రకటించారు. పోలీసులు నిబంధనల ప్రకారం నోటీసులు ఇచ్చారు. అనుమతులు లేవని చెబుతున్నారు. జగన్ రెడ్డి చేసుకుంటూ వెళ్తే .. రూల్స్ ప్రకారం వ్యవహరిస్తారు. ప్రాణాలు తీసేసి…ప్రభుత్వం నిర్లక్ష్యం.. పోలీసులు భద్రత కల్పించలేదు అనే డ్రామాలు ఆడే ప్లాన్లు కూడా ఉన్నాయేమో కానీ.. ఈ విషయంలో రెచ్చగొట్టేలా కన్నబాబు, అమర్నాథ్ మాట్లాడుతున్నారు.
తమిళనాడులో కరూర్ లో విజయ్ తొక్కిసలాట ఘటన జరిగిన తరవాత రాజకీయ పార్టీల ర్యాలీలపై ప్రజల్లో చర్చ జరుగుతోంది. జగన్ రెడ్డి రోడ్డు మీదకు వెళ్తే పట్టుమని పది మంది కూడా రారు. కానీ టార్గెట్లు పెట్టుకుని బిర్యానీ, మందు ఆఫర్ చేసి తరలిస్తారు. వారందరూ జగన్ రెడ్డి మీదకు తోసుకుంటూ ఉండాలని సూచిస్తారు. వీడియోలు, సోషల్ మీడియాల్లో ప్రచారం కోసమే ఇదంతా. హైప్ ఉందని చెప్పుకోవడానికి కార్యకర్తలని బలివ్వడానికి కూడా రెడీగా ఉంటారు. అందుకే పోలీసులు ఈ విషయంలో పూర్తి స్థాయిలో నిఘా పెట్టి..వైసీపీ కుట్రల్ని బయట పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.