చైతన్య : జల వివాదాల్లో ఏపీ ప్రయోజనాల సంగతేమి చేశారు సీఎం గారూ..!?

వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఎవరేమనుకున్నా.. డోంట్ కేర్ అనుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి వెళ్లి వచ్చారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ సీఎం హోదాలో జగన్మోహన్ రెడ్డికి అత్యధిక ప్రాధాన్యం లభించింది. కానీ ఇదే కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై.. గతంలో ఆయన అనేక అభ్యంతరాలు వ్యక్తం చేశారు. జలదీక్షలు చేశారు. అన్నింటికీ మించి.. తెలంగాణ కడుతున్న ప్రాజెక్టుల వల్ల ఏపీకి చుక్క నీరు రాదని.. విమర్శలు గుప్పించారు. ఇప్పుడు ఆ ప్రాజెక్టుల ప్రారంభోత్సవాల వెళ్తున్న జగన్… తన విమర్శలకు.. సమాధానం చెప్పే నైతిక బాధ్యత లేదా..?

సీఎం హోదాలో ఏపీ నీటి ప్రయోజనాలకు గండి కొట్టేశారు..!

కాళేశ్వరం ప్రాజెక్ట్ పై… ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అది అనుమతి లేని ప్రాజెక్ట్ అని.. గోదావరి రివర్ బోర్డ్ దగ్గర చాలా కంప్లైంట్లు పెట్టింది. అపెక్స్ కౌన్సిల్ భేటీ ఎప్పుడు జరిగినా.. లేవనెత్తాలని.. ఏపీ అధికారులు రెడీ అయ్యారు. నీటి కేటాయింపులు లేకుండా… నికర జలాల సంగతి లెక్కచూడకుండా… ఎగువ రాష్ట్రమైన తెలంగాణ సర్కార్ ఏకంగా 200 టీఎంసీల నీటిని తోడుకుంటోందని.. ఏపీ వాదిస్తోంది. ఇప్పుడు… ఏపీలో సర్కార్ మారింది. అయితే.. ఆ పిటిషన్లన్నీ అలాగే ఉన్నాయి. ఏపీ అభ్యంతరాలన్నీ రికార్డెడ్. వాటన్నింటినీ ఉపసంహరించుకోలేదు. ఉపసంహరించుకుంటే సమస్య ఉండేది కాదు. కానీ ఉత్తి పుణ్యాన ఉపసంహరించుకునేంత చిన్న చిన్న కంప్లైంట్లు కావు. ఏపీ సాగునీటి ప్రయోజనాలతో ముడిపడి ఉన్న అంశాలు అవి.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన విమర్శలకు.. సమాధానం చెప్పే నైతికత లేదా..?

కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గతంలో తీవ్రమైన విమర్శలు చేశారు. తెలంగాణ కడుతున్న అక్రమ ప్రాజెక్టులతో.. ఏపీకి చుక్కనీరు రాదని.. జలదీక్షలు చేసి మరీ విమర్శలు గుప్పించారు. ఏపీ – తెలంగాణ మధ్య.. భారత్ – పాకిస్తాన్ లాంటి పరిస్థితి ఎదురవుతుందని హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ మాటలు మాట్లాడి.. అధికారపక్షానికి మారేసరికి.. ప్రారంభోత్సవానికి వెళ్లి… శిలాఫలకం మీద పేరు వేయించుకోవడం ఏమిటన్న చర్చ ఏపీలో ప్రారంభమవుతుంది. తాను అప్పుడు చేసిన విమర్శలకు .. కచ్చితంగా ఇప్పుడు సమాధానం చెప్పాలన్న అభిప్రాయం బలపడుతోంది. అలా చెప్పడం నైతిక బాధ్యత కూడా..! విలువల గురించి మాట్లాడే జగన్మోహన్ రెడ్డి కచ్చితంగా దీనిపై మాట్లాడాల్సి ఉంది.

ఏపీ ప్రజల భావితరాలకు తరగని అన్యాయం జరిగిపోయింది..!

కాళేశ్వరం ప్రారంభోత్సవానికి వెళ్లి జగన్… భవిష్యత్‌లో.. ఆ ప్రాజెక్ట్ ద్వారా తెలంగాణ ఎన్ని నీళ్లు వాడుకున్నా… అడగడానికి ఏపీకి ఎలాంటి హక్కూ లేకుండా చేశారు. ఏమైనా అంటే.. మీ సీఎమ్మే.. వచ్చి… ఓపెనింగ్ చేశారని.. తెలంగాణ వాదిస్తుంది. కోర్టుల్లో.. అయినా.. కేంద్రం దగ్గర అయినా.. ఏపీ వాదన చెల్లకుండా పోతుంది. జగన్మోహన్ రెడ్డి.. శిలాఫలకం కాళేశ్వరం వద్ద పెట్టడం వల్ల… ఏపీ నుంచి టేకిట్ గ్రాంట్‌గా.. తెలంగాణ …నీటిని వాడుకోవడాన్ని ప్రారంభిస్తుంది. ఇది ఒక్కసారితో ఆగేది కాదు..తరతరాలుగా జరుగుతుంది. అంటే..జగన్మోహన్ రెడ్డి.. ఏపీ ప్రయోజనాలను తెలంగాణకు తాకట్టు పెట్టేశారు. కులం మతం.. ప్రాంతం మత్తులో ఓటర్లు ఉండిపోయినంత కాలం.. ఈ నష్టం జరుగుతూనే ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సునీత సాక్ష్యాలకు పాత ఆరోపణలే అవినాష్ రెడ్డి కౌంటర్ !

వివేకా హత్య కేసులో సునీత జస్టిస్ ఫర్ వివేకా పేరుతో పెడుతున్న ప్రెస్ మీట్లు వెల్లడిస్తున్న సంచనల విషయాలతో అవినాష్ రెడ్డికి మైండ్ బ్లాంక్ అవుతోంది. స్పందించకపోతే నిజం అని...

రాయి కేసు : లీకులిచ్చి జగన్ పరువు తీసిన పోలీసులు !

అనవసర డ్రామాలతో భద్రతా వైఫల్యమని పోలీసుల్ని చేతకాని వాళ్లుగా చేస్తున్నారని కోపం వచ్చిందేమో కానీ విజయవాడ పోలీసులు వైసీపీతో పాటు జగన్ పరువు తీసే లీకులు మీడియాకు ఇచ్చారు. జగన్ పై...

మ‌హేష్ – రాజ‌మౌళి.. ముందే ‘రుచి’ చూపిస్తారా?

మ‌హేష్ బాబు సినిమా కోసం రాజ‌మౌళి ఎడ‌తెర‌పి లేకుండా క‌ష్ట‌ప‌డుతున్నారు. స్క్రిప్టు ప‌నులు దాదాపుగా కొలిక్కి వ‌చ్చేశాయి. డైలాగ్ వెర్ష‌న్ బాకీ ఉంది. అది కూడా అయిపోతే... ముహూర్తం ఫిక్స్ చేసుకోవొచ్చు. ఏ...

దేశాన్ని బీజేపీ అధోగతి పాలు చేస్తోందా… వాస్తవాలు ఎలా ఉన్నాయంటే..?

విశ్వగురువుగా భారత్ అవతరిస్తోందని బీజేపీ అధినాయకత్వం గొప్పగా ప్రచారం చేసుకుంటున్నా వాస్తవాలు మాత్రం అందుకు విరుద్దంగా ఉన్నాయి. అభివృద్ధి సంగతి అటుంచితే ఆహార భద్రత విషయంలో బీజేపీ సర్కార్ వైఫల్యం చెందింది. నిరుద్యోగాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close