త్వరలో ఏపీలో ప్రధాన ప్రతిపక్షం బీజేపీనే..! అచ్చంగా ఎంఐఎంలానే..!?

“ఆపరేషన్ ఎల్లో”ను భారతీయ జనతా పార్టీ చాలా సీరియస్‌గా అమలు చేస్తోంది. ఢిల్లీ స్థాయి కసరత్తు ఓ కొలిక్కి వచ్చినందున.. ఇప్పుడు.. ఆంధ్రప్రదేశ్‌పై దృష్టి పెట్టింది. స్థానిక ప్రజాప్రతినిధుల్ని చేర్చుకుని.. టీడీపీని ఫినిష్ చేసి.. ఆ ప్లేస్‌లోకి తాము అడుగు పెట్టేందుకు చేయాల్సింది మొత్తం చేయబోతున్నారు. అంతర్గతంగా ఇప్పటికే తీవ్రమైన కసరత్తు జరుగుతోంది. అందుబాటులో ఉన్న అన్ని వనరులతో.. బీజేపీ… యుద్ధ స్థాయిలో.. టీడీపీని లేకుండా చేసేందుకు.. ప్రయత్నాలు చేస్తోంది.

తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్ష హోదా గల్లంతు చేయబోతున్నారా..?

భారతీయ జనతా పార్టీ ప్రస్తుత లక్ష్యం.. తెలుగుదేశం పార్టీకి ఏపీలో ఉన్న ప్రతిపక్షహోదాను గల్లంతు చేయడం. దాని వల్ల చంద్రబాబును రాజకీయంగా కోలుకోలేని దెబ్బకొట్టడం. అందుకే టీడీపీ తరపున గెలిచిన 23 మంది ఎమ్మెల్యేల్లో.. మెజార్టీ ఎమ్మెల్యేలపై కన్నేశారు. వీరిలో చాలా మంది.. తాము టీడీపీని వదిలేది లేదని చెబుతున్నా.. సుజనా చౌదరి, సీఎం రమేష్ లాంటి వాళ్లే టీడీపీని వదిలిన తర్వాత వీళ్లు చెప్పే మాటలను ఎవరూ నమ్మడానికి అవకాశం లేకుండా పోతోంది. అందుకే… బీజేపీ దాదాపుగా పదిహేను మంది ఎమ్మెల్యేలతో టచ్‌లో ఉందని చెబుతున్నారు. టీడీపీలోని ఓ కీలక నాయకుడ్ని ఇప్పటికే… ఈ విషయంపై… నాయకత్వం వహించడానికి అంగీకరింప చేశారని… ప్రధాన ప్రతిపక్ష నేత హోదా అతనికే ఇస్తామని చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది.

వైసీపీ సంపూర్ణ సహకారం..!

నిజానికి.. ఎంపీల విషయంలో… భారతీయ జనతా పార్టీకి అవకాశాన్ని వదిలేసినా.. ఎమ్మెల్యేల విషయంలో వైసీపీ.. తాను కూడా వాటా పంచుకోవాల్సి ఉంటుంది. కానీ.. వైసీపీ ఇప్పుడు అంత ధైర్యం చేయలేదు. అందుకే.. నీతి సూత్రాలు వల్లిస్తుంది. బీజేపీ అభిప్రాయం ప్రకారం… ఆ పార్టీ నేతలు వ్యవహరించాల్సి ఉంటుంది. అందుకే.. ఎమ్మెల్యేలను బీజేపీ వైపు పంపడానికి… వైసీపీ తన అధికారాన్ని కూడా ఉపయోగించాల్సి వస్తుంది. టీడీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేల గుట్టుముట్లను… తెలుసుకుని.. దానికి తగ్గట్లుగా.. స్కెచ్ వేస్తున్నారు. ఈ ప్రక్రియ.. మరో పది, పదిహేను రోజుల్లో కొలిక్కి రావొచ్చని అంటున్నారు..!

“తానా” సభలకు బీజేపీ రామ్మాధవ్..! అసలు డీల్స్ అక్కడేనా..?

అమెరికాలో అతి పెద్ద ప్రవాసాంధ్రుల ఆర్గనైజేషన్ తాజా సభలు జరగబోతున్నాయి. ఈ సభలకు.. తెలుగుదేశం పార్టీ తరపున గెలిచిన కొంత మంది కీలక నేతలు రానున్నారు. అలాగే.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి.. బీజేపీలో చేరికల ఆపరేషన్లలో దిట్ట అయిన రామ్మాధవ్‌ కూడా వస్తున్నారు. టీడీపీ నేతల్లో గంటా శ్రీనివాసరావు, పయ్యావుల కేశవ్ లాంటి సీనియర్లు కూడా వస్తున్నారు. దీంతో.. అక్కడే.. రామ్మాధవ్ వ్యవహారాలు చక్క బెడతారన్న చర్చలు కూడా సాగుతున్నాయి. మొత్తానికి.. టీడీపీకి.. ప్రతిపక్షహోదా .. ముఖ్యంగా.. చంద్రబాబుకు రాజకీయంగా ఏ హోదా లేకుండా చేసే ప్రయత్నాలన్నీ చురుగ్గా సాగుతున్నాయి, మోడీ , షాల రాజకీయం గురించి ఏ మాత్రం తెలిసిన వాళ్లయినా సరే.. ఇది జరగకుండా ఉంటుందని అనుకోలేరు. తెలంగాణలో ఎంఐఎం ఎలా ప్రతిపక్షంగా గుర్తింపు పొందబోతోందో.. బీజేపీ కూడా అలాగే గుర్తింపు పొందడం ఖాయంగా కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close