భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు, రోడ్లపైనా పొలిటికల్ డ్రామాలు చేసే అభినయ్ రెడ్డిపై ప్రముఖ యాంకర్ రష్మి గౌతమ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దీనికి కారణం ఆయన అత్యుత్సాహంతో రోడ్డుపై చేసిన జబర్దస్త్ తరహా స్కిట్టే. ఇంధన ధరల పెరుగుదలకు నిరసనగా ఒక ఆటోను ఎడ్ల బండిపై ఉంచి, దానిపై మనుషులు కూర్చుని ర్యాలీ నిర్వహించారు. ఆ బరువు అంతటిని ఓ ఎద్దుతో లాగించారు. ఆ వీడియో వైరల్ అయింది.
ఆటో బరువుతో పాటు మనుషుల బరువును మోయలేక ఆ మూగజీవి పడుతున్న ఇబ్బందిని చూసి రష్మి చలించిపోయారు. రాజకీయ నిరసనల కోసం జంతువులను హింసించడం ఏమాత్రం సరికాదని ఆమె మండిపడ్డారు. ఆ ఎద్దు పడిన వేదన ఆ మనుషులపై వెయ్యి రెట్లు పడాలి.. వాళ్లందరికీ అదే గతి పట్టాలి అని శాపనార్థాలు పెట్టారు. వేదికగా తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కేవలం ప్రచారం కోసం జంతువులపై క్రూరత్వం చూపడం హేయమైన చర్య అని ఆమె అభివర్ణించారు.
ఈ ఘటనను తీవ్రంగా పరిగణించాలని రష్మి పెటా ఇండియా, యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా సంస్థలను ట్యాగ్ చేస్తూ కోరారు. మూగజీవులను ఇలాంటి రాజకీయ కార్యక్రమాలకు వాడుకోకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. గతంలో కూడా జంతువులపై జరుగుతున్న అన్యాయాలపై రష్మి అనేకమార్లు గళమెత్తారు, ఈ క్రమంలో భూమనపై ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ, సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.


