జూన్ 26న ‘లెనిన్’ రిలీజ్ చేస్తామని చిత్రబృందం ప్రకటించింది. అయితే అదే రోజున ‘పెద్ది’ రిలీజ్ కి రెడీ గా ఉండడంతో… కాస్త కలవరం మొదలైంది. ‘పెద్ది’ వస్తే గనుక.. ‘లెనిన్’ వాయిదా వేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈలోగా ‘పెద్ది’ కాస్త ముందుకు వచ్చేసింది. జూన్ 4నే ఈ సినిమాని విడుదల చేస్తామని ఈరోజు దర్శక నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. దాంతో.. ‘లెనిన్’ రిలాక్స్ అయిపోయాడు. ఒకవేళ ‘పెద్ది’ గనుక జూన్ 26న వస్తే.. ‘లెనిన్’ కాస్త ముందుకు గానూ, వెనక్కిగానీ వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ బాధ తప్పింది.
ఇటీవల నాగార్జున ‘లెనిన్’ చూశారు. ఈ సందర్భంగా ఓ ట్వీట్ కూడా చేశారు. జూన్ 26న ‘లెనిన్’ రాక కోసం సిద్ధంగా ఉండమంటూ అభిమానుల్ని ఊరించారు. ఆ సమయంలో ‘పెద్ది’ రిలీజ్ డేట్ ఇంకా ఖరారు కాలేదు. అయినా సరే, నాగ్ ధైర్యంగా ట్వీట్ చేయడం ఆశ్చర్యపరిచింది. అప్పుడే `పెద్ది` రాకపై అనుమానాలు మొదలయ్యాయి. అయితే ‘టాక్సిక్’ వాయిదా పడడం పెద్దికి కలిసొచ్చింది. టాక్సిక్ డేట్ ని ‘పెద్ది’ కోసం లాక్ చేయడం.. ‘లెనిన్’కి ప్లస్ అయ్యింది. అలా ‘టాక్సిక్’ వాయిదా ఈ రెండు సినిమాలకూ లాభదాయకమైంది.
‘పెద్ది’ ప్రీమియర్లు జూన్ 3 నుంచే పడబోతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపుగా అన్ని థియేటర్లలోనూ ప్రీమియర్లు ఉంటాయని నిర్మాత స్పష్టం చేశారు.
