వాళ్లకా “చౌకీదార్”..!? బీజేపీ శ్రేణుల్లోనూ నెగెటివ్‌..!

“అనవసరంగా పారిపోయాం… బీజేపీలో చేరాల్సింది..! ” అని ఒకరినొకరు చెప్పుకుని.. నాలిక్కరుచుకుంటున్న విజయ్ మాల్యా, నిరవ్ మోడీల కార్టూన్.. ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. అందులో వంద శాతం నిజం ఉంది. అప్పట్లో రాజ్యసభ సభ్యునిగా ఉన్న విజయ్ మాల్యా… వెంటనే.. బీజేపీ కండువా కప్పుకుని ఉంటే… ఆయన రుణవివాదాల్ని ఎలాగోలా బీజేపీ పెద్దలు పక్కదారి పట్టించి ఉండేవారు. అదే సమయంలో నిరవ్ మోదీ కూడా… బ్యాంకుల్ని కొల్లగొట్టడంలో.. గొప్ప ప్లాన్లు అమలు చేశారు కానీ.. తప్పించుకోవాలంటే.. దగ్గరి దారి బీజేపీ ఉందనే సంగతిని మర్చిపోయారు. నిజానికి వాళ్లిద్దరూ బీజేపీలో చేరి ఉంటే… ఏవో రెండు, మూడు కేసులు పెట్టి… ఈడీ పక్కన పడేసి ఉండేది. వాళ్ల పని వాళ్లు చేసుకుని ఉండేవాళ్లు.

ఆర్థిక నేరగాళ్లు చౌకీదార్‌లాగా బీజేపీ మారిపోయిందా..?

నిజానికి సుజనా చౌదరి, సీఎం రమేష్‌లను ఆంధ్రా మాల్యాలతో పోల్చి.. వారు దేశం విడిచి పారిపోతారని.. కొన్నాళ్లుగా ప్రచారం చేశారు బీజేపీ నేతలు. సుజనా చౌదరిపై.. ఆర్థిక పరమైన ఆరోపణలు ఇప్పుడు కాదు.. గత పదిహేనేళ్ల నుంచి ఉన్నాయి. ఆయన దాదాపుగా.. బ్యాంకులకు రూ. ఏడు వేల కోట్లు ఎగ్గొట్టారని ఆరోపణలు ఉన్నాయి. పదిహేను రోజులకో సారి.. ఆయన ఇళ్లు, కార్యాలయాలపై సీబీఐ, ఈడీ, ఐటీ సోదాలు జరిగాయి. ఇక సీఎం రమేష్ కాంట్రాక్ట్ సంస్థలపై వచ్చిన అవినీతి ఆరోపణలు అన్నీ ఇన్నీ కాదు. ఇన్ని చేసినా.. వారిని సాదరంగా .. బీజేపీలోకి ఆహ్వానించారు పెద్దలు. ఆత్మీయ సమావేశాలు పెట్టి.. చిరునవ్వులు చిందించారు. ఒక్క సుజనా చౌదరి, సీఎం రమేష్‌లు మాత్రమే కాదు.. వివిధ రాష్ట్రాల్లో బీజేపీలో చేరుతున్న వారిపై.. అనేక ఆర్థికపరమైన కేసులు.. ఆరోపణలు ఉన్నాయి. వాటి నుంచి రక్షణ కోసమే బీజేపీలో చేరాల్సిన పరిస్థితులు సృష్టిస్తున్నారు.

ఏడాదిలో శిక్షలన్నారే వాటి సంగతేమయింది..?

‘అవినీతి , ఆర్థికనేరాలెదుర్కొంటున్న ప్రజాప్రతినిధులపై విచారణకోసం ఒక ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేస్తాం. ఏడాదిలోగా కేసుల విచారణ ముగిసేలా నిబంధనలు పెడతాం. అవినీతి కేసులపై ప్రజాప్రతినిధులు విచారణ ఎదుర్కోవాలి. అవినీతి లేకుంటే పార్లమెంటుకు రావాలి. లేదంటే అవినీతి నిర్ధారణ జరిగి జైలుకైనా వెళ్ళాలి’ ..2014 ఎన్నికల ప్రచారంలోనూ.. ఆ తర్వాత అధికారానికి వచ్చిన వెంటనే నరేంద్రమోడీ చేసిన విస్పష్ట ప్రకటన ఇది. దేశప్రజలంతా మోడీ ప్రకటన చూసి చాలా సంతోషించారు. అవినీతి పరుల బెడద వదిలిపోతుందని ఆశించారు. ఆ తర్వాతా మామూలే. ఐదేళ్ళల్లో ఒక్కసారి కూడా సదరు ప్రత్యేక కోర్టు ఊసే ఎత్తలేదు. పైగా అవినీతి కేసులు ఎదుర్కొంటున్న వారితో అవసరార్థం అంటకాగారు. జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి, గాలి జనార్ధన్ రెడ్డి లాంటి వాళ్లపై.. పక్కా సాక్ష్యాలతో నిర్ధిరించగలిగిన సాక్ష్యాలతో కేసులు ఉన్నాయని.. గతంలో.. వివిధ సందర్భాల్లో కోర్టుల వ్యాఖ్యలతోనే తేలిపోయింది. అయినా… మోడీ.. మాత్రం.. వారిని వెనకేసుకుని వచ్చారు. చౌకీదార్‌గా వ్యవహరించారు.

బీజేపీ శ్రేణుల్లోనూ ఇదేం పద్దతనే వాదన..!?

రాజ్యసభ సభ్యులు అన్న కారణం తప్పితే… ఆ నలుగుర్ని చేర్చుకోవడానికి… బీజేపీకి పెద్ద కారణం దొరకదు. ఎందుకంటే.. వాళ్లెవరూ ప్రజానేతలు కాదు. సొంత బలంతో వార్డు మెంబర్‌గా కూడా గెలవలేరు. వాళ్లను ఇప్పుడు పార్టీలో చేర్చుకున్నందుకు.. వాళ్లకు రాజకీయ భవిష్యత్ ఇవ్వక తప్పని పరిస్థితి బీజేపీకి పడింది. అదే సమయంలో అవినీతి పరుల్ని చేర్చుకున్నారనే ముద్ర కూడా వచ్చి పడింది. ఇది బీజేపీ సానుభూతి పరుల్లో అసంతృప్తికి కారణం అవుతోంది. ఉపయోగం లేని వాళ్లను చేర్చుకుని.. మాటలు పడటం ఎందుకన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సోషల్ మీడియా.. బీజేపీ కార్యకర్తలు కూడా.. దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏబీపీ సీఓటర్ సర్వే : బీఆర్ఎస్‌కు ఒక్కటే !

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి మంచి జోరు మీద ఉన్న కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికల్లో గట్టి పోటీ ఎదురయినప్పటికీ పది వరకూ లోక్ సభ సీట్లను గెల్చుకునే అవకాశం...

ఏబీపీ సీఓటర్ సర్వే : టీడీపీ కూటమికి 20, వైసీపీకి 5 లోక్‌సభ సీట్లు

ఎన్డీఏ కూటమి బలం రోజు రోజుకు పెరుగుతోంది. వైసీపీపై వ్యతిరేకత అంతకంతకూ పెరుగుతోందని సర్వేల వెల్లడిస్తున్నయి. అత్యంత ఖచ్చితంగా సర్వేలు, ఒపీనియన్ పోల్స్ వెల్లడిస్తుందని పేరున్న ఏబీపీ- సీఓటర్ ఎన్నికలకు ముందు నిర్వహించిన...

సునీత సాక్ష్యాలకు పాత ఆరోపణలే అవినాష్ రెడ్డి కౌంటర్ !

వివేకా హత్య కేసులో సునీత జస్టిస్ ఫర్ వివేకా పేరుతో పెడుతున్న ప్రెస్ మీట్లు వెల్లడిస్తున్న సంచనల విషయాలతో అవినాష్ రెడ్డికి మైండ్ బ్లాంక్ అవుతోంది. స్పందించకపోతే నిజం అని...

రాయి కేసు : లీకులిచ్చి జగన్ పరువు తీసిన పోలీసులు !

అనవసర డ్రామాలతో భద్రతా వైఫల్యమని పోలీసుల్ని చేతకాని వాళ్లుగా చేస్తున్నారని కోపం వచ్చిందేమో కానీ విజయవాడ పోలీసులు వైసీపీతో పాటు జగన్ పరువు తీసే లీకులు మీడియాకు ఇచ్చారు. జగన్ పై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close