కేంద్రమంత్రి వచ్చినందున కోర్టుకు వెళ్లలేకపోయిన జగన్..!

ఏపి సిఎం జగన్‌ అక్రమాస్తుల కేసులో సీబీఐ కోర్టుకు హాజరు కాలేదు. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్… ఏపీ పర్యటనకువస్తున్న కారణంగా.. ఈ శుక్రవారం మినహాయింపు కావాలని ఆయన లాయర్లు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ అభ్యర్థనను సీబీఐ న్యాయస్థానం అంగీకరించింది. అక్రమాస్తుల కేసులో తదుపరి విచారణ ఈ నెల 22కి వాయిదా పడింది. ఎన్నికల్లో విజయం సాధించినప్పటి నుండి.. వైఎస్ జగన్ కోర్టుకు హాజరు కావడం లేదు. ఆరు నెలలుగా వివిధ కారణాలు చెబుతూ… ఎప్పటికప్పుడు.. అబ్సెంట్ పిటిషన్లు వేస్తున్నారు. శాశ్వతంగా… కోర్టుకు హాజరు నుంచి మినహాయింపు కోసం.. పిటిషన్ దాఖలు చేసినా ప్రయోజనం లేకపోయింది. దాంతో.. ఈ వారం ఆయన కోర్టుకు హాజరవ్వాల్సి ఉంది.

అయితే.. ముఖ్యమంత్రి హోదాలో.. కోర్టుకు హాజరవడం.. అంత మంచిది కాదన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. అందుకే.. ఆయన ఏదో విధంగా మినహాయింపు పొందే ప్రయత్నంలో ఉన్నట్లు చెబుతున్నారు. గతంలోలా.. ప్రతీవారం.. ఏదో ఓ కారణంతో.. పిటిషన్ వేస్తే.. కోర్టు ఎంతో కాలం.. సహనంతో ఉండదని.. వారెంట్ జారీ చేసినా చేయవచ్చని అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో.. మినహాయింపు కోసం.. సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు జగన్ తరపు లాయర్లు కసరత్తు చేస్తున్నట్లుగా చెబుతున్నారు. అందుకే.. ఒకటి, రెండు వారాలు ఏదో విధంగా.. మినహాయింపు ప్రయత్నాలు చేయాలనుకున్నారు. ఈ క్రమంలో తొలి సారి.. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన రూపంలో.. ఓ కారణం దొరికింది.

అయితే.. ప్రతీ వారం ఓ కేంద్రమంత్రి ఏపీకి రాకపోవచ్చని.. ఈ వారం కాకపోతే.. వచ్చే వారమైనా.. జగన్మోహన్ రెడ్డి.. కోర్టు మెట్లెక్కక తప్పదని న్యాయనిపుణులు చెబుతున్నారు. ఈ రోజు జగన్ సీఎం హోదాలో కోర్టు బోనులో నిలబడితే… విమర్శల వర్షం కురిపిద్దామనుకున్న విపక్షాలకు… అవకాశం దక్కలేదు. మరి 22వ తేదీన జగన్మోహన్ రెడ్డి ఏ కారణం వెదుక్కుంటారో..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఫ్లాష్ బాక్‌: ఎన్టీఆర్ కృష్ణ‌ల ‘కురుక్షేత్ర‌’ యుద్ధం

ఒకేరోజు.. రెండు సినిమాలు, అందునా స్టార్ సినిమాలు విడుద‌ల కావ‌డం కొత్తేం కాదు. కానీ.. రెండూ ఇంచుమించుగా ఒకే క‌థ‌తో విడుద‌లైతే, రెండూ ఒకే జోన‌ర్ అయితే.. ఎలా ఉంటుంది? ఆ...

రానా పెళ్లిలో… ప్ర‌భాస్ ‘బావ‌’ మిస్సింగ్‌

శ‌నివారం రాత్రి రానా -మిహిక‌లు అగ్ని సాక్షిగా ఒక్క‌ట‌య్యారు. లాక్ డౌన్, క‌రోనా గొడ‌వ‌లు లేక‌పోతే, ఈ పెళ్లి ధూంధామ్‌గా జ‌రిగేది. కానీ లాక్ డౌన్ ప‌రిమితుల వ‌ల్ల కేవ‌లం 50మంది అతిథుల‌కే...

అగ్నిప్రమాద మృతుల కుటుంబాలకు రూ. 50 లక్షలు : జగన్

విజయవాడ స్వర్ణ ప్యాలెస్‌ అగ్నిప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్య పదకొండుకు చేరింది. అందరూ... కోవిడ్ రోగులే. మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉంది. దాదాపుగా యాభై మంది కోవిడ్ రోగులు ఆస్పత్రిలో ఉండగా.....

నాని సినిమాని సీక్వెల్ వ‌స్తోంది

వాల్ పోస్ట‌ర్ బ్యాన‌ర్ స్థాపించి 'అ' సినిమాతో బోణీ కొట్టాడు నాని. నిర్మాత‌గా త‌న అభిరుచి ఎలాంటిదో తొలి సినిమాతోనే చూపించాడు. ప్ర‌శాంత్ వ‌ర్మ‌ని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేశాడు. 'అ' క‌మర్షియ‌ల్ గా...

HOT NEWS

[X] Close
[X] Close