పోలవరం హైడల్‌ ప్రాజెక్ట్‌ పనులు మళ్లీ నిలిపివేత..!

పోలవరం ప్రాజెక్ట్ పనులకు మరోసారి బ్రేక్ పడింది. తమ పిటిషన్‌పై సింగిల్ బెంచ్ స్టే ఇవ్వడంపై.. విస్తృత ధర్మాసనంలో నవయుగ పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు.. పోలవరం హైడల్‌ ప్రాజెక్ట్‌ పనులు నిలిపివేయాలంటూ హైకోర్టు ఆదేశించింది. నవయుగ పిటిషన్‌పై కోర్టు విచారించింది. ప్రతివాదులకు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాలకు వాయిదా వేస్తామని.. హైకోర్టు తెలిపింది. అయితే.. పనులు ఆలస్యవుతాయన్న కారణంగా.. వచ్చే వారమే తాము.. వాదనలు వినిపిస్తామని ఏపీ ప్రభుత్వ లాయర్లు తెలిపారు. దానికి.. హైకోర్టు అంగీకరించింది. తదుపరి విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. పోలవరం ప్రధాన ప్రాజెక్ట్ పనులు.. హైడల్ విద్యుత్ ప్రాజెక్టు పనులను.. నవయుగ సంస్థ నుంచి.. తప్పించి.. రివర్స్ టెండర్ల ద్వారా మేఘా ఇంజినీరింగ్ కంపెనీకి అప్పగించారు. అయితే.. ఇందుకు నిబంధనలు పాటించలేదని… ఏకపక్షంగా కాంట్రాక్ట్ నుంచి తొలగించారంటూ… నవయుగ సంస్థ కోర్టులో పిటిషన్లు వేసింది. చేసింది. మొదట్లో…రివర్స్ టెండర్లపై.. హైకోర్టు స్టే ఇచ్చింది. ఈ స్టే వేకెట్ చేయాలని.. ఏపీ సర్కార్ కోర్టుకెళ్లింది. అక్టోబర్ 31వ తేదీన.. స్టేలను ఎత్తివేస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది. ఆ తర్వాతి రోజే.. అంటే నవంబర్ ఒకటో తేదీనే మేఘా సంస్థ పనులు కూడా ప్రారంభించింది. ఈ లోపే మరోసారి.. నవయుగ హైకోర్టుకు వెళ్లడం.. మళ్లీ పనులు ఆపాలని హైకోర్టు ఆదేశించడం జరిగాయి.

పోలవరం ప్రాజెక్ట్ అధారిటీ అభిప్రాయాన్ని హైకోర్టు తెలుసుకోనుంది. రివర్స్ టెండరింగ్ పై .. పీపీఏ మొదటి నుంచి వ్యతిరేకతతో ఉంది. ఇలా చేయడం వల్ల.. ప్రాజెక్ట్ నిర్వహణ, భద్రతా పరమైన సమస్యలు వస్తాయని చెబుతోంది. దీనికి సంబంధించి ఏపీ సర్కార్ కూడా.. ఇంత వరకూ.. కేంద్రానికి.. ఎలాంటి నివేదికలూ పంపలేదు. ఈ క్రమంలో… పోలవరం ప్రాజెక్ట్ అధారిటీ స్పందన కీలకం అయ్యే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close