తెలంగాణకు బందరు పోర్టా..? మళ్లీ రచ్చ..!?

ఆంధ్రప్రదేశ్‌లో జగన్ గెలిస్తే..మచిలీపట్నం పోర్టును తెలంగాణకు ఇచ్చేస్తారని ఎన్నికల సమయంలో… జరిగిన ప్రచారం.. ఇప్పుడు మళ్లీ వార్తల్లోకి వస్తోంది. మచిలీపట్నం పోర్టును తెలంగాణకు ఇవ్వడానికి తెర వెనుక ప్రయత్నాలు చివరి దశకు వచ్చాయని… టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించి ఇద్దరూ వేర్వేరుగా ట్వీట్లు చేసి ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. వైసీపీ ప్రభుత్వం బందరు పోర్టును తెలంగాణకు అప్పగించే ప్రయత్నం చేస్తోందని… చంద్రబాబు ఆరోపించారు. జూన్ 28న ఆర్టీ-62 నెంబర్‌తో రహస్య జీవోగా జారీ చేసి.. రెండు రోజుల్లో ‘జారీ చేయబడలేదు’ అని మార్చారని చంద్రబాబు తన ట్వీట్‌లో గుర్తు చేశారు. తెలంగాణకు బందరు పోర్టు ఇస్తున్నారా అని అసెంబ్లీలో ప్రశ్నిస్తే.. అలాంటిదేమీ లేదని బుకాయించారన్నారు. కానీ పోర్టును తెలంగాణకు అప్పగించేందుకు తెరవెనుక ప్రయత్నాలు చివరి దశకు వచ్చాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

సీమాంధ్రకు పోర్టులు ప్రకృతి ఇచ్చిన వరమని …ఇలాంటి పోర్టులపై సొంత నిర్ణయాలు తీసుకునే అధికారం ఎవరికీ లేదని చంద్రబాబు మండిపడ్డారు. మీ స్నేహాలకు, సొంత లాలూచీలకు..రాష్ట్ర ఆస్తులను ధారాదత్తం చేస్తామంటే సహించబోమని హెచ్చరించారు. టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ కూడా.. ఇదే తరహా ఆరోపణలతో ట్వీట్లు చేశారు. ఇవాళ బందరు పోర్టును తెలంగాణకు అప్పగిస్తామంటున్నారు …రేపు పాలన కూడా చేతకావడం లేదని కేసీఆర్‌కు అప్పగిస్తారా? అని ప్రశ్నించారు. ఇలాంటి అసమర్ధులు ఒక్క చాన్స్‌ అంటూ ఎందుకు అడిగారని ప్రశ్నించారు. ప్రజల భవిష్యత్‌ను పక్క రాష్ట్రాలకు తాకట్టుపెట్టడానికా అని మండిపడ్డారు. మచిలీపట్నం తెలంగాణకు అప్పగించడానికి గతంలో ముఖ్యమంత్రుల సమావేశంలో చర్చ జరిగిందన్న ప్రచారం గతంలోనే జరిగింది.

అప్పుడు.. పోర్టులపై ఓ రహస్య జీవోను విడుదల చేసి క్యాన్సిల్ చేయడంతో.. అనుమానాలు పెరిగాయి. ఇప్పుడు…కొన్ని మీడియాల్లో… బందరు తెలంగాణకు అప్పగించడం.. ఏపీకి ఎంతో లాభమని… కథనాలు వస్తూండటంతో… త్వరలోనే… దీనిపై నిర్ణయం తీసుకుంటారని రాజకీయవర్గాలతో పాటు ప్రభుత్వ వర్గాల్లోనూ చర్చ ప్రారంభమైంది. దీనికి సంబంధించి స్పష్టమైన సమాచారం రావడంతోనే.. చంద్రబాబు, లోకేష్ విమర్శలు చేస్తున్నారని.. టీడీపీ వర్గాలంటున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పార్టీ మారడం లేదని తేల్చేసిన పర్చూరు ఎమ్మెల్యే..!

వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారని ప్రచారం జరిగిన పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఎట్టకేలకు స్పందించారు. తన నియోజకవర్గంలోని క్యాంప్ ఆఫీసులో కార్యకర్తలతో సమావేశం అయిన ఆయన.. తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు....

జుంబారే… మ‌న‌వ‌డు వాడేశాడురోయ్

సూప‌ర్ హిట్ పాట‌ల్ని రీమిక్స్ చేసి వినిపించ‌డం మ‌న ఇండ‌స్ట్రీకి కొత్తేం కాదు. అయితే ఎక్కువ‌గా స్టార్ల వార‌సుల సినిమాల కోస‌మే ఆ ప్ర‌య‌త్నాలు జ‌రుగుతుంటాయి. సినిమాల ప్ర‌మోష‌న్‌కి ఆ...

బాలయ్య కోసం చిన్నికృష్ణ

నే‌టి ట్రెండ్‌ని... నేటి ప్రేక్ష‌కుల నాడిని ప‌ట్ట‌లేక కెప్టెన్ కుర్చీకి దూర‌మైన సీనియ‌ర్ ద‌ర్శ‌కులు చాలామందే. ఒక‌ప్పుడు అగ్ర ద‌ర్శ‌కులుగా వెలిగిన వాళ్లంతా కూడా ఆ త‌ర్వాత ప్రాభవాన్ని కోల్పోయారు....

ఆంధ్రా నేతలపై వైరల్ అవుతున్న “హరీష్ సాల్వే” వ్యాఖ్యలు..!

భారత దేశంలో అత్యంత ప్రముఖ న్యాయనిపుణుల్లో ఒకరిగా ఉన్న హరీష్ సాల్వే.. ఆంధ్రప్రదేశ్ రాజకీయ నేతలపై చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. న్యాయవ్యవస్థను కించ పరుస్తున్న నేతలకు గుణపాఠం నేర్పాల్సిందేనని ఆయన పిలుపునిచ్చారు....

HOT NEWS

[X] Close
[X] Close