చంద్రబాబునే నమ్ముకున్న జగన్..! ఇదేం రాజకీయం..!

ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ నాయకుడైనా ప్రజల్లో తనపై నమ్మకం పెంచాలనుకుంటారు. అలా నమ్మకం పెంచుకుని ఓట్లు సంపాదించుకుని అందలం ఎక్కాలనుకుంటారు. దాని కోసమే రాజకీయ వ్యూహాలు సిద్ధం చేసుకుంటారు. అమలు చేస్తారు. ప్రతిపక్షంలో ఉంటే.. ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా పోరాడి.. వారికి న్యాయం చేస్తానని నమ్మించి అందలం ఎక్కాలనుకుంటారు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష శైలి భిన్నంగా ఉంది. ఆయన తనపై తాను నమ్మకం ఉంచుకోవడం లేదు. దేనికైనా చంద్రబాబునే చూపించడానికి ఏ మాత్రం సిగ్గుపడటం లేదు.

చంద్రబాబుకే జగన్, వైసీపీ ప్రచారం ఎందుకు..?

“నిన్నెవరూ మళ్లీ రమ్మన్నారు బాబూ..!”

“నిన్ను..నమ్మం బాబూ..!” … ఇలా వరుస పెట్టి.. ఇటీవలి కాలంలో.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, స్టికర్లు… లక్షలాది రూపాయలు వెచ్చించి తయారు చేసి నియోజకవర్గాలకు పంపుతోంది. కచ్చితంగా తాము పంపిన వాటినే వాడాలని.. పార్టీ నేతలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇటీవలి కాలంలో.. పూర్తిగా చంద్రబాబుకు వ్యతిరేకంగా వైసీపీ ప్రచారం చేయడమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓ స్ట్రాటజీగా పెట్టుకుంది. ప్రతీ దానికి చంద్రబాబునే కారణంగా చూపించడం … దానికి ఉదాహరణ. ఎక్కడైనా రోడ్డు ప్రమాదం జరిగితే దానికే చంద్రబాబు కారణం. చిత్తూరు జిల్లాలో ఓ హాస్టల్ వార్డెన్ పిల్లల్ని వేధించాలనే ఆరోపణలొస్తే.. ఆ నిందితుడ్ని కాపాడటానికి చంద్రబాబే రంగంలోకి దింపారనే ప్రచారం. ఇలా ఏపీలో ఏం జరిగినా… చంద్రబాబే.. చంద్రబాబే అన్నట్లు ప్రచారం చేస్తోంది వైసీపీ… ఆ పార్టీకి చెందిన మీడియా..!

చంద్రబాబుపై వ్యతిరేకత పెంచితే చాలనుకుంటున్నారా..?

వైసీపీ తీరు చూస్తూంటే.. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఓటు ఎందుకు వేయాలి అని ఎవరైనా ప్రశ్నించుకుంటే.. సరైన సమాధానం చెప్పలేని పరిస్థితి ఉంది. ఆ విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు కూడా క్లారిటీ ఉన్నట్లు ఉంది. ప్రతి శుక్రవారం జైలుకు వెళ్తూ.. తండ్రి ఇమేజ్ ను అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తూ.. కేంద్రంపై పోరాడలేని నిస్సహాయత ప్రజల ముందు స్పష్టంగా ఉండటంతో.. జగన్ వీరత్వాన్ని ప్రజలకు ఎంత చెప్పినా.. కంఠ శోషే అనుకున్నట్లుగా ఉన్నారు. జగన్ ఏదో చేస్తాడని… ముఖ్యమంత్రిని చేయమని అడగడం కన్నా… చంద్రబాబుపై వ్యతిరేకత పెంచి… ఆయనపై… బురదజల్లి… ఏపీలో సకల కష్టాలకు… ప్రజల కష్టాలకు కారణం ఆయనేనని నమ్మించగలగితే… ప్రత్యామ్నాయంగా ఉన్న తానే కాబట్టి.. తనకే ఓటు వేస్తారన్న ఆశతో జగన్ ఉన్నారు. అందుకే పూర్తిగా చంద్రబాబుపైనే కాన్సన్ ట్రేట్ చేశారు. చంద్రబాబునే బూచిగా చూపించి విజయం సాధించాలన్న లక్ష్యంతోనే పని చేస్తున్నారు.

జగన్ వస్తే ప్రజలకు ఏం మేలు చేస్తారో చెప్పుకోలేరా..?

వైఎస్ జగన్ వ్యూహాత్మకంగా ఈ స్ట్రాటజీని ఎంచుకున్నట్లు స్పష్టంగానే అర్థం చేసుకోవచ్చు. ఆయన ప్రసంగాల్లో… ప్రతి వాక్యానికి ముందు చంద్రబాబు.. చివర చంద్రబాబు ఉంటుంది. సాక్షి పత్రిక పూర్తిగా.. చంద్రబాబు వ్యతిరేక వార్తలతో నిండి ఉంటుంది. వైసీపీ నేతలు ఎప్పుడూ చంద్రబాబు జపం చేస్తూనే ఉంటారు. కానీ ఎప్పుడైనా… మేము ప్రజల కోసం ఫలానా పని చేశామని చెప్పుకునే ప్రయత్నం చేశారా..? నవరత్నాల పేరుతో.. కొన్ని హామీలను ప్రకటించారు. వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం ఎప్పుడైనా చేశారా..? ఓ బలమైన మీడియా చేతుల్లో ఉంచుకుని.. నవరత్నాలపై.. సొంత పార్టీ నేతలకే అవగాహన కల్పించలేకపోయారు. దీనికికారణం.. ప్రజలు తమను చూసి ఓట్లేస్తారోలేదో కానీ.. చంద్రబాబుపై వ్యతిరేకతతో మాత్రం వేస్తారనే ఆశనే. రైతు భరోసా అనే పథకాన్నే కాపీ కొట్టి కేసీఆర్ రైతు బంధు పథకం కింద అమలు చేశారన్న అర్థంలో… జగన్.. మొన్నటి ఇంటర్యూలో చెప్పుకున్నారు. అది ఇన్ డైరక్ట్‌గా చెప్పారు. ఇలాంటి పథకం ఏపీలో పెట్టబోతున్నామని.. తమ పార్టీ నేతలు కానీ.. మీడియా కానీ ఎందుకు ప్రజల్లోకి తీసుకెళ్లకపోయిందో… ఆ పార్టీకి క్లారిటీ ఉండే ఉంటుంది. ఎందుకంటే.. వారు చంద్రబాబునే నమ్ముకున్నారు కనుక..!

కానీ వైసీపీ నేతలకు.. రాజకీయం గురించి ఇంకా చాలా తెలియాల్సి ఉంది. ” రాజకీయాల్లో మంచి చెప్పుకుంటున్నారా..? చెడు చెప్పుకుంటున్నారా..? అన్నది కాదు ముఖ్యం. ఏదో ఒకటి చెప్పుకుంటున్నారా లేదా..? అన్నదే. దీన్ని ప్రఖ్యాత బ్రిటిషన్ రాజకీయ వేత్త శతాబ్దం కిందట చెప్పి ఉండవచ్చు కానీ… ఇది ఇప్పటికీ నిజం. చంద్రబాబుకు.. వైసీపీ చెప్పినట్లు ఆయన అనుకూల మీడియా ప్రచారం ఇస్తుంది. ఆయన వ్యతిరేక మీడియా ప్రచారం చేస్తుంది. అంతిమంగా అంది చంద్రబాబుకే లాభిస్తుంది. వైసీపీ స్ట్రాటజీ మార్చుకోకపోతే జరిగేది ఇదే…!

——–సుభాష్

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close