లిక్కర్ కేసులో మిమ్మల్ని అరెస్టు చేస్తారు కదా అంటే..నేను ఇక్కడే విజయవాడలో ఉన్నా అని మీడియా ప్రతినిధి ఎదుట విచిత్రమైన ఎక్స్ ప్రెషన్ ఇచ్చిన జగన్ రెడ్డి.. సాయంత్రానికి ఆయన అనుకునే తాడేపల్లి విజయవాడలో లేరు. బెంగళూరు జంపయ్యారు. ప్రెస్మీట్ రికార్డింగ్ ప్రసారం అయిన తర్వాత ఇంట్లో లంచ్ చేసి బెంగళూరు వెళ్లిపోయారు. అదేంటి.. నేను ఇక్కడే ఉన్నానని సవాల్ చేశారు.. కానీ ఈ ఒక్క రాత్రి అయినా ఉండాలి కదా అని వైసీపీ క్యాడర్ ముక్కును వేలేసుకుంటున్నారు.
జగన్ రెడ్డిని అరెస్టు భయం వెంటాడుతోంది. ఆయన నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. బెంగళూరులో ఉన్నా.. తాడేపల్లిలో ఉన్నా.. తన ఉండే వీధి అంతా మనుషుల్ని పెట్టుకుని ఏపీ పోలీసు వాహనాలు కనిపిస్తాయా అని సమాచారం తెప్పించుకుంటున్నారు. ప్రతీ దానికి ఉలిక్కి పడుతున్నారు. ఆయన భయానికి చాలా కారణాలు ఉన్నాయి. సీఐడీ అధికారులు అన్నీ బయటకు లాగారని. .. అసలు నేల మాళిగల గురించి సమాచారం తెలిసి సోదాలు చేస్తే తట్టుకోలేమని ఆయన మథన పడుతున్నారు.
అరెస్టు గురించి భయం లేకపోతే ఆయన తాడేపల్లిలోనే ఉండేవారు. సవాల్ చేసి మరీ బెంగళూరు పారిపోవాల్సిన అవసరం లేదు. అయితే అసలు జగన్ రెడ్డిని అరెస్టు చేస్తారన్న ప్రచారాన్ని ఎక్కువగా వైసీపీ నేతలే చేస్తున్నారు. వారి సోషల్ మీడియానే చేస్తోంది. అరెస్టు చేస్తే మీ అంతు చూస్తామని పిట్ట బెదిరింపులకు పాల్పడుతున్నారు. అరెస్టులపై సీఐడీ ఇప్పటి వరకూ ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు.