మోదీపై వైసీపీ విమర్శలు – కేసీఆర్‌ రూట్‌లోకి జగన్ !?

బీజేపీతో వ్యవహరించే విధానంలో వైసీపీ రూట్ మార్చుకున్నట్లుగా కనిపిస్తోంది. ఇటీవలి కాలంలో మోదీ సర్కార్ పై జగన్ నుంచి విజయసాయిరెడ్డి వరకూ అనేక రకాలుగా విమర్శలు చేస్తున్నారు. కేంద్రం సహకరించడం లేదంటున్నారు. పోలవరం నిర్వాసితుల కష్టాలకు మోదీనే కారణం అని జగన్ వారికి చెప్పి వచ్చారు. బాధితులు మోదీని తిట్టుకుంటున్నారని జగనే డిక్లేర్ చేశారు. పలు సందర్భాల్లో కేంద్రం పై జగన్ పరోక్ష విమర్శలు చేశారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి లాంటి వాళ్లు పార్లమెంట్‌లో నేరుగా మోదీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు.

యుద్ధం ఎఫెక్ట్ తీసుకు వచ్చేందుకు వైసీపీ ప్రయత్నాలా ?

రాష్ట్రాలను కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందని వారి ఆదాయాలను కూడా కొల్ల గొడుతోందని తాజాగా విజయసాయిరెడ్డి విమర్శలు చేస్తున్నారు. ఆయన విమర్శలు ఇప్పుడు ఢిల్లీ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. బీజేపీకి దూరం అయ్యేందుకు.. ఆ పార్టీతో పోరాడుతున్నామని చెప్పుకునేందుకు వైసీపీ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. కేంద్రంతో యుద్దం చేస్తున్నామని సీఎం జగన్ ప్రకటించారు. ఆ మేరకు ఇప్పుడు నిజంగానే రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నట్లుగా భావిస్తున్నారు.

బీసీల పేరుతో కొత్తగా కేంద్రం, న్యాయవ్యవస్థపై విమర్శలు !

బీసీల పేరుతో కొత్తగా కేంద్రంపై , న్యాయవ్యవస్థపై వైసీపీ విమర్శలు ప్రారంభించింది. ఢిల్లీలో వైసీపీ బీసీ ఎంపీలు ప్రెస్ మీట్ పెట్టి అసందర్భంగా చేసిన వ్యాఖ్యలు … హైలెట్ కాలేదు కానీ.. బీజేపీ వ్యూహకర్తలకు మాత్రం వైసీపీ తీరుపై ఓక్లారిటీ వచ్చి ఉంటుంది. వైసీపీ బీజేపీ తో దూరంగా పోవడానికి వేగంగా ఏర్పాట్లు చేసుకుంటోందని .. లేకపోతే తమ డిమాండ్లను నేరవేర్చుకోవడానికి బ్లాక్ మెయిలింగ్ తరహాలో రాజకీయాలు చేయడానికి ప్రయత్నిస్తోందని వారు నమ్ముతున్నారు. దీనిపై వేచి చూసే ధోరణిలో బీజేపీ ఉంది.

కేసీఆర్‌తో కలిసి సొంత బాటకు వైసీపీ రెడీ అవుతోందా ?

ఇటీవలి కాలంలో టీడీపీ విషయంలో బీజేపీ సాఫ్ట్ అయింది. అంతే కాదు.. మోదీ సమావఏశానికి చంద్రబాబును ఆహ్వానించారు. అమరావతి విషయంలో పూర్తి స్థాయి మద్దతు ప్రకటించారు. మోదీతో కలిస్తే బీజేపీ గెలిచేది కాదంటూ సోము వీర్రాజు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల నడుమ వైసీపీ తమకు ఏదో తేడా కొడుతోందని భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. అందుకే కేసీఆర్ బాటలో పయనిస్తే.. బెటరన్న అభిప్రాయానికి వస్తున్నట్లుగా చెబుతున్నారు. అయితే మెల్లగా డోస్ పెంచుకుంటూ పోతారని.. బీజేపీ తమ డిమాండ్లను ఎక్కడైనా అడ్డుకున్నా… విజ్ఞప్తులు పరిశీలించకపోయినా విమర్శుల వెల్లువెత్తుతూనే ఉంటాయని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఒక వేళ బీజేపీ చల్లని చూపు చూస్తే మాత్రం అంతా తూచ్ అనే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అయితే “ఆదిపురుష్” బీజేపీ ప్రచార చిత్రం కాదన్న మాట !

ఆదిపురుష్ అనే సినిమాలో నటించడానికి ప్రభాస్ అంగీకరించినప్పటి నుండి చాలా మందికి ఆ సినిమాపై డౌట్స్ ఉన్నాయి. ఇటీవల కేటీఆర్ అది బీజేపీ ప్రచార చిత్రమని.. వచ్చే ఎన్నికలకు ముందు అయోధ్య...

మునుగోడుకు 86 మంది ఎమ్మెల్యేల్ని పంపుతున్న కేసీఆర్ !

మునుగోడులో టీఆర్ఎస్ తరపున ప్రచారం చేయడానికి తమ పార్టీకి ఉన్న 86 మంది ఎమ్మెల్యేల్ని పంపుతున్నారు. నియోజకవర్గాన్ని 86 యూనిట్లుగా విభజించారు. ఒక్కో యూనిట్కి ఒక్కో ఎమ్మెల్యే ఇంచార్జ్గా ఉంటారని టీఆర్ఎస్...

డిజిట‌ల్‌లో ‘శివ‌’

ఈమ‌ధ్య రీ రిలీజ్‌ల హంగామా ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. పోకిరి, జ‌ల్సా, చెన్న‌కేశ‌రెడ్డి సినిమాలు రీ రిలీజ్ అయి భారీ వ‌సూళ్లు మూట‌గ‌ట్టుకొన్నాయి. త్వ‌ర‌లోనే ప్ర‌భాస్ - బిల్లా కూడా రీ రీలీజ్ అవ్వ‌బోతోంది....

రీమేకుల‌పై మెగాస్టార్ మాట‌

చిరంజీవిపై ఓ విమ‌ర్శ బ‌లంగా వినిపిస్తుంటుంది. ఆయ‌న ఎక్కువ‌గా రీమేకుల‌పై ఆధార‌ప‌డ‌తాడ‌ని. రీ ఎంట్రీ గా వ‌చ్చిన ఖైదీ నెం.150 రీమేకే. రేపు విడుద‌ల‌య్యే గాడ్ ఫాద‌ర్ కూడా రీమేకే. ఇప్పుడు చేతిలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close