అమరావతి నిర్మాణాలు ప్రారంభించబోతున్న జగన్ ..!?

నవంబర్ ఒకటో తేదీ నుంచి అమరావతిలో నిలిచిపోయిన నిర్మాణాలను ప్రారంభించాలనే ఆలోచన ఏపీ సీఎం జగన్ చేస్తున్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబు రేంజ్‌లో కాకపోయినా… ఇప్పటికి పనులు ప్రారంభమైన వాటిని పూర్తి చేయాలని భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. వారం క్రితం ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నిలిచిపోయిన భవన నిర్మాణాలను పరిశీలించారు. ఆ తర్వాత మంత్రి బొత్స సీఆర్డీఏ అధికారులతో సమావేశం అయ్యారు. నవంబర్ ఒకటి నుంచి పనులు ప్రారంచాలని కాంట్రాక్టర్లను కోరాలని ఆయన అధికారులను ఆదేశించారు. వారికి పెండింగ్ బిల్లులు రూ. 500 కోట్లు ప్రభుత్వం విడుదల చేస్తుందన్నారు.

మొత్తం 13 పనులను నవంబర్ 1వ తేదీ నుంచి పునఃప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, అఖిల భారత సర్వీస్ అధికారులు, ఎన్జీవోలు, గెజిటెడ్ అధికారులు, సచివాలయ ఉద్యోగుల అపార్ట్ మెంట్లు నిర్మాణాలు ముందుగా పూర్తి చేయాల్సి ఉంది. సెక్రటేరియట్, హెచ్ వోడి టవర్ల విషయంలో పునరాలోచనలో ప్రభుత్వం పడింది. భూ సమీకరణ కింద భూములచ్చిన రైతులకిచ్చిన రిటర్నబుల్ ప్లాట్లలో మౌలిక సదుపాయాల కల్పన పనులు కూడా ప్రారంభించే అవకాశం ఉందంటున్నారు. సగంలో రహదారుల పనులు కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

రాజధాని నిర్మాణానికి నిధుల కొరత ఎక్కవగా ఉందని ప్రభుత్వం చెబుతుంది. రాజధాని నిర్మాణానికి రుణం ఇచ్చే పలు జాతీయ, అంతర్జాతీయ, ఆర్ధిక సంస్థలు వెనుకకు వెళ్లడం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. రాజధాని నిర్మాణాన్ని నిలిపివేశారని, హై కోర్టును కూడా తరలిస్తున్నారని ప్రచారం కోస్తా జిల్లాలలో ఊపందుకోవడంతో పరిమితి వనరులతో అవసరమైన మేరకే రాజధాని నిర్మాణం చేపడితే ఈ ప్రచారానికి తెర దించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. అయితే.. ఏపీ సర్కార్ చేజేతులా తెచ్చి పెట్టుకున్న పరిస్థితులతో… రుణాలు దక్కడం కూడా అనుమానంగానే ఉంది. అందుకే.. పనులు ఎంత మేర ముందుకు సాగుతాయనేది అనుమానమేనంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close