వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయం అంతా బ్యాక్ డోర్‌లోనే ఎక్కువ ఉంటుంది. ఆయన వ్యవస్థలను లెక్క చేయరు. ప్రజాస్వామ్యాన్ని అసలు పట్టించుకోరు. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ఏర్పాటు చేసిన వ్యవస్థలన్నీ వ్యక్తుల చేతుల మీదుగానే నడుస్తాయని.. వారిని కులమో, మతమో చూపించి లేదా వివిధ పద్దతుల్లో లోబర్చుకుని.. అధికారంలోకి వచ్చాక పదవులు ఇస్తామని ఆశ పెట్టి మేనేజ్ చేస్తూంటారు. అలా ఇరుక్కుపోయిన వారు ఎంతో మంది పరువు పోగొట్టుకున్నారు. అత్యంత ఘోరంగా ప్రజలు ఛీ కొట్టిన తర్వాత తనకు ఎలాంటి బలం లేనప్పుడు ఇప్పుడు కూడా ఆయన అదే వ్యూహం అవలంభిస్తున్నారన్న అనుమానాలు బలపడుతున్నాయి.
జగన్ ట్రాప్ కంటిన్యూ
జగన్ రెడ్డి మొదటి సారి అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన పంచిన పదవులను చూస్తే.. గతంలో చేసిన సాయానికి ప్రతిఫలంగా ఇచ్చారని అనుకోవచ్చు. చాలా వ్యవస్థల్లో కీలకంగా పని చేసిన వారికి జగన్ పిలిచి పదవులు ఇచ్చారు. వారు ఈ రాష్ట్రం వారే అని కాదు.. తెలంగాణ, తమిళనాడు నుంచి కూడా పిలిచి పదవులు ఇచ్చారు. వారి వల్ల ఆయన పొందిన లబ్ది ఏమిటో చాలా మంది చూశారు. వ్యవస్థలతో ఆడుకోవడం జగన్ నైజం. వ్యవస్థల్లో ఉండే బలహీన మనస్థత్వం ఉన్న వ్యక్తులను కులం, మతం లేదా పదవుల పేరుతో లోబర్చుకునే కుట్రలను ఆయన చేయడం సహజమేనని రాజకీయాల్లో ఆయన వ్యూహాలు చూస్తే అర్థమైపోతుంది.
అధికారంలో ఉన్నప్పుడు ఎన్నిచేశారో ?
డీజీపీగా ఉన్న సవాంగ్‌తో చేయకూడని తప్పుడు పనులు అన్నీ చేయించి… వీఆర్ఎస్ ఇప్పించి మరీ ఏపీపీఎస్సీ చైర్మన్‌ను చేశారు. వైసీపీ ఓడిపోగానే రాజీనామా చేసి పారిపోయారు ఆయన. ఆయన చేసిన తప్పులేమిటో ఆయనకు బాగా తెలుసు. చీఫ్ సెక్రటరీగా ఉంటూ ఎన్నో సార్లు కోర్టు ధిక్కరణకు పాల్పడిన నీలం సహానికి ఎస్ఈసీ పోస్టు ఇచ్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే జగన్ రెడ్డి పాలబడిన వ్యవస్థల్లోని కీలక వ్యక్తులు చాలా మంది ఉన్నారు. వారి వల్ల వ్యవస్థలు కొంత బలహీనపడి ఉంటాయి. నేరస్తులకు అండగా నిలబడినట్లుగా ఉండవచ్చు. కానీ భారత రాజ్యాంగ వ్యవస్థలు మాత్రం ఎప్పుడూ ఫెయిల్ కావు.
జగన్ కారణంగా పరువు పోగొట్టుకుంటున్న గౌరవనీయవ్యక్తులు
జగన్ రెడ్డి అత్యంత తీవ్ర నేర మనస్థత్వమున్న రాజకీయ నాయకుడు. అతను ఇప్పటికీ తెర వెనుక వ్యవస్థల్ని ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నారని జరుగుతున్నారని పరిణామాలను బట్టి అర్థం చేసుకోవచ్చు. కానీ జగన్ రెడ్డితో లోపాయికారీగా ఒప్పందాలు చేసుకుని స్వార్థంతో వ్యవస్థల్లోని వ్యక్తులు వ్యవహరిస్తే.. అది రివర్స్ అవుతుంది. గతంలో ఎంతో మంది జగన్ రెడ్డిని నమ్ముకుని పరువు పోగొట్టుకున్నారు. ఎంతో ఉన్నతంగా బతికిన ఐఏఎస్, ఐపీఎస్‌లు జైలు పాలయ్యారు. అలాంటివి కొనసాగకూడదని ఆశిద్దాం !