బ్యూరోక్రసీపై జగన్ రాజకీయ కక్ష..! వాళ్లూ అలా ఆలోచిస్తే..!?

ఆంధ్రప్రదేశ్‌ అధికార వ్యవస్థ ఇప్పుడు రాజకీయ పగ, ప్రతీకారాల్లో ఇరుక్కుంది. డిప్యూటేషన్లపై వచ్చినవారు.. సస్పెండ్ అవుతున్నారు. గత ప్రభుత్వంలో కీలక శాఖలు చూసిన అధికారుల్లో చాలా మంది ఇప్పటికీ ఖాళీగా ఉన్నారు. డిప్యూటేషన్లపై వచ్చిన వారిని అటు రిలీవ్ చేయరు.. ఇటు పోస్టింగూ ఇవ్వడం లేదు. అదే సమయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి .. తనతో పాటు కేసుల్లో ఇరుక్కున్న వారి కోసం.. ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేసుకుంటున్నారు. కేంద్రం కుదరదని చెప్పినా… ప్రయత్నాలు ఆపడం లేదు.

ఆ సామాజికవర్గం ఉద్యోగులకు నో పోస్టింగ్స్..!

వివిధ విభాగాల్లో ఓ సామాజికవర్గాన్ని టార్గెట్ చేసి మరీ … బదిలీలు చేస్తున్నారు. పోలీసుల్లో…ప్రస్తుతం వీఆర్‌లో ఉన్న అధికారుల జాబితా తీస్తే 90 శాతం మాత్రం… ఒకే సామాజికవర్గం వారు. ప్రభుత్వ కక్ష సాధింపులు ఎలా ఉన్నాయంటే… ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని వివిధ సందర్భాల్లో అడ్డుకున్న ఉద్యోగులెవరికీ ఇప్పుడు పోస్టింగులు లేవు. దాదాపుగా అందరూ ఖాళీగానే ఉన్నారు. వివిధ శాఖల్లోనూ అదే పరిస్థితి. నిజానికి రాజకీయాలు నిన్నామొన్నటి వరకూ.. రాజకీయపార్టీల మధ్యే ఉండేవి. అధికారుల వరకూ వచ్చేవి కావు. అధికారులు శాశ్వతం. ప్రభుత్వాలు ఐదేళ్ల తర్వాత ఉంటాయో.. ఉండవో చెప్పడం కష్టం.

అధికారులను కుల, మత, రాజకీయంగా విభజించిన జగన్..!

ప్రభుత్వాలేవీ.. అధికారుల జోలికి వెళ్లవు. తమ ఆలోచన విధానానికి సరిపోతారు అన్న వారికి కీలక పోస్టులు ఇస్తారు. పని చేయించుకుంటారు. అలాగని ఇతర అధికారులపై కక్ష సాధింపుల్లాంటివి చేయరు. జగన్ అక్రమాస్తుల కేసుల్లో ఉన్న పలువురు ఐఏఎస్‌లు… చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ప్రాధాన్యమైన విధులే నిర్వహించారు. ఎల్వీ సుబ్రహ్మణ్యం నారా లోకేష్ నిర్వహించిన మంత్రిత్వ శాఖల్లో కీలకంగా వ్యవహరించారు. అధికారులు కూడా… ప్రభుత్వాలకు తగ్గట్లుగా పనితీరుతో సర్దుకుపోతారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. అధికారుల్ని పార్టీల వారీగా.. కులాల వారీగా విభజించే పరిస్థితి కనిపిస్తోంది. కక్ష సాధింపు చర్యలు ఓ రేంజ్‌లో ఉంటున్నాయి.

అధికారులూ తాము కక్ష సాధించాలనుకుంటే ..నేతలు తట్టుకోగలరా..?

ప్రభుత్వ నిర్ణయాలపై ఏ మాత్రం.. ప్రశ్నలు లెవనెత్తినా .. సాక్షాత్తూ సీఎస్ అంతటి వారికి కూడా గ్యారంటీ లేదు. అవినీతికి పాల్పడకపోయినా… తోటి అధికారులే.. ఏదో నివేదికపై కేసులు బుక్ చేయించే పరిస్థితిని పాలకులు కల్పిస్తున్నారు. ఓ రకంగా.. బ్యూరోక్రసీపై.. పాలకవర్గం కక్ష గట్టిందనే అభిప్రాయం.. ఈ పరిణామాలతో ఏర్పడుతోంది. ప్రభుత్వం ఐదేళ్లు మాత్రమే అధికారంలో ఉంటుంది. అధికారులు మాత్రం శాశ్వతంగా ఉంటారు. వారు.. కక్ష సాధించాలనుకుంటే.. రాజకీయ పార్టీలు..నేతలు.. తట్టుకోవడం కష్టం. ఆ పరిణామాలు తర్వాత జగన్ అనుభవిస్తే.. అది రాజకీయం కాబోదు.. చర్యకు ప్రతిచర్య అని.. అనుకోవాల్సి వస్తుందని.. రాజకీయ పార్టీలంటున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నేషన్ వాంట్స్ టు నో ఓన్లీ ” సుశాంత్ కేస్ “

దేశ ప్రజలకు ఇప్పుడు ఏది ముఖ్యమైనది...? ఏ సమాచారం తెలుసుకోవాలనుకుంటున్నారు..? ఆ సమాచారం కోసం ఏ టీవీల్ని చూస్తున్నారు..? లాంటివన్నీ పరిశీలిస్తే.. ప్రస్తుతం న్యూస్ ట్రెండ్ తెలిసిపోతుంది. రిపబ్లిక్ టీవీ సుశాంత్ సింగ్...

వావ్.. రాయల్స్ దంచేశారు..!

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ప్రతీ ఆదివారం ఓ స్పెషల్‌గా మారుతోంది. గత వారం సూపర్ ఓవర్‌దాకా సాగిన మ్యాచ్ ఊపిరిబిగపట్టి చూసేలా చేయగా.. ఈ సారి రాజస్థాన్ రాయల్స్ అసలు అసాధ్యమనుకున్న లక్ష్యాన్ని...

రెండో స్థానానికి పడిపోయిన టీవీ9, అంతర్మధనం

పదహారేళ్లుగా మొదటి స్థానంలో అప్రతిహతంగా కొనసాగుతున్న టీవీ9 రెండో స్థానానికి పడిపోయింది. మొన్నటికి మొన్న లాక్ డౌన్ సమయంలో టిఆర్పి రేటింగులో తాము మొదటి స్థానంలో ఉన్నామని, రెండవ స్థానంలో ఉన్న ఛానల్...

బిగ్ బాస్ నుండి దేవి నిష్క్రమణ, టీవీ9 పై జనాల్లో వ్యతిరేకత కూడా కారణమా ?

బిగ్ బాస్ సీజన్ 4 రికార్డు టిఆర్పీ లతో దూసుకెళుతోంది. కంటెస్టెంట్స్ జాబితా బాగోలేదు అన్న కారణంగా రెండు మూడు రోజుల తర్వాత పడిపోయిన రేటింగులు 10వ రోజు నుండి భారీగా పుంజుకున్నాయి....

HOT NEWS

[X] Close
[X] Close