భారత అత్యున్నత అధికార వ్యవస్థ అయిన ఐఏఎస్, ఐపీఎస్‌లు జగన్ రెడ్డి బారిన పడ్డారు. ఆయన విసిరిన బిస్కెట్లకు.. పోస్టింగ్‌లకు కక్కుర్తి పడి చేయకూడని ఘోరమైన తప్పులు చేశారు. ముఫ్పై ఏళ్లు అధికారంలో ఉంటానని ఆయన చెబితే ఇక తిరుగులేని నమ్మి.. ఆయన ప్రత్యర్థుల్ని భౌతికంగా నిర్మూలించే కుట్రలకూ వెనుకాడలేదు. ఇలాంటి వారు ఇప్పుడు తమను అరెస్టు చేస్తారని వణికిపోతున్నారు. పోస్టింగులు ఇవ్వట్లేదని అంటున్నారు. కక్ష సాధింపులు అని.. చెప్పుకునేందుకు రెడీ అవుతున్నారు. కానీ వీరిలో ఎవరికైనా కనీస సానుభూతి వస్తుందా ?
హైదరాబాద్‌లో సమావేశమైన జగన్ సర్వీస్ బ్యాచ్ అధికారులు
ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కొంత మంది జగన్ సేవలో తరించారు. వారిలో కొంత మంది యువ అధికారులు ఉన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు టెన్త్ పేపర్ లీక్ కాకపోయినా.. మాల్ ప్రాక్టీస్ ను లీక్ అని చెప్పి.. కాలేజీ రోజువారీ వ్యవహారాలతో సంబంధం లేకపోయినా.. నారాయణ ఫోన్ ను ట్యాప్ చేసి.. హైదరాబాద్ రోడ్లపై ..ఆయన కుమారుడి వర్థంతి రోజునే అరెస్టు చేసి తీసుకు వచ్చారు. ఇలాంటి జగన్ సర్వీస్ బ్యాచ్ అధికారులు ఇప్పుడు వణికిపోతున్నారు. చాలా మంది అధికారులు తమను అరెస్టు చేస్తారేమో అన్న భయంతో హైదరాబాద్ లో సమావేశం అయ్యారు.
అరెస్టు భయం, పోస్టింగులు ఇవ్వకపోవడంపై చర్చలు
జగన్ ను నమ్ముకుని గాడి తప్పిన మరో ఇద్దరు ముగ్గురు ఐపీఎస్‌లు అరెస్టు కాబోతున్నారన్న చర్చ జరుగుతోంది. చంద్రబాబుపై అంగళ్లులో జరిగిన హత్యాయత్నంలో అప్పట్లో ఓ ఎస్పీ అత్యంత కీలకంగా వ్యవహరించారని చెబుతున్నారు. ఆ తర్వాత వందల మంది టీడీపీ కార్యకర్తలపై కేసులు పెట్టి అరెస్టులు చేయించారు. ఆ ఐపీఎస్‌తో పాటు మరో ఇద్దరు ఘోరమైన కుట్రుల చేసినట్లుగా నివేదికలు ఉన్నాయి. వారికి పోస్టింగులు లేవు. వారికి త్వరలో కటకటాలు ఖాయమని చెబుతున్నారు. దీంతో వారు తమను తాము కాపాడుకోవడానికి అయినా అవసరమని.. ఒత్తిడి తేవాలని హైదరాబాద్ లో కొంత మందితో సమావేశం పెట్టుకున్నట్లుగా మీడియాకు లీకులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
తప్పు చేసిన వాళ్లను వదిలే అవకాశం లేదు !
ఇప్పటికే సస్పెన్షన్ లో ఉన్న కొంత మంది..పోస్టింగులు లేని కొంత మంది సమావేశాలు పెట్టుకుని సీఎస్‌కు తమ మొర వినిపించుకున్నారని అంటున్నారు. అయితే తప్పులు చేసినట్లుగా ఆధారాలు ఉన్న వారికి తాను ఎలాంటి సాయం చేయలేనని చెప్పేసినట్లుగా చెబుతున్నారు. సివిల్ సర్వీస్ అధికారుల నుంచి ప్రభుత్వ పెద్దలు ఇంత ఘోరమైన నేరపూరిత కుట్రలతో విధులు నిర్వహిస్తారని అనుకోలేదని..ఇప్పుడు వారు క్షమించే పరిస్థితుల్లో లేరన్న సమాధానాలు వస్తున్నాయి. తప్పు చేసిన వారికి శిక్ష పడకపోతే.. రేపు మరికొంత మందికి అది స్ఫూర్తి అవుతుంది. అందుకే వారందరికీ ట్రీట్మెంట్ ఖాయమని ప్రభుత్వ వర్గాలంటున్నాయి.