జగన్ సర్కార్‌పై బీజేపీ రాజ్యాంగ వ్యతిరేక ముద్ర..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు రాజ్యాంగ విరుద్ధంగా ఉందని.. బీజేపీ నేత, ఎంపీ సుజనా చౌదరి సూటిగా విమర్శించారు. ఈ విషయాన్ని తాను కేంద్రంలోని పెద్దలతో సంప్రదించిన తర్వాతే మాట్లాడుతున్నానని కూడా చెప్పారు. ఏపీలో వ్యవహారాలపై ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన… వైసీపీ సర్కార్ పై విమర్శలతో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా మత పరమైన నిర్ణయాలపై సుజనా చౌదరి ఘాటుగానే విరుచుకుపడ్డారు. వ్యక్తిగత మత విశ్వాసాలు ఉంటే పూజ గది వరకే పరిమితం చేయాలి కానీ.. ప్రభుత్వంలో చొప్పించకూడదన్నారు. జెరూసలేం యాత్రకు ఆర్థిక సాయం చేస్తున్న ప్రభుత్వం.. బద్రీనాథ్‌కో, కేథార్‌నాథ్‌కో వెళ్లడానికి హిందువులు సాయం చేయమంటే ఏం చేస్తారని ప్రశ్నించారు.

పన్నుల రూపంలో ప్రజల నుంచి వచ్చిన సొమ్మును ఇష్టానుసారం మతాలవారీగా పంచడం రాజ్యాంగ విరుద్ధమని .. ఈ విషయాలన్నీ నేను కేంద్రం పెద్దలతో సంప్రదించే మాట్లాడుతున్నానని ప్రకటించారు. ఆధ్యాత్మిక టూరిజాన్ని అభివృద్ధి చేసి వచ్చిన రాబడితో ప్రభుత్వం డబ్బులు పంచిపెట్టుకుంటే అభ్యంతరం లేదని.. కానీ ప్రజల నుంచి పన్నులుగా వచ్చిన సొమ్మును నచ్చిన మతాలకు ఇవ్వడంపైనే అభ్యంతరమని స్పష్టం చేశారు. అదే సమయంలో.. టీటీడీ వ్యవహారాలను ప్రస్తావించారు. టీటీడీ నిధులను ఇష్టానుసారం ఇతర పనులకు వాడుతున్నారని మండిపడ్డారు. తిరుమలలో గదుల ధరలను రెట్టింపు చేశారని.. 19 మంది సభ్యులు ఉండే పాలక మండలిని 35కి పెంచడం ఏమిటని ప్రశ్నించారు.

ఒక్క ఈ అంశంపైనే కాదు.. ఏపీ ఆర్థిక పరిస్థితిపైనా విరుచుకుపడ్డారు. జగన్‌ నిర్ణయాలు చూసి జనం నవ్వుతున్నారని .. ఏపీలో గత 6 నెలల్లో ఒక ఉద్యోగం ఎవరికైనా వచ్చిందా? ఒక్క పరిశ్రమ అయినా వచ్చిందా? అని ప్రశ్నిచారు. వైసీపీకి 22 మంది ఎంపీలు ఉండి ఏం లాభం.. వారు ఎటు మాట్లాడినా ఉలిక్కిపడుతున్నారని సెటైర్లు వేశారు. ఇతర అంశాలపైనా సుజనా చౌదరి మాట్లాడినా.. రాజ్యాంగ విరుద్ధంగా ఏపీ సర్కార్ వ్యవహరిస్తోందని చెప్పడం.. దానికి.. తాను కేంద్ర పెద్దలతో మాట్లాడిన తర్వాతే.. ఈ విషయం చెబుతున్నానని చెప్పడం… ఢిల్లీ రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఫ్లాష్ బాక్‌: ఎన్టీఆర్ కృష్ణ‌ల ‘కురుక్షేత్ర‌’ యుద్ధం

ఒకేరోజు.. రెండు సినిమాలు, అందునా స్టార్ సినిమాలు విడుద‌ల కావ‌డం కొత్తేం కాదు. కానీ.. రెండూ ఇంచుమించుగా ఒకే క‌థ‌తో విడుద‌లైతే, రెండూ ఒకే జోన‌ర్ అయితే.. ఎలా ఉంటుంది? ఆ...

రానా పెళ్లిలో… ప్ర‌భాస్ ‘బావ‌’ మిస్సింగ్‌

శ‌నివారం రాత్రి రానా -మిహిక‌లు అగ్ని సాక్షిగా ఒక్క‌ట‌య్యారు. లాక్ డౌన్, క‌రోనా గొడ‌వ‌లు లేక‌పోతే, ఈ పెళ్లి ధూంధామ్‌గా జ‌రిగేది. కానీ లాక్ డౌన్ ప‌రిమితుల వ‌ల్ల కేవ‌లం 50మంది అతిథుల‌కే...

అగ్నిప్రమాద మృతుల కుటుంబాలకు రూ. 50 లక్షలు : జగన్

విజయవాడ స్వర్ణ ప్యాలెస్‌ అగ్నిప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్య పదకొండుకు చేరింది. అందరూ... కోవిడ్ రోగులే. మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉంది. దాదాపుగా యాభై మంది కోవిడ్ రోగులు ఆస్పత్రిలో ఉండగా.....

నాని సినిమాని సీక్వెల్ వ‌స్తోంది

వాల్ పోస్ట‌ర్ బ్యాన‌ర్ స్థాపించి 'అ' సినిమాతో బోణీ కొట్టాడు నాని. నిర్మాత‌గా త‌న అభిరుచి ఎలాంటిదో తొలి సినిమాతోనే చూపించాడు. ప్ర‌శాంత్ వ‌ర్మ‌ని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేశాడు. 'అ' క‌మర్షియ‌ల్ గా...

HOT NEWS

[X] Close
[X] Close