పొద్దుట ప్ర‌భాస్‌… సాయింత్రం నాగ‌చైత‌న్య‌

2018 ఆగ‌స్టు 15న ‘గీత గోవిందం’ విడుద‌లైంది. అప్ప‌టి నుంచీ… ప‌ర‌శురామ్ ఖాళీనే. వంద కోట్ల సినిమా తీసి, ఇన్ని నెల‌లు గ్యాప్ తీసుకున్న ద‌ర్శ‌కుడు బ‌హుశా ప‌ర‌శురామ్ కావొచ్చు. అలాగ‌ని ఆయ‌నేం కావాల‌ని బ్రేక్ తీసుకున్న‌ది లేదు. వ‌చ్చేసిందంతే. అయితే ఇప్పుడు మాత్రం కాస్త స్పీడుగానే సినిమాల్ని ప‌ట్టాలెక్కించాన్న ఉద్దేశంతో హీరోల‌కు లైన్లు చెప్పి, వాళ్ల‌ని రెడీ చేసే ప్ర‌య‌త్నాల్లో ఉన్నాడు. బుధ‌వారం ప‌ర‌శురామ్ ఇద్ద‌రు హీరోల‌కు క‌థ‌లు చెప్ప‌డంలో బిజీ అయిపోయాడు. పొద్దుట ప్ర‌భాస్ ద‌గ్గ‌ర‌కు వెళ్లి క‌థ చెప్పిన ప‌ర‌శురామ్‌.. సాయింత్రానికి నాగ‌చైత‌న్య ముందు ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాడు. మ‌హేష్ కోసం రాసుకుని కాద‌న్న క‌థ‌ని.. ప్ర‌భాస్‌కి చెప్పాడ‌ట ప‌ర‌శురామ్‌. నాగ‌చైత‌న్య కి అయితే ఎప్పుడో సిద్ధం చేసిన క‌థ‌నే కాస్త మెరుగులు దిద్ది వినిపించేశాడు. నాగ‌చైత‌న్య అయితే.. ప‌ర‌శురామ్‌తో సినిమా చేయ‌డానికి `ఓకే` అనేశాడ‌ని తెలుస్తోంది. ప్ర‌భాస్ కాస్త అటూ ఇటూ ఆలోచిస్తున్నాడ‌ని స‌మాచారం. చైతూ ఓకే అనేసినా – ప్రాజెక్టు ఇప్ప‌ట్లో సెట్లోకి వెళ్తుందో లేదో చెప్ప‌లేం. వెంకీ మామా అయిపోవాలి. ఆ త‌ర‌వాత‌ శేఖ‌ర్ క‌మ్ముల సినిమా పూర్త‌వ్వాలి. ఆ త‌ర‌వాతే.. డేట్లు ఇవ్వ‌గ‌ల‌డు. కానీ ప‌ర‌శురామ్ మాత్రం చైతూకి ఓ కండీష‌న్ పెట్టాడ‌ట‌. జ‌న‌వ‌రిలో ఈ సినిమా మొద‌ల‌య్యే అవ‌కాశం ఉంటేనే చేస్తా.. అంటున్నాడ‌ట‌. దానికి చైతూ ఏమంటాడో చూడాలి మ‌రి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com