వైఎస్ జగన్ ఇంటి గుట్టు బయట పెట్టడంలో ఆంధ్రజ్యోతి ఆర్కే ఇటీవలి కాలంలో సిక్సర్లు కొడుతున్నారు. వారింట్లో అంతర్గతం ఏం జరుగుతుందో కూడా చెబుతున్నారు. ఇలాంటి సమయంలో అదంతా అబద్దం అనేలా ఎదురుదాడి చేయాలి లేదా సైలెంట్ గా ఉండాలి. కానీ మీడియా ముందుకు వచ్చి అంతా నిజం అని చెప్పుకుంటున్నారు. వీరి తీరు చూసి వైసీపీ నేతలు కూడా తలలు పట్టుకుంటున్నారు. ఆంధ్రజ్యోతి ఆర్కే చెప్పేదంతా నిజమేనా అని కంగారు పడుతున్నారు.
వైఎస్ వివేకా హత్య రోజున .. మొదట లోటస్ పాండ్లో సీఎం జగన్ నలుగురికి వివేకా చనిపోయాడని చెప్పారని ఆర్కే రాశారు. ఆ నలుగురు పేర్లుకూడా పత్రికలో రాశారు. కృష్ణమోహన్ రెడ్డి, దువ్వూరి కృష్ణ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుతో పాటు అజేయకల్లాం ఆ నలుగురు అని కూడా చెప్పారు. తాజాగా అజేయకల్లాంను సీబీఐ ప్రశ్నించిందని.. ఆయన కూడా గుండెపోటుతో జగన్ చనిపోయారని చెప్పారని రాశారు. దీనిపై మూడు రోజుల తర్వాత మీడియా సమావేశం పెట్టిన అజేయకల్లాం ఆంధ్రజ్యోతిని తిట్టారు కానీ అంతా నిజమేనని ఒప్పుకున్నారు. వివేకా చనిపోయిన సంగతి తమకు జగనే చెప్పారని.. ఏ టైంలో అన్నది మాత్రం తెలియదన్నారు. సీబీఐ అధికారులు తనతో మాట్లాడి వివరాలు తీసుకుంది కూడా నిజమేనని అంగీకరించారు. దీంతో వైసీపీకి షాక్ తగిలినట్లయింది. ఒక వేళ అది నిజమే అయితే ప్రెస్ మీట్ పెట్టడం ఎందుకన్నది వారి వాదన.
మొత్తంగా జగన్ కు సంబంధించిన ప్రతి విషయం ఆంధ్రజ్యోతి ఆర్కేకు తెలుస్తోందన్న అభిప్రాయం ఆ పార్టీలో బలపడుతోంది. ఎవరు చెబుతున్నారు… ఎలా తెలుస్తుందన్న విషయాలపై దృష్టి పెట్టి కోవర్టులుంటే పంపేయాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. నిజానికి ఉమ్మారెడ్డి టీడీపీలో చాలా కాలం ఉన్నారు. సీఎస్ గా అజేయకల్లాం చంద్రబాబుతో సన్నిహితంగా ఉన్నారు. ఇలాంటి వివరాలు ఆర్కేకు ఎవరు చెబుతున్నారో కానీ.. జగన్మోహన్ రెడ్డి మాత్రం సమాచారం బయటకు రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలంటున్నారు.