ప్రొ.నాగేశ్వర్: జగన్ కాపు రాజకీయం మరో సెల్ఫ్ గోలా..?

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ వివాదం రాక ముందు …బీసీలకు ఇబ్బంది లేకండా.. కాపు రిజర్వేషన్లు ఇవ్వవచ్చని ప్రకటించారు. రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనన్నారు. తమిళనాడు తరహాలో పార్లమెంట్ లో చట్టం చేసైనా ఇవ్వాల్సిందేనన్నారు. కానీ జగ్గం పేటలో.. కాపు రిజర్వేషన్లు కేంద్రం పరిధిలో ఉన్నాయని.. సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నాయని చెబుతూ.. తాను చేయలేకపోతున్నానని స్పష్టంగా ప్రకటించారు. అలా ప్రకటించిన తర్వాత కాపుల నుంచి పాదయాత్రలో తీవ్రమైన నిరసనలు ఎదురయ్యాయి. దీంతో.. మళ్లీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. ఈ రెండు రకాల స్టేట్ మెంట్ల మధ్య ఏం జరిగి ఉండాలి..?

గత ఎన్నికల్లో టీడీపీకి కాపుల ఓట్లు..!

జగన్మోహన్ రెడ్డి ప్రకటనను సహజంగానే తెలుగుదేశం పార్టీ చాలా తెలివిగా ఉపయోగించుకుంది. కాపు ఓటర్లలో జగన్ పై వ్యతిరేకతను పెంచింది. వాస్తవానికి 2014లో కాపు ఓటర్లు తొలిసారి పెద్ద ఎత్తున తెలుగుదేశానికి ఓటు వేశారు. గతంలో కాపు ఓటింగ్ తెలుగుదేశానికి పెద్దగా వచ్చింది లేదు. ఏపీలో కాపులు నిర్ణాయక శక్తిగా ఉన్నారు. 30 నియోజకవర్గాల్లో డామినేటింగ్ పొజిషన్ లో ఉన్నారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత సహజంగానే కాపు ఓటు బ్యాంక్ ఆ పార్టీ వైపు మొగ్గింది. అలా అని చిరంజీవికి కాపు ఓట్లే వచ్చాయని చెప్పలేం. కానీ ఓట్లన్నీ ప్రజారాజ్యం వైపు పొలరైజ్ అయ్యాయి. 2014కి వచ్చే సరికి… ప్రజారాజ్యం పార్టీ లేదు. చిరంజీవిని నమ్మి మోసపోయామనే భావన కాపుల్లో ఉంది. మంత్రి పదవి కోసం చిరంజీవి.. పార్టీని విలీనం చేసేశారన్న ఆవేదన వారిలో ఉంది. అలాంటి సమయంలో కాపులకు రిజర్వేషన్లు ఇస్తామన్న నినాదంతో.. ఓ సమర్థవంతమైన సోషల్ ఇంజినీరింగ్ ఈక్వేషన్స్ ను.. చంద్రబాబు రచించారు. ఈ సోషల్ ఇంజినీరింగ్ వల్ల కాపులు పెద్ద సంఖ్యలో టీడీపీకి ఓట్లేశారు. పవన్ కల్యాణ్ మద్దతు కూడా కాపు ఓటింగ్… టీడీపీ వైపు షిఫ్ట్ అవడానికి కారణం అయింది.

రిజర్వేషన్లపై జగన్ వ్యాఖ్యలు మరో సెల్ఫ్ గోల్..!

కాపు రిజర్వేషన్లను చంద్రబాబునాయుడు పూర్తి స్థాయిలో అమల్లోకి తేలేకపోయారు. అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. అయితే కాపు కార్పొరేషన్ పెట్టడం, కాపు మంత్రులకు అధిక అవకాశాలివ్వడం వంటి కారణాలతో కాపు ఓటింగ్ ను తెలుగుదేశం ఇప్పటికీ తన వెంటే ఉంచుకోగలుగుతోంది. అయితే రిజర్వేషన్లు ఇంకా రాలేదన్న వ్యతిరేకత ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఇలాంటి మాటలు మాట్లాడారు. ఇందులో రెండు తప్పుడు వ్యూహాలున్నాయి. ఒకటి పవన్ కల్యాణ్ ను వ్యక్తిగతంగా తిట్టారు. వెంటనే కొద్ది రోజుల్లోనే..మళ్లీ కాపుల రిజర్వేషన్లపై వ్యతిరేక ప్రకటన చేశారు. జగన్ కు ఓ ప్రత్యేకత ఉంది. జగన్ ను జగనే ఓడించుకుంటారని రాజకీయాల్లో చెప్పుకుంటారు. తన సెల్ఫ్ గోల్స్ వల్ల తానే నష్టపోతున్నారు. గతంలో కూడా అనేక సెల్ఫ్ గోల్స్ జగన్ చేసుకున్నారు. బీజేపీతో సరిగ్గా పోరాడకపోవడం, ఎంపీలతో రాజీనామాలు చేయించడం, అసెంబ్లీకి పోకపోవడం.. అన్నీ సెల్ఫ్ గోల్సే. ఆ రకమైన సెల్ఫ్ గోల్స్ లో ఇది కూడా భాగమేని ఓ వాదన ఉంది.

కాపుల ఓట్ల కోసం పవన్ కల్యాణ్ ప్రయత్నాలు..!

అలాగే.. పార్టీలో విస్తృతంగా చర్చించి… ప్రశాంత్ కిషోర్ లాంటి స్ట్రాటజిస్టులతో కూడా చర్చించి.. పార్టీ తరపున కాపు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ప్రకటన చేశారని మరో వాదన కూడా ఉంది. అయినా కూడా ఇలాంటి ప్రకటన ఎందుకు చేయాల్సి వచ్చింది. ఇప్పటికీ…కూడా కాపు రిజర్వేషన్లపై తెలుగుదేశం ప్రభుత్వం ప్రయత్నిస్తూనే ఉంది. ప్రస్తుతం అది కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంది. అందుకే చంద్రబాబు చేస్తారనే నమ్మకం కాపుల్లో ఉండొచ్చు. అందువల్లే ఇప్పటికీ టీడీపీ కాపు ఓటింగ్ ను కాపాడుకుంటోంది. ఎవరు అవునన్నా.. కాదన్నా.. కాపు యువత ఓటింగ్ పవన్ కల్యాణ్ వెనుక మొబిలైజ్ అయ్యే అవకాశం ఉంది. జనసేనకు కొత్తగా పొలిటికల్ ఎఫైర్స్ కమిటీని ప్రకటించారు. అందులో ఎనభై శాతం మంది కాపు సామాజికవర్గం వారే ఉన్నారు. అంటే… పవన్ కల్యాణ్ కూడా..అంతర్లీనంగా కాపు ఓటింగ్ జనసేన వైపు వచ్చేలా పవన్ కల్యాణ్ ప్రయత్నాలు చేస్తున్నారు.

కాపుల ఓట్లపై ఆశలు వదిలేసుకున్నారా..?

గతంలో కాపు ఓటింగ్ టీడీపీకి ఏకపక్షంగా వెళ్తుందని అనుకున్నప్పుడు.. కొంత వరకైనా మద్దతు పొందాడనికి జగన్ రిజర్వేషన్లకు మద్దతు ప్రకటించారు. పవన్ కల్యాణ్ యాక్టివ్ అయిన తర్వాత.. ఎక్కువ ఆశలు జగన్మోహన్ రెడ్డి పెట్టుకోలేదు. పవన్ ఓట్లు చీలిస్తే.. టీడీపీకి మైనస్ అవుతుంది. పవన్ చీల్చడం వల్ల కాపు ఓటింగ్ మొత్తం టీడీపీ వైపు కన్సాలిడేట్ కాదు. అదే సమయంలో కాపులు ఎంతో కొంత వైసీపీకి ఓటేస్తారు. కాపు రిజర్వేషన్లు కానీ.. ఇతర అంశం అయినా..కానీ కేవలం ఒక్క అంశాన్ని బట్టి కాపులు ఓట్లు వేయరు. ఇతర పార్టీల వైపు మొగ్గేవారుంటారు. అలాంటి ఓటింగ్ ఎలాగూ తనకు ఉంటుందనుకున్నారు. రిజర్వేషన్ గురించి మాట్లాడితే అదనంగా ఏమీ రాదని డిసైడయ్యారు. అదే సమయంలో కాపు రిజర్వేషన్లు సాధ్యం కాదని చెప్పడం ద్వారా బీసీలను సమీకరించవచ్చనున్నారు.

బీసీలు మద్దతుగా వస్తారని ఆశ పడ్డారా..?

కాపు రిజర్వేషన్లపై బీసీల్లో ఆందోళన ఉంది. చంద్రబాబుపై ఆయన పార్టీకి చెందిన బీసీ నాయకుడు కృష్ణయ్య తిరగబడ్డారు. బీసీ కమిషన్ పర్యటనల్లో బీసీ సంఘాలు ఆందోళనలు చేశాయి. ఈ పరిస్థితిని ఓట్లు గా మార్చుకుని..బీసీల ఓట్లను తన వైపు కన్సాలిడేట్ చేసుకుందామనుకున్నారనే ఎత్తుగడ వేసి ఉంటారన్న వాదన కూడా వినిపిస్తోంది. కానీ ఇది అడ్డం తిరిగింది. జగన్మోహన్ రెడ్డి ఊహించిన స్థాయిలో బీసీల నుంచి సానుకూలత రాలేదు. బీసీ నాయకులు.. కానీ..బీస సంఘాలు కానీ ఎవరూ స్పందించలేదు. అంటే బీసీల్లో రావాల్సినంత సానుకూలత రాలేదు. కానీ కాపుల్లో మాత్రం తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ముద్రగడ కూడా తీవ్రంగా మండిపడ్డారు. చంద్రబాబుపై నమ్మకం ఉందన్నారు. దీంతో జగన్ కు కథ అడ్డం తిరిగందని తెలుసుకున్నారు. అందుకే మళ్లీ తాను కాపు రిజర్వేషన్లకు అనుకూలం అని ప్రకటన చేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close