తేలిపోయిన ఇన్‌సైడర్ కుట్ర..! ఇక జగన్ ఏం చేస్తారు..!?

అమరావతి ఇన్‌సైడర్ ట్రేడింగ్ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు రాజకీయవర్గాల్లో సైతం సంచలనం సృష్టిస్తోంది. ఓ వర్గం మీడియా ఈ తీర్పును పెద్దగా పట్టించుకోకపోయినప్పటికీ.. అసలు తీర్పులో ఉన్న అంశాలను చూస్తే.. ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరించిందన్న విషయం స్పష్టమవుతోందన్న వ్యక్తమవుతోంది. చాలా సూటిగా.. స్పష్టంగా హైకోర్టు తీర్పులో అనేక సమాధానాలు ఉన్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుండి పద్దతి ప్రకారం వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఎంత ఫేకో స్పష్టం చేస్తున్నాయంటున్నారు.

అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ పేరుతో సీఐడీ దాఖలు చేసిన కేసుల్లో విచారణ జరిపిన హైకోర్టు మొత్తంగా 85 పేజీల తీర్పు ఇచ్చింది. భూములు కొనుగోలు చేయటం.. భారత పౌరుడి రాజ్యాంగ, న్యాయపరమైన హక్కు … అమ్మకం దారులు భూముల్ని ఇష్టపూర్వకంగా, స్వచ్ఛందంగా అమ్ముకున్నారు.. ఈ అమ్మకాల్లో రిజిస్టర్డ్, సేల్ డీడ్స్ ఉన్నాయి.. ఇలాంటి సందర్భంలో.. ప్రైవేట్ వ్యక్తుల మధ్య లావాదేవీలు క్రిమినల్ నేరాల కిందకు రావు.. వారిని ప్రాసిక్యూట్ చేసే అధికారం ఎవరికీ లేదు అని హైకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. ఇక ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అనేది స్టాక్ మార్కెట్లో సెక్యూరిటీ కొనుగోలు, అమ్మకాల్లో అవకతవకలకు పాల్పడితే మోపే నేరం, ఇన్‌సైడర్ ట్రేడింగ్ కింద జరిగే నేరాలకు ఐపీసీలోని సెక్షన్లను వర్తింపచేయలేమని హైకోర్టు తేల్చి చెప్పింది.

ఐపీసీలోని సెక్షన్ 420తో సహా ఏ సెక్షన్ కింద అయినా ఇన్‌సైడర్ ట్రేడింగ్ కింద నేరంగా పరిగణించలేమని… ఇన్‌సైడర్ ట్రేడింగ్ అనేది ఐపీసీకి కొత్త పదమని స్పష్టం చేసింది. 420, 406, 409, 120బి సెక్షన్ల కింద కేసులు మోపడం..న్యాయ సమ్మతం కాదు.. అందుకే ఎఫ్ఐఆర్‌ కొట్టివేస్తున్నామని స్పష్టంగా చెప్పింది. రాజధాని ఎక్కడ వస్తుందో ప్రముఖ పత్రికల్లో ముందే వచ్చిందని.. సీఎం తన ప్రమాణ స్వీకారం తర్వాత విజయవాడ, గుంటూరు మధ్య.. రాజధాని వస్తుందని ప్రకటించారని ధర్మాసనం తీర్పులో గుర్తు చేసింది. భూములమ్మేవారికి, కొనుగోలు చేసేవారికి.. రాజధాని ఎక్కడ వస్తుందో తెలుసని… ప్రపంచంలో అందరికీ తెలిశాక. ఇందులో కుట్ర కోణం ఉందని ఎలా చెబుతామని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇలాంటి కేసులను అనుమతిస్తే భవిష్యత్‌లో.. భూమి అమ్మిన వారంతా ధర పెరిగిన వెంటనే.. కొనుగోలుదారులపై కేసులు పెడతారని ఆందోళన వ్యక్తం చేసింది.

ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలపై హైకోర్టు ఇచ్చిన తీర్పు … అధికార పార్టీకి కొత్తగా అనేక సమస్యలు సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయంలో.. ముందు ముందు జరిగే పరిణామాలు కీలకంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేయబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. బహుశా.. సీబీఐతో విచారణ జరిపించేందుకు తమ పలుకుబడి అంతా ఉపయోగించే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సమయంలో సజ్జల అదే చెప్పారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ సీబీఐ దగ్గర ఉందన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీలో తిరుగుబాటు వార్తలు..! సజ్జల వివరణ..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు అంటూ రిపబ్లిక్ టీవీలో వచ్చిన ఓ కథనం ఇప్పుడు వైసీపీలో అలజడి రేపుతోంది. ఎంతగా అంటే.. ఆ పార్టీకి జగన్ తర్వాత జగన్ అంతటి వ్యక్తిగా బరువు,...

స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆగదని కేంద్రంతో చెప్పించిన వైసీపీ ఎంపీలు..!

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి తమ వద్ద ప్రత్యేకమైన ప్రణాళిక ఉందని చెబుతున్న వైసీపీ నేతలు... ఢిల్లీ నుంచి మాత్రం ఏపీకి స్టీల్ ప్లాంట్‌తో సంబంధం లేదనే ప్రకటనలు...

తెలంగాణ మహిళల గురించి సరే….షర్మిల తన హక్కుల కోసం ఎలా పోరాడుతారు..!?

తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టి.. రాజన్న రాజ్యం తీసుకు వచ్చి.. అందరికీ న్యాయం చేసేయాలన్న పట్టుదలతో ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని కూడా ఉపయోగించుకున్నారు. పెద్ద...

చంద్రబాబు బూతులు మాట్లాడుతున్నారంటున్న సజ్జల..!

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారాలు కానీ.. రాజకీయ విమర్శలు కానీ బూతుల రేంజ్‌లో ఎవరు చేస్తారు..? అంటే ప్రత్యేకంగా సమాధానం వెదుక్కోవాల్సిన అవసరం లేదు. అయితే అదే వైసీపీ నేతలు ఇప్పుడు.. చంద్రబాబు, లోకేష్...

HOT NEWS

[X] Close
[X] Close