రథయాత్ర చేయనివ్వరని బీజేపీకి అంత నమ్మకమా..!?

ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నేతలు ఫిబ్రవరి నాలుగో తేదీ నుంచి రథయాత్ర చేపట్టాలనుకున్నారు. అయితే వారు ఏర్పాట్లు ప్రారంభించక ముందే.. ప్రభుత్వం ఆపుతుందని.. అలా ఆపడానికి ప్రయత్నిస్తే.. ప్రభుత్వానికి టైం దగ్గర పడినట్లేనని విమర్శలు ప్రారంభించారు. ఒకరి తర్వాత ఒకరు… ప్రతీ రోజూ.. ఎవరోఒకరు ప్రెస్‌మీట్లు పెట్టి ఇవే విమర్శలు చేస్తున్నారు. రథయాత్ర చేయడానికి పర్మిషన్ అవసరమో లేదో.. అవసరం అయితే.. దరఖాస్తు చేసుకున్నారో లేదో అసలు ఎవరికీ తెలియదు. ప్రారంభానికి రెండు వారాలకుపైగా సమయం ఉన్నప్పటికీ.. అప్పుడే అడ్డుకుంటారని విమర్శలు ప్రారంభించారు.

యాత్రను అడ్డుకుంటామని ప్రభుత్వం కానీ.. పోలీసులు కానీ ఎప్పుడూ చెప్పలేదు. చినజీయర్ స్వామి యాత్ర చేస్తూంటే ఎవరూ అడ్డుకోలేదు. బీజేపీ నేతలు చేసినా పోలీసులు అడ్డుకునే అవకాశం లేదు. అయితే..మత విద్వేషాలు రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తే మాత్రం అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశం ఉంది. వాళ్లు అలా రెచ్చగొడతారో లేదో కానీ ముందుగా పోలీసుల్ని మాత్రం రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. యాత్ర చేసే ఉద్దేశం లేక.. ప్రభుత్వం అడ్డుకుంటుందని విమర్శలు చేయడానికో.. లేకపోతే… తాము ప్రారంభించబోయే యాత్రకు హైప్ తెచ్చుకోవడానికో బీజేపీ నేతలు ఇలా విమర్శలు చేస్తున్నార్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

రామతీర్థం వెళ్లాలనుకున్న బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. రెండు సార్లు ప్రయత్నించినప్పటికీ.. అడ్డుకోవడంతో వెళ్లలేకపోయారు. దాంతో…కపిల తీర్థం టు రామతీర్థంను కూడా అడ్డుకుంటారన్న అనుమానాలు వారిలో బలపడుతున్నాయి. అయితే ఓ రాజకీయ పార్టీ పెట్టుకున్న కార్యక్రమాన్ని అడ్డుకోవడం అనే సంప్రదాయం ఏపీలో లేదు. ఇప్పుడున్న ప్రభుత్వం ప్రజాసమస్యలపై పోరాటానికి ప్రతిపక్ష నేతలు వెళ్లినా అడ్డుకుంటోంది. సొంత కార్యకర్తలతో రాళ్లు వేయించడం.. వంటి పనులు కూడా చేయిస్తోంది.పోలీసులు నిమిత్త మాత్రులుగా మిగిలిపోయారు. ఇలాంటి సమయంలో… బీజేపీ ముందుగానే రథయాత్రను అడ్డుకుంటారనే ఆరోపణలు చేస్తోంది. నిజంగా రథయాత్ర ప్రారంభమయ్యే సరికి ఏం జరుగుతుందో..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆసుపత్రి వ్యాపారంపై మాధవీలత సంచలన వ్యాఖ్యలు

మాధవీలత... బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి. ఎంఐఎంకు పెట్టని కోటగా ఉన్న హైదరాబాద్ సెగ్మెంట్ లో ఈసారి జెండా పాతుతామని చెప్తున్నా బీజేపీ నేతల వ్యాఖ్యలకు తగ్గట్టుగానే మాధవీలత అందరి దృష్టిని...

బీఆర్ఎస్ కు బిగ్ షాక్ – కాంగ్రెస్ లోచేరిన కేటీఆర్ బావమరిది..!

లోక్ సభ ఎన్నికల ముంగిట బీఆర్ఎస్ కు షాక్ ల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, కీలక నేతలు పార్టీని వీడుతుండగా తాజాగా కేటీఆర్ బావమరిది ఎడ్ల రాహుల్ రావు...

మలయాళం కథతో తరుణ్ భాస్కర్ ?

తరుణ్ భాస్కర్ కి నటనపై ఆసక్తి ఎక్కువే. తను తీసిన 'కీడాకోలా' నటుడిగా ఆయన్ని మరో మెట్టుఎక్కించింది. ప్రస్తుతం దర్శకుడిగా కథలు రాసుకోవడంతో పాటు నటుడిగా కూడా కొన్ని ప్రాజెక్ట్స్ సైన్ ...

బీఆర్ఎస్ఎల్పీ విలీనం లేనట్లే – రేవంత్ ఆకర్ష్ ఫెయిల్ !

బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకుంటామని ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని చేస్తున్న ప్రచారం అంతా డొల్గా తేలుతోంది. ముందుకు వచ్చిన ఒక్కో ఎమ్మెల్యేకు కండువా కప్పుతున్నారు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close