సీఎం జగన్..! సవాళ్లను అవకాశాలుగా మల్చుకున్న జగన్..!

సవాళ్లను అవకాశాలుగా మార్చుకుని ముందుకెళతామని.. టీడీపీ అధినేత చెబుతూ ఉంటారు. ఆయనవన్నీ మాటలే… వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాత్రం అసలు సవాళ్లను అధిగమించి.. ఆంధ్రప్రదేశ్‌లో అనితరసాధ్యమైన విజయాన్ని సాధించారు. జగన్మోహన్ రెడ్డి…గత పదేళ్ల కాలంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. వైఎస్ హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించినప్పటి నుంచి అవిశ్రాంతంగా పని చేస్తూనే ఉన్నారు. ఓ వైపు సీబీఐ కేసుల్లో విచారణ… మరో వైపు… ప్రతీ వారం కోర్టుకెళ్లే పరిస్థితులను కూడా ధైర్యంగా ఎదుర్కొన్నారు. భారతీయ జనతా పార్టీతో.. టీడీపీ పొత్తు పెట్టుకుని గత ఎన్నికల్లో విజయం సాధించింది. ఆ సమయంలో.. బీజేపీ జగన్మోహన్ రెడ్డితో పొత్తుకే ఆసక్తి చూపించిందని ప్రచారం జరిగింది. కానీ.. జగన్ మాత్రం ఆసక్తి చూపించలేదు.

అయితే.. వ్యూహాత్మకంగా ఆయన రాజకీయం చేసారు. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ…జగన్ కు ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. అయినప్పటికీ.. అన్నింటినీ ఎదుర్కొన్నారు. పదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండి.. పార్టీని అత్యంత సమర్థంగా నడిపారు. ఆయనకు సలహాలివ్వడానికి అందరూ ముందుకు వస్తారు. అందుకే సీనియర్ నేతల్ని ఎవర్నీ దగ్గరకు రానీయలేదు. ఒకే ఒక్క విజయసాయిరెడ్డి, ఐ ప్యాక్ ప్రశాంత్ కిషోర్‌తోనే పనులు చేయించారు. అనుకున్నది అనుకున్నట్లు రాజకీయ వ్యూహాన్ని అమలు చేయగలిగారు. అనుకున్న దాని కంటే అద్భుతమైన ఫలితాన్ని సాధించగలిగారు.

జగన్ నాయకత్వ సామర్థ్యంపై.. చాలా మంది నేతలు సందేహాలు వ్యక్తం చేసేవారు. అయితే.. తాను కొత్త తరానికి ప్రతినిధినని.. ఔట్ డేటెడ్ రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని.. తేల్చారు. దానికి తగ్గట్లుగానే… తన వ్యూహాలు అమలు చేశారు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా… వెనక్కి తగ్గలేదు. టీడీపీపై పోరాటంలో వినూత్న పంథా అవలంభించారు. ఎప్పుడూ లేని విధంగా… అసెంబ్లీని నిరవధికంగా.. బహిష్కరించినా…. హైదరాబాద్ నుంచే రాజకీయం చేసినా… ప్రజల మద్దతు పొందగలిగారు. సవాళ్లను… అవకాశాలుగా మల్చుకోవడం.. వైసీపీ అధినేతకు వెన్నతో పెట్టిన విద్య.. అని.. నిరూపించుకున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close