బాల‌య్య రైట్ హ్యాండ్‌.. జ‌గ్గూ భాయ్‌

లెజెండ్‌తో.. జ‌గ‌ప‌తిబాబులోని విల‌న్ విశ్వరూపం చూపించాడు. ఆ సినిమాతో జ‌గ‌పతి బాబు కెరీర్ ట‌ర్న్ అయిపోయింది. హీరోగా ఎంత సంపాదించాడో తెలీదు గానీ, విల‌న్ గా మారాక మాత్రం జ‌గ‌ప‌తి ఆస్తులు పెరిగాయి. ఈ విష‌యం ఆయ‌నే చెప్పాడు. అప్ప‌టి `జ‌య జాన‌కీ నాయ‌క‌` పాత్ర‌లోనూ.. విల‌న్ గానే క‌నిపించాడు జ‌గ‌ప‌తి. ఇప్పుడు బాల‌కృష్ణ సినిమాలోనూ జ‌గ‌ప‌తికి ఓ కీల‌క‌మైన పాత్ర ఇచ్చాడు. బోయపాటి సినిమాలో జ‌గ‌ప‌తి అన‌గానే.. ఈసారీ విల‌న్ ఏమో అనుకున్నారంతా. అయితే.. ఈసారి మాత్రం ప‌క్కా పాజిటీవ్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడ‌ట‌. బాల‌య్య‌కు కుడిభుజం లాంటి పాత్ర‌లో జ‌గ‌ప‌తి క‌నిపిస్తాడ‌ని, త‌న పాత్ర‌నే ఈ క‌థ‌లో కీల‌క‌మైన మ‌లుపుకు కార‌ణం అవుతుంద‌ని తెలుస్తోంది. బోయ‌పాటి ప్ర‌తి సినిమాలోనూ హీరోకి ఓ గ్యాంగ్ ఉంటుంది. అందులో అంతా మంచివాళ్లే. ఈ సినిమాలో ఆ గ్యాంగ్‌లో జ‌గ‌ప‌తిబాబు ఉంటాడ‌ట‌. శ్రీ‌కాంత్ ప్ర‌ధాన విల‌న్ అయినా, ఈ సినిమాలో చాలామంది విల‌న్లు క‌నిపిస్తార‌ని టాక్‌. మేలో బాల‌య్య సినిమా విడుద‌ల కాబోతోంది. శివ‌రాత్రికి టైటిల్ తో పాటు ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేస్తారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

శ్రీవారిని ఒక్క సారీ దర్శించుకోని వైసీపీ అభ్యర్థి..!

తిరుపతి వైసీపీ అభ్యర్థి గురుమూర్తిపై భారతీయ జనతా పార్టీ నేతలు కొత్త కొత్త విషయాలు ప్రసారం చేస్తున్నారు. తిరుపతి ఎంపీ అభ్యర్థి ఇంత వరకూ ఒక్క సారంటే ఒక్క సారి కూడా తిరుమల...

కోల్‌కతా ఓడిపోవడానికే ఆడినట్లుందే..!?

ఎవరైనా మ్యాచ్‌లు ఎందుకు ఆడతారు..? గెలవడానికే ఆడతారు. కానీ ఓడిపోవడానికే ఆడితే ఎలా ఉంటుంది..?. నిజంగా ఓడిపోవడానికి ఎవరూ ఆడరు..కానీ మంగళవారం నాటి ముంబై, కోల్‌కతా మ్యాచ్ చూస్తే రెండు జట్లు ఓడిపోవడానికి...

ఆ ప్రాజెక్ట్ చూస్తామంటే కుదరదంటోన్న ఏపీ..!

ఓ ప్రాజెక్ట్‌ను చూడటానికి వస్తామని కృష్ణాబోర్డు అంటోంది. చూసేందుకు కూడా ఒప్పుకోబోమని.. ఏపీ సర్కార్ తేల్చి చెబుతోంది. కృష్ణా బోర్డు మాత్రం.. అదే పనిగా తాము వస్తున్నామని తేదీ ఖరారు చేసి ఏపీ...

ఏపీలోనే ధరలెక్కువ..! ఎందుకని..?

సాధారణంగా నిత్యావసర వస్తువుల ధరలు ఎక్కడ ఎక్కువగా ఉంటాయి..? పట్టణాల్లో .. నగరాల్లో ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో దేశంలో అన్ని ప్రాంతాల్లో ఉన్న సాధారణ రేట్లే ఉంటాయి. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం.. నిత్యావసర...

HOT NEWS

[X] Close
[X] Close