తొలి 10 నిమిషాలు ముందే చూపించేస్తార్ట‌!

మంచు విష్ణు క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న చిత్రం మోస‌గాళ్లు. ఇదో వైట్ కాల‌ర్ మోసం చుట్టూ తిరిగే క‌థ‌. టెక్నాల‌జీని వాడుకుంటూ… మోస‌గాళ్లు ఎలా రెచ్చిపోతున్నారో చెప్పే క‌థ‌. ట్రైల‌ర్ ఇటీవ‌లే విడుద‌లైంది. కాజ‌ల్, సునీల్ శెట్టి లాంటి స్టార్లు ఈ చిత్రానికి వెన్నెముక‌. న‌వ‌దీప్‌, న‌వీన్ చంద్ర లాంటి యూత్ బ్యాచ్ కూడా క‌నిపిస్తున్నారు. త్వ‌ర‌లోనే విడుద‌ల కాబోతోంది. అయితే.. విడుద‌ల‌కు ముందే… ఈసినిమాలోని తొలి 10 నిమిషాల ఎపిసోడ్ నీ మంచు విష్ణు చూపించేస్తున్నాడ‌ట‌. హైద‌రాబాద్, విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నంలాంటి ప్ర‌ధాన‌మైన న‌గ‌రాల్లో స్క్రీనింగ్ ఏర్పాటు చేసి, తొలి 10 నిమిషాల సినిమానీ ప్ర‌ద‌ర్శించే ఏర్పాట్ల‌లో ఉన్నాడ‌ట‌. ఇది వ‌ర‌కు కొన్ని సినిమాల‌కు ఇదే జ‌రిగింది. తొలి స‌న్నివేశాల్ని ముందే ఆన్ లైన్‌లో విడుద‌ల చేసి, జ‌నాల క్యూరియాసిటీ పెంచేందుకు ప్ర‌య‌త్నించారు. ఇప్పుడు అదే బాట‌లో విష్ణు కూడా న‌డుస్తున్నాడు. కాక‌పోతే.. ఈసారి ప్ర‌త్యేక‌మైన ప్ర‌దేశాల్లో, నగ‌రాల్లో, ప్ర‌త్యేక‌మైన ప్రేక్ష‌కుల‌కే ఈ తొలి 10 నిమిషాలూ చూసే ఛాన్స్ వుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

శ్రీవారిని ఒక్క సారీ దర్శించుకోని వైసీపీ అభ్యర్థి..!

తిరుపతి వైసీపీ అభ్యర్థి గురుమూర్తిపై భారతీయ జనతా పార్టీ నేతలు కొత్త కొత్త విషయాలు ప్రసారం చేస్తున్నారు. తిరుపతి ఎంపీ అభ్యర్థి ఇంత వరకూ ఒక్క సారంటే ఒక్క సారి కూడా తిరుమల...

కోల్‌కతా ఓడిపోవడానికే ఆడినట్లుందే..!?

ఎవరైనా మ్యాచ్‌లు ఎందుకు ఆడతారు..? గెలవడానికే ఆడతారు. కానీ ఓడిపోవడానికే ఆడితే ఎలా ఉంటుంది..?. నిజంగా ఓడిపోవడానికి ఎవరూ ఆడరు..కానీ మంగళవారం నాటి ముంబై, కోల్‌కతా మ్యాచ్ చూస్తే రెండు జట్లు ఓడిపోవడానికి...

ఆ ప్రాజెక్ట్ చూస్తామంటే కుదరదంటోన్న ఏపీ..!

ఓ ప్రాజెక్ట్‌ను చూడటానికి వస్తామని కృష్ణాబోర్డు అంటోంది. చూసేందుకు కూడా ఒప్పుకోబోమని.. ఏపీ సర్కార్ తేల్చి చెబుతోంది. కృష్ణా బోర్డు మాత్రం.. అదే పనిగా తాము వస్తున్నామని తేదీ ఖరారు చేసి ఏపీ...

ఏపీలోనే ధరలెక్కువ..! ఎందుకని..?

సాధారణంగా నిత్యావసర వస్తువుల ధరలు ఎక్కడ ఎక్కువగా ఉంటాయి..? పట్టణాల్లో .. నగరాల్లో ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో దేశంలో అన్ని ప్రాంతాల్లో ఉన్న సాధారణ రేట్లే ఉంటాయి. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం.. నిత్యావసర...

HOT NEWS

[X] Close
[X] Close