సౌంద‌ర్య టాపిక్ తీసుకురావ‌ల్సిందేనా?

జ‌గ‌ప‌తిబాబు – సౌంద‌ర్య‌…
ఈ జంట‌పై పుట్టిన గాసిప్పులెన్నో. వెండి తెర‌పై వీరిద్ద‌రిదీ సూప‌ర్ హిట్ కాంబినేష‌న్‌. బ‌య‌ట కూడా అలాంటి అనుబంధ‌మే ఉండేద‌ని అప్ప‌ట్లో టాకు. ఓ ద‌శ‌లో జ‌గ‌ప‌తిబాబు సౌంద‌ర్య‌ని పెళ్లి కూడా చేసుకోవాల‌నుకున్నాడ‌ని వార్త‌లు వ‌చ్చాయి. సౌంద‌ర్య ఇప్పుడు మ‌న మధ్య లేరు. కానీ… జ‌గ‌ప‌తిబాబుతో ఎవ‌రు ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూ చేసినా – సౌంద‌ర్య టాపిక్కు తీసుకురావ‌డం మాత్రం కామ‌న్ అయిపోయింది. జ‌గ‌ప‌తిబాబు కూడా లోప‌ల ఏదీ దాచుకోని ర‌కం కాదు. ఉన్న‌ది ఉన్న‌ట్టుగా మాట్లాడ‌డ‌మే త‌న‌కు తెలుసు. సౌంద‌ర్య మ‌ర‌ణించి ఇంత కాల‌మైనా, త‌రాలు మారినా – మీడియా వాళ్లు కూడా సౌంద‌ర్య టాపిక్ ఎత్త‌డం మాన‌లేదు.

ఈమ‌ధ్య ఓ ఇంట‌ర్వ్యూలో సౌంద‌ర్య ప్ర‌స్తావ‌న తీసుకొచ్చాడు జ‌గ్గూభాయ్‌. అప్ప‌ట్లో త‌మ మ‌ధ్య మంచి అనుబంధం ఉంద‌ని, జ‌నాలు దాన్ని ఎఫైర్ రూపంలో చూడ‌డం మొద‌లెట్టార‌ని, ఇక్క‌డ ఎఫైర్ అంటే అర్థం ఒక్క‌టే అని, దాన్ని శారీర‌క సంబంధంలా భావిస్తార‌ని, అయితే సౌంద‌ర్య‌తో త‌న అనుబంధం ప్ర‌త్యేక‌మైన‌ద‌ని, దానికి అస‌లైన అర్థం ఎవ్వ‌రికీ తెలీద‌ని చెప్పుకొచ్చాడు జ‌గ్గూభాయ్‌. సౌంద‌ర్య కుటుంబ స‌భ్యులు కూడా త‌న‌తో ఆత్మీయంగా ఉండేవార‌ని, అందుకే తాను చాలా సార్లు సౌంద‌ర్య ఇంటికి వెళ్లాన‌ని, దాంతో త‌మ మ‌ధ్య ఏదో ఉంద‌న్న వార్త‌ల‌కు బ‌లం చేకూరింద‌ని, ర‌క‌ర‌కాలుగా మాట్లాడుకోవ‌డాని ఆస్కారం దొరికింద‌ని ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్లిపోయాడు. మ‌న మ‌ధ్య లేని వ్య‌క్తి గురించి మంచి విష‌యాలే చెప్పుకోవ‌డం అంద‌రూ పాటించాల్సిన సంప్ర‌దాయం. లేని వ్య‌క్తుల గురించి, వాళ్ల‌తో ఉన్న వ్య‌క్తిగ‌త సంబంధాల గురించి ఇప్పుడు ప్ర‌స్తావించాల్సిన అవ‌స‌రం ఏముంది? కాక‌పోతే ఈ విష‌యంలో మీడియా కూడా బాగా అతి చేస్తుంటుంది. జ‌గ‌ప‌తిబాబు ఎన్నిసార్లు చెప్పినా స‌రే.. సౌంద‌ర్య టాపిక్ తీసుకురావ‌డం మాత్రం మాన‌దు. అడిగింతే త‌డ‌వుగా చెప్ప‌డం జ‌గ్గూభాయ్ మాన‌డు. దాంతో ఇదో అంతు లేని `వార్త‌`లా మారిపోయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

క్రైమ్ : ఒక్క హత్య బయట పడకుండా 9 హత్యలు..! కానీ..

ఒక్క హత్య చేశాడు.. అది ఎక్కడ బయటపడుతుందోనని తొమ్మిది మందిని చంపేశాడు. స్థూలంగా వరంగల్ జిల్లాలోని గొర్రెల కుంట బావిలో బయటపడిన తొమ్మిది మృతదేహాల కథ. ఇందులో నిందితుడు..బాధితులు.. ఎవరూ తెలుగువాళ్లు కాదు....

తూచ్.. శ్రీవారి భూములు అమ్మాలని బోర్డు నిర్ణయం తీసుకోలేదన్న సుబ్బారెడ్డి..!

శ్రీవారి భూములు అమ్మడానికి ఆస్తులు గుర్తించి..రిజిస్ట్రేషన్ అధికారాలను కూడా అధికారులకు కట్టబెట్టేసిన తర్వాత... ఇప్పుడు వివాదం ఏర్పడటంతో.. టీటీడీ బోర్డు చైర్మన్ మాట మార్చారు. భూములు అమ్మడానికి పాలక మండలి నిర్ణయం తీసుకోలేదని...కేవలం...

బీజేపీ తల్చుకుంటే శ్రీవారి ఆస్తుల అమ్మకం నిలిపివేత ఎంత సేపు..!?

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు..శ్రీవారి ఆస్తులను అమ్మకానికి పెట్టిన విషయంపై బీజేపీ భగ్గమని లేస్తోంది. ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు దీక్షలకు సిద్ధమయ్యారు..తెలంగాణ నేతలు కూడా.. ఊరుకునేది లేదని.. హెచ్చరికలు జారీ చేస్తున్నారు. స్వయంగా......

ఏడాదిలో 90 శాతం హామీలు అమలు చేశాం : జగన్

మద్యం రేట్లను పెంచడం ద్వారా మద్యం తాగే వారి సంఖ్య 24 శాతం మేర తగ్గిపోయిందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తేల్చారు. పాలనకు ఏడాది పూర్తవుతున్న సందర్భంగా.. మన పాలన- మీ...

HOT NEWS

[X] Close
[X] Close