మ‌న‌మంతే బ్ర‌ద‌ర్‌!

మ‌న‌మంతే బ్ర‌ద‌ర్‌
చూసి ర‌మ్మంటే కాల్చొస్తాం
పిలుస్తే చాల‌ని చెబితే
పిప్పి పిప్పి చేస్తాం.
మ‌న‌మంతే బ్ర‌ద‌ర్‌!

క‌రోనా కార్చిచ్చు కంటే
లంచ్‌లోకి చికెన్ క‌ర్రీనే ఇంపార్టెంటు
ప్ర‌పంచ‌మంతా గ‌గ్గోలు పెడుతున్నా
గోధుమ పిండిపైనే ఫోక‌సు..
మ‌న‌మంతే బ్ర‌ద‌ర్‌!

ట్రాఫిక్కు జాములో చిక్కుకుని
చిక్క‌టి కాలుష్యాన్ని పీల్చుకుని
గంట‌ల కొద్దీ రోడ్డుపైనే కాపురాలు చేసేస్తాం!
ఇంట్లో కూర్చోమంటే మాత్రం
దిన‌దిన గండంలా బ‌తుకుతుంటాం.
మ‌న‌మంతే బ్ర‌ద‌ర్‌

వాడెంతిచ్చాడు
వీడెంతిచ్చాడు
అని లెక్క‌లేస్తాం.
అంకెల్లో తేడా వ‌స్తే
దేశ‌భ‌క్తి లేదా అంటూ నిందిస్తాం.
జేబులోంచి మాత్రం చిల్లిగ‌వ్వ తీయం.
మ‌న‌మంతే బ్ర‌ద‌ర్!

చేతులు క‌డుక్కోవ‌డం
మూతి తుడుచుకోవ‌డం కూడా
మ‌న‌కు స్టార్లే చెప్పాలి
శుభ్ర‌త పాఠాలు బోధించ‌డానికీ
సెల‌బ్రెటీలే దిగిరావాలి
మ‌న‌మంతే బ్ర‌ద‌ర్‌!

దిల్లీ వెళ్లొచ్చిన‌వాడ్ని దేశ ద్రోహిగా చూస్తాం
మ‌నం మాత్రం గ‌ల్లీల్లో ఉప్ప‌రు మీటింగులు పెడ‌తాం
ఫేస్ బుక్కులోన ఫేకు న్యూసులే న‌మ్ముతాం
సిల్లీ వార్త‌లే స‌ర్క్యులేట్ చేసుకుంటాం.
మ‌న‌మంతే బ్ర‌ద‌ర్‌!

ఒక్క‌రోజు లాక్ డౌన్ అంటే
యేడాది సామాన్లు కొనేస్తాం.
తెల్లారేక రేట్లు పెరిగాయ‌ని గోల చేస్తాం.
త‌ప్ప‌ట్లు కొట్ట‌మంటే
త‌పేళాలు బ‌ద్ద‌ల‌కొట్టేస్తాం..
దీపం వెలిగించంటే దీపావ‌ళి చేసేస్తాం
మ‌న‌మంతే బ్ర‌ద‌ర్!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రూ. 117 కోట్ల ఏపీ సీఎంఆర్ఎఫ్‌ సొమ్ముకు నకిలీ చెక్కులు..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ నుంచి ఏకంగా రూ. 117 కోట్లను కొట్టేయడానికి వేసిన ఓ ప్లాన్ బయటపడింది. సీఎంఆర్ఎఫ్ పేరుతో.. అసిస్టెంట్ సెక్రటరీ టు గవర్నమెంట్, రెవిన్యూ శాఖ ఇచ్చినట్లుగా చెబుతున్న...

ఆ బిల్లులు రాజ్యసభలో ఓటింగ్ లేకుండానే పాస్..!

వ్యవసాయ బిల్లులు రాజ్యసభలో గట్టెక్కడం కష్టమని.. కేంద్ర ప్రభుత్వ చిక్కులలో పడిపోయిందని ప్రతిపక్షాలు ఊహించుకున్నాయి కానీ... బీజేపీ పెద్దలు అంత కంటే వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఓటింగ్ అవసరం లేకుండా.. మూజువాణి ఓటుతో ఆమోదించేసినట్లుగా...

నాగ అశ్విన్ పరిస్థితేంటి?

'మ‌హాన‌టి' త‌ర‌వాత‌... మ‌రో సినిమా మొద‌లెట్ట‌లేదు నాగ అశ్విన్‌. ప్ర‌భాస్ తో ఓ సినిమా ఓకే చేసుకుని అంద‌రికీ షాక్ ఇచ్చాడు. వైజ‌యంతీ మూవీస్ లో దాదాపు 300 కోట్ల‌తో ఈ సినిమా...

షరతుల్లేకుండానే రాజ్యసభలోనూ వ్యవసాయ బిల్లుకు వైసీపీ మద్దతు..!

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతున్న సమయంలో.. వైసీపీ బీజేపీకి అండగా నిలిచింది. ఎన్డీఏ పక్షంలోని పార్టీలే ఆ బిల్లులను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఎన్డీఏ నుంచి వైదొలుగుతున్న సమయంలో.. వైసీపీ...

HOT NEWS

[X] Close
[X] Close