[X] Close
[X] Close
జగ్గారెడ్డికి బెయిల్..! వాట్ నెక్ట్స్..?

కాంగ్రెస్ పార్టీ నేత జగ్గరెడ్డికి బెయిల్ లభించింది. 14 ఏళ్ల కిందటి మనుషుల అక్రమ రవాణా కేసులో ఈ నెల పదకొండో తేదీన పోలీసులు అర్థరాత్రి పూట.. జగ్గారెడ్డిని అరెస్ట్ చేశారు. 2004లో నేరం జరిగిందని… కొత్తగ ఫిర్యాదు, ఆధారాల లభించాయని చెబుతూ.. పోలీసులు అరెస్ట్ చేసారు. తన భార్య పిల్లల పేరిట ఇతరులను అమెరికాకు జగ్గారెడ్డి తరలించారని పోలీసులు నేరారోపణ చేశారు. ఈ సంఘటన 2004లో జరిగినప్పటికి తాజాగా తమకు అందిన సమాచారం మేరకు కేసు నమోదు చేశామని, మానవ అక్రమ రవాణా ద్వారా జగ్గారెడ్డికి పెద్దమొత్తంలో డబ్బు ముట్టిందని నార్త్ జోన్ డీసీపీ సుమతి తెలిపారు. మరిన్ని వివరాల కోసం.. మూడు రోజుల కస్టడీకి కూడా తీసుకున్నారు.

కస్టడీ సమయం అయిన తర్వాత జగ్గారెడ్డి తరఫు న్యాయవాదులు ఇదీ రాజకీయకక్షపూరిత కేసు అని .. బెయిల్ మంజూరు చేయాలని సికింద్రబాద్ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత సోమవారం జగ్గారెడ్డికి షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. కేవలం రాజకీయ కక్షతోనే… ఈ కేసులో జగ్గారెడ్డిని అరెస్ట్ చేశారని కాంగ్రెస్ పార్టీ కొద్ది రోజులుగా ఆరోపణలు చేస్తోంది. ఆనాటి మనుషుల అక్రమ రవాణా కేసులో నిందితునిగా ఉన్న వ్యక్తి.. కేసీఆర్, హరీష్ రావుల పేర్లు కూడా చెప్పారని .. ఉత్తమ్ కుమార్ రెడ్డి నివేదికను బయటపెట్టారు. హరీష్ రావు పేరుతో కొంత మంది ఇప్పటికీ అమెరికాలో ఉన్నారని చెబుతున్నారు. ఇప్పుడు కొత్తగా జగ్గారెడ్డిపై ఎలాంటి ఆధారాలు దొరికాయో.. పోలీసులు బయటపెట్టలేదు.

ఎవరు ఫిర్యాదు చేశారో కూడా చెప్పలేదు. పాస్‌పోర్ట్ ఆఫీసు నుంచి ఫిర్యాదు వచ్చిందో లేదో కూడా పోలీసులు చెప్పలేదు. మొత్తానికి జగ్గారెడ్డిని ఆకస్మికంగా అరెస్ట్ చేయడం.. చేసిన కేసు పధ్నాలుగేళ్ల కిందటిది కావడంతో.. రాజకీయంగా కక్ష సాధింపేనన్న చర్చ జరుగుతోంది. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ మరింత దూకుడుగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న ఆలోచన చేస్తోంది. జైలు నుంచి విడుదలైన తర్వాత జగ్గారెడ్డి ఈ దిశగా కేసీఆర్ కు వ్యతిరేకంగా కార్యాచరణ సిద్ధం చేసుకునే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com

Most Popular

ఏప్రిల్ 30 వరకు లాక్ డౌన్ పొడిగించిన ఒడిశా

కరోనా వ్యాప్తి నివారించడానికి భారత ప్రభుత్వం విధించిన 21 రోజుల లాక్ డౌన్ ఏప్రిల్ 15వ తేదీన ముగియనుంది. అయితే ఏప్రిల్ 15వ తేదీకి లాక్ డౌన్ ఎత్తివేసే పరిస్థితి ప్రస్తుతం కనిపించడం...

క‌రోనా ఎఫెక్ట్ : బొమ్మ‌కి ‘బొమ్మ’ క‌నిపించ‌డం ఖాయం

బిఫోర్ క‌రోనా - ఆఫ్ట‌ర్ క‌రోనా అని విడ‌దీసుకుని చూసుకోబోతున్నామేమో..? ప‌రిస్థితులు అలానే క‌నిపిస్తున్నాయి. ఎందుకు పుట్టిందో తెలీదు గానీ, ఈ మ‌హ‌మ్మారి వ్య‌వ‌స్థ‌ల‌న్నింటినీ త‌ల‌కిందులు చేసేసింది. మ‌నిషి మ‌నుగ‌డ‌కే ప్ర‌శ్నార్థ‌కంగా...

12 గంటల్లో ఏపీలో ఒక్కటీ నమోదు కాని పాజిటివ్ కేస్.!

ఆంధ్రప్రదేశ్‌లో గత పన్నెండు గంటల్లో ఒక్కటంటే.. ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. నిన్న రాత్రి తొమ్మిది గంటల నుండి ఈ ఉదయం తొమ్మిది గంటల వరకూ... చేసిన...

అయితే పచ్చ మీడియా..లేకపోతే కులం..! వైసీపీ ఎదురుదాడి అస్త్రాలు ఈ రెండే..!?

ఆంధ్రప్రదేశ్‌లో యూనివర్శిటీల పాలక మండళ్ల నియామకం విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరించిన తీరు తీవ్ర వివాదాస్పదమవుతోంది. వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న దశలో.. యంత్రాంగం మొత్తం... దానిపైనే దృష్టి పెట్టినా... హఠాత్తుగా వర్శిటీల...

HOT NEWS