అ.అ.ఆ…. ఏం చెప్పాల‌నుకున్నారో…?

టీజ‌ర్లు, ట్రైల‌ర్ల ప‌ని…. సినిమాపై ఆస‌క్తిని పెంచ‌డ‌మే. ఏదో ఉంద‌ని చూపిస్తూ, ఊరిస్తూ జ‌నాల్ని థియేట‌ర్ల‌కు ర‌ప్పిండ‌చ‌మే వాటి ల‌క్ష్యం. టీజ‌ర్ కంటే చిన్న‌గా ఓ ప్ర‌చార చిత్రం క‌ట్‌చేసి.. దానికో విచిత్ర‌మైన పేరు పెట్టి వ‌ద‌ల‌డం ఈమ‌ధ్య ట్రెండ్ గా మారింది. `అమ‌ర్ అక్బ‌ర్ ఆంటీనీ` కూడా అదే ఫాలో అయ్యింది. ర‌వితేజ – శ్రీ‌నువైట్ల కాంబినేష‌న్‌లో రూపొందిన చిత్ర‌మిది. `వైవ‌ట్` పేరుతో టీజ‌ర్ లాంటిది ఈ రోజు విడుద‌ల చేశారు. ర‌వితేజ‌ని మూడు విభిన్న‌మైన గెట‌ప్పుల్లోచూపించ‌డం త‌ప్ప‌… ఈ `వైవ‌ట్‌`లో కొత్త‌గా ఏం లేదు. అవి మూడు గెట‌ప్పులా?? ఒకే గెట‌ప్పుని మూడు డ్ర‌స్సుల్లో చూపించారా? అన్న‌దీ అనుమాన‌మే. ఎవ‌రు అమ‌ర్‌, ఎవ‌రు అక్బ‌ర్‌, ఎవ‌రు ఆంటోనీ అనే విష‌యాల‌పైనా `వైవ‌ట్‌` క్లారిటీ ఇవ్వ‌లేక‌పోయింది. అస‌లు ఇలాంటి ప్ర‌చార చిత్రాల ద్వారా చిత్ర బృందం ఏం చెప్పాల‌నుకున్న‌ది? అనేదీ క్లారిటీ లేకుండా పోయింది. ఫ‌స్ట్ లుక్‌, టీజ‌ర్‌, ట్రైల‌ర్ అంటే జ‌నాల్లో ఓర‌క‌మైన ఆస‌క్తి ఉంటుంది. క‌థేంటో, పాత్ర‌ల తీరేంటో వీటి ద్వారా తెలుస్తుందిలే.. అని ఉత్సుక‌త చూపిస్తారు. ఇదిగో ఇలాంటి ప్ర‌య‌త్నాలు, ప్ర‌యోగాలు ఆ ఆస‌క్తిని కాస్త స‌న్న‌గిల్లేలా చేస్తుంటాయి. అదేదో టీజ‌రే విడుద‌ల చేసి.. క‌థ‌ని, మూడు పాత్ర‌ల్నీ క్లుప్తంగా ప‌రిచ‌యం చేస్తే పోయేది క‌దా?? అంటూ ర‌వితేజ అభిమానులు కామెంట్ చేసుకుంటున్నారు. ఇవ‌న్నీ శ్రీ‌నువైట్ల అండ్ గ్యాంగ్‌కి చేరాయే లేదో..??

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close