చాలా మంది నేరస్తుల్ని జైలుకు పంపిన ఐపీఎస్ అధికారి సంజయ్ తాను తలదాచుకుంటూ జైలుకెళ్లారు. ఆయన జీవితంలో ఇంత కంటె పతనం ఉండదేమో?. సుదీర్గ సర్వీసులో ఎంతో గౌరవంతో రిటైర్ కావాల్సిన ఆయన జీవితంలో మరక అలాగే ఉండిపోతుంది. ఎక్కడికెళ్లినా జైలుకెళ్లిన ఐపీఎస్ అని చెప్పుకుంటారు. బంధువులు, సర్కిల్స్ లో అంతా ఆయనను చూసే విధానం మారిపోతుంది. దీనికి కారణం ఎవరు ?. ఆయనే… జగన్ రెడ్డిని నమ్మి చట్టాన్ని సైతం ధిక్కరించడమే కారణం. ఇలా జగన్ ను నమ్మి జైలు పాలైన వారిని లెక్కించడం కష్టం.
ఎన్నో కుటుంబాల ఉసురు పోసుకుంటున్న జగన్
తప్పుడు పనులు చేయమని ప్రోత్సహించి.. చట్టాన్ని ఉల్లంఘించేలా చేసి.. మానసిక ఆనందాన్ని .. అక్రమ ఆస్తులను జగన్ పొందారు. కానీ దానికి శిక్షలను మాత్రం ఆయన కోసం పావులుగా మారిన వారు అనుభవిస్తున్నారు. నాడు ఎంపీగా ఉన్న దగ్గర నుంచి ఇప్పటి వరకూ ఆయన ఖాతాలో జైలుకెళ్లిన పారిశ్రామికవేత్తలు, అధికారులు, రాజకీయ నేతల లెక్క వేయడం చాలా కష్టం. ఎందుకంటే ఆయన అంత మందిని భ్రష్టుపట్టించారు. చాలా మంది వ్యాపారాలు కుదేలయ్యాయి. చాలా మంది కుటుంబాలను నాశనం చేసుకున్నారు. సమాజంలో సిగ్గుతో తలదించుకునే పరిస్థితి రావడంతో కామ్ గా. బతుకుతున్నారు. అయినా జగన్ రెడ్డి ఎప్పటికప్పుడు కొత్త బకరాలను వెదుక్కుని తన యజ్ఞం కొనసాగిస్తూనే ఉన్నారు.
క్రిమినల్ ను నమ్ముకునేవాళ్లకు బుర్ర ఉండక్కర్లా ?
నేరమనస్థత్వంతో ఉన్న వాడు తన చుట్టూ ఉన్న వారితో నేరాలే చేయిస్తాడు. తాను చేయాలనుకున్నది చేయించుకుంటాడు.తన చేతికి మట్టి అంటకుండా ఆ పనులు చేయించుకుంటాడు. చివరికి దొరికిపోవాల్సి వస్తే.. బలి కావాల్సి వస్తే.. తాను తప్పించుకుని అసలు వాళ్లను బలి చేస్తాడు. పోలీసు శాఖలో పండిపోయిన వారికి.. ఈ ధీయరీ గురించి తెలియకుండా ఉండదు. అయినా వాళ్లు కూడా క్రిమినల్స్ ను నమ్ముకుని జైలు పాలవుతున్నారు. ప్రభుత్వం చాలా మందిని చూసీ చూడనట్లుగా ఉంది కానీ.. వాళ్లు జగన్ కోసం చేసిన పనులను గుర్తు తెచ్చుకుంటే.. ఎంత మందిని జైలుకు పంపాల్సి వస్తుందో లెక్కలేయడం చాలా కష్టం. గౌతం సవాంగ్ లాంటి వాళ్ల పరువు తీయలేక…వారు చేసిన తప్పుల్ని చూసీచూడనట్లుగా ప్రభుత్వం ఉంది.కానీ ఈ సవాంగ్ ఏం చేశారో గుర్తున్న వారికి మాత్రం… ఆయనపై చర్యలు తీసుకోకపోవడం అసంతృప్తి కలిగిస్తూనే ఉంటుంది.
ఇంకా అయిపోలేదు – చాలా కథ ఉంది !
జగన్ రెడ్డికి కమిషన్ ఇస్తే చాలు.. సీఎంగా ఉన్నప్పుడు ఏ దొంగతనానికి అయినా చట్టపరమైన రక్షణ కల్పిస్తారు. దానికి బోలెడన్ని ఉదాహరణలు కళ్ల ముందు ఉన్నాయి. కానీ ఆ చట్టాల పవర్ గురించి తక్కువ అంచనా వేయడం మాత్రం ఆ దోపిడీ దారుల తప్పు. ఎల్లకాలం పదవిలో ఉంటాడని ఆశపడి దోచుకున్నారు. ఇప్పుడు జైళ్లకెళ్తున్నారు. భవిష్యత్ గురించి ఆలోచించి.. ఏ మాత్రం ఆశపడకపోయినా ఈ రోజు కాస్త గౌరవం అయినా దక్కించుకునేవాళ్లు. ఇప్పుడు అన్నీ కోల్పోయారు.