“టీ గ్లాస్” గుర్తు రాగానే “పిడికిలి”ని మర్చిపోతారా..?

జనసేన పార్టీకి టీ గ్లాస్ గుర్తు కేటాయించగానే జనసైనికులు.. టీ గ్లాసులతో ఓ రేంజ్‌లో సోషల్ మీడియాలో ఎటాక్ చేశారు. ఆ గుర్తు సోషల్ మీడియాలో… దూసుకుపోయింది. సామాన్యుల్లోకి ఎంత మేర పోతుందో.. తెలియదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం సూపర్ హిట్ చేసేశారు. యూరప్ లో… తన కుమారుడికి .. క్రిస్టియన్ మతాచారాల ప్రకారం నిర్వహించిన కొన్ని కార్యక్రమాలను నిర్వహిస్తున్న పవన్ కల్యాణ్ కూడా.. టీ గ్లాస్గుర్తు వచ్చిందని తెలిసేసరికి… అర్జంట్‌గా ఆ గ్లాస్‌తో టీ తాగాలన్నంత ఉత్సాహం వచ్చేసింది. కానీ అది యూరప్ కదా…? దొరకకపోవచ్చు.. కానీ తన ఉత్సాహాన్ని మాత్రం.. మాంచి..డికాక్షిన్ లో మునకేసిన టీ లాంటి స్ట్రాంగ్… ట్వీట్ పెట్టారు.

“మా పార్టీ గుర్తుగా “గాజు గ్లాసు”ను ఇచ్చిన ఎన్నికల సంఘానికి మనస్పూర్తిగా కృతజ్ఞతలు. చిన్ననాటి నుంచి నాకు ఈ “గాజు గ్లాసు”తో ప్రత్యేక అనుబంధం ఉంది. అంతేకాక.. ఇది మన దేశంలో సామాన్యుడి గుర్తింపు” అంటూ పవన్ ట్వీట్ చేశారు. పవన్ ఉత్సాహం చూసి.. సోషల్ మీడియా సైనికులు.. చెలరేగిపోయారు. మృగరాజు సినిమాలోని “ఛాయ్‌ చటుక్కున తాగరా భాయ్” వీడియో దగ్గర్నుంచి ..”సామాన్యుడి నుంచి సంపన్నుల వరకూ అందరి దాహం తీర్చే గ్లాస్” అనే డబుల్ మీనింగ్ కామెంట్లు వరకూ.. పెట్టేశారు. కొందరు పవన్ కల్యాణ్‌ వివిధ సందర్భాల్లో గాజు గ్లాసులో టీ తాగుతున్న ఫొటోలను ఉంచారు. సహజంగా.. ఇప్పటికీ టీ కొట్టు దగ్గరకు వెళ్తే.. అ గ్లాస్‌లోనే టీ ఇస్తారు… కాబట్టి.. ఆ గుర్తు సహజంగానే ప్రజల్లోకి వెళ్లిపోతుంది.

ఇంత వరకూ బాగానే ఉంది కానీ.. పవన్ కల్యాణ్.. గతంలో తన పార్టీ గుర్తుగా.. బిగించిన పిడికిలిని ప్రకటించారు. చాలా ఆవేశంగా చేసిన అ ప్రకటనతో.. గతంలో ఇప్పుడు గాజ్ గ్లాస్ తరహాలోనే ప్రచారం చేశారు. పవన్ కల్యాణ్ కూడా… అదే తమ గుర్తు అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు గాజు గ్లాస్ గుర్తు వచ్చింది. పొరపాటున.. రేపు ఎన్నికల్లో ఎన్నికల్లో ఎవరికైనా.. పిడికిలి గుర్తు వస్తే ఏం చేస్తారు…? పవన్ కల్యాణ్.. గాజు గ్లాస్ గుర్తు ఇచ్చినందుకు… ఎన్నికల సంఘానికి కృతజ్ఞతలు తెలిపారు కానీ… పిడికిలి గుర్తు కోసం ఎందుకు ప్రయత్నించలేదు..? ఇదే రేపేమైనా.. పీఆర్పీకి రైలింజన్ గుర్తు తెచ్చినట్లు.. ఏమైనా చిక్కులు తెస్తుందా..? ఈ కోణంలో ఎందుకు ఆలోచించలేకపోయారు..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మార్గదర్శిపై జగన్ ప్రచారాన్ని రోజా కూడా నమ్మలేదే !

మార్గదర్శి నిండా మునిగిపోయిందని చిట్స్ పాడుకున్న వారికి డబ్బులు ఇవ్వడం లేదని జగన్ రెడ్డి అండ్ సీఐడీ కంపెనీ చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. కోర్టుల్లో చెప్పారు.. కేసుల్లో...

టీడీపీ కూటమికి వంగవీటి రాధా విస్తృత ప్రచారం !

ఎన్డీఏ కూటమి తరపున స్టార్‌ క్యాంపెయినర్‌ రంగంలోకి దిగారు వంగవీటి రాధా. గతంలో కాంగ్రెస్, PRP, వైసీపీ నుంచి పోటీ చేసిన ఆయన ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు....

కల్లాల్లో ధాన్యం… రైతుల కళ్లల్లో దైన్యం

తెలంగాణలో కురిసిన అకాల వర్షం రైతులను కన్నీరుపెట్టిస్తోంది. కోతలకు వచ్చిన ధాన్యం తడిసిపోయిందని కొందరు, కల్లాల్లోకి వచ్చిన ధాన్యం పూర్తిగా తడిసిపోయిందని మరికొందరు ఆవేదన చెందుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించాలనుకున్న ఈ...

ఇళ‌య‌రాజాకు ఇంకా ఈ వ్యామోహం ఎందుకు?

ఇళ‌య‌రాజా స్వ‌ర‌జ్ఞాని. సంగీత బ్ర‌హ్మ‌. ఆయ‌న అభిమాని కానివారంటూ ఉండ‌రేమో..?! ఆయ‌న్ని దేవుడిగా ఆరాధిస్తారు అభిమానులు. ఇంత గొప్ప ఇళ‌య‌రాజాకు `కాపీ రైట్స్`పై మ‌మ‌కారం ఎక్కువైపోతోంది. త‌న పాట ఎవ‌రు పాడినా, వాడుకొన్నా.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close