ఇన్ సైడ్ న్యూస్: సొంత పత్రిక , ఛానల్ ప్రారంభించడం కోసం జనసేన కసరత్తు

త్వరలోనే సొంత పత్రిక, టీవి ఛానల్ ప్రారంభించాలనే యోచన తో జనసేన పార్టీ ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లుగా సమాచారం. ఈ మేరకు పార్టీలో క్యాడర్ నుంచే కాకుండా, పార్టీ ముఖ్య నేతల నుండి కూడా పవన్ కళ్యాణ్ మీద ఎప్పటి నుండో వస్తున్న ఒత్తిడికి సమాధానంగానే జనసేన తదుపరి చర్యలు ఉండబోతున్నాయని సమాచారం. వివరాల్లోకి వెళితే..

మీడియా బలం లేకపోవడం జనసేనకు మొదటి నుండి మైనస్సే :

ప్రజారాజ్యం పార్టీ 2009 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆ పార్టీ అభిమానుల నుండి చిరంజీవి కి వచ్చిన మొట్టమొదటి విన్నపం సొంత ఛానల్ ప్రారంభించమనే. కొన్ని మీడియా వర్గాలు చిరంజీవి చేసిన చిన్న పొరపాట్లను సైతం పెద్ద స్థాయిలో ప్రచారం చేయడం, తాము మద్దతిచ్చే పార్టీలు చేసే పెద్ద తప్పులను సైతం మరుగు పరచడం వంటి పనులకు పాల్పడ్డాయని, అంతేకాకుండా ప్రజారాజ్యం పార్టీని నిర్వీర్యం చేయడానికి ప్రత్యేకించి వ్యూహాలు రచించి మరీ కథనాలు ప్రసారం చేశాయని ప్రజారాజ్యం అభిమానులు అప్పట్లో చిరంజీవితో మొరపెట్టుకున్నారు. అదే విధంగా 2014లో జనసేన పార్టీ ప్రారంభించిన మొదట్లో పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీకి మద్దతు ప్రకటించడంతో, మూడేళ్లపాటు పవన్ కళ్యాణ్ కు మంచి కవరేజ్ ఇచ్చిన మీడియా ఛానల్స్, పవన్ కళ్యాణ్ తెలుగుదేశం నుండి విడిపోగానే పవన్కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని హననం చేసే లాగా గంటల తరబడి డిబేట్ లు పెట్టడం, జనసేన కార్యక్రమాలకు ఏ చానల్స్ లో కూడా కవరేజ్ రాకుండా చూసుకోవడం వాటి కారణంగానే 2019 ఎన్నికలలో జనసేన ప్రతికూల ఫలితాలను ఎదుర్కొందని జనసేన అభిమానులు వాపోతున్నారు. హాంకాంగ్లో 10 లక్షల మంది ఒక చోట చేరితే అది అంతర్జాతీయంగా వార్త అయితే రాజమండ్రిలో దాదాపు అంతే స్థాయి లో జనం పవన్ కళ్యాణ్ ర్యాలీ లో పాల్గొంటే అది అనేక ప్రధాన పత్రికల లో జిల్లా స్థాయి వార్త గా కూడా నోచుకోకపోవడం అప్పట్లో జనసేన అభిమానులను విస్మయపరిచింది.

సొంత మీడియా అవసరం పై చర్చకు దారితీసిన తాజా కారణాలు:

గిరిజన బాలిక సుగాలి ప్రీతి కేసు ఎప్పటినుండో పెండింగ్ లో ఉన్నప్పటికీ , పవన్ కళ్యాణ్ అంశంపై స్పందించి కర్నూలు లో ర్యాలీ చేస్తానని ప్రకటించగానే అధికార పార్టీ ఆ సమస్యపై స్పందించింది. ఇప్పుడు ఎట్టకేలకు ఆ కేసు సి.బి.ఐ చేతికి వెళ్ళింది. అయితే ఈ సమస్యపై బలంగా వినిపించింది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్న విషయం సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే జనసేన అభిమానులకు తప్ప సామాన్య ప్రజలకు పెద్దగా గుర్తు లేదు. మొన్నీమధ్య వైన్ షాపుల వద్ద టీచర్లను కాపలాగా ఉంచాలన్న జగన్ నిర్ణయాన్ని మొదటగా ప్రశ్నించింది పవన్ కళ్యాణ్ అయితే, పవన్ కళ్యాణ్ సమస్య లేవనెత్తిన కొద్ది గంటల తర్వాత చంద్రబాబు అదే సమస్యపై మాట్లాడేంత వరకు వేచి చూసిన మీడియా, చంద్రబాబు స్పందించిన తర్వాత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను మాత్రమే ప్రసారం చేసిందన్న విషయాన్ని జనసేన నేతలు కొందరు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకు వచ్చినట్లు సమాచారం. అలాగే టీటీడీ భూములను అమ్మాలనే నిర్ణయంపై పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని అర్నబ్ గోస్వామి వంటి జాతీయ మీడియా కి సంబంధించిన వ్యక్తులు సైతం కోరడం పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రెడిబిలిటీ ని తెలియజేస్తోందని, అయినప్పటికీ సాధారణ ప్రజల లోకి జనసేన కార్యక్రమాలు వెళ్లడం లేదని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు జనసేన నేతలు. సొంత మీడియా బలం లేకపోవడం ఆంధ్ర ప్రదేశ్ వంటి రాష్ట్రాలలో రాజకీయాలు చేయాలనుకునేవారికి ప్రధాన ప్రతికూలత అన్న అభిప్రాయం జనసేన క్యాడర్ లో కూడా వ్యక్తమవుతోంది.

జనసేన బలం సోషల్ మీడియా, కానీ అది సరిపోవడం లేదు:

సోషల్ మీడియాలో దక్షిణ భారతదేశంలోనే అత్యధిక ఫాలోయింగ్ కలిగిన పార్టీగా జనసేన పార్టీ ఉంది. దేశంలోనే సోషల్ మీడియా పరంగా బలం కలిగిన మొదటి పది పార్టీలలో జనసేన పార్టీ ఒకటిగా ఉంది. అయినప్పటికీ కూడా, సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ చేసే ప్రతి కార్యక్రమాన్ని శతఘ్ని టీమ్ మరియు అభిమానులు బలంగా ముందుకు తీసుకెళుతున్నప్పటికీ, సామాన్య ప్రజలకు జనసేన పార్టీ ఉనికి కూడా సరిగ్గా తెలియడం లేదు అన్న భావన జనసేన పార్టీ అభిమానుల లో ఉంది. ఒకవేళ సొంత మీడియా లేకుండా 2024 ఎన్నికలకు వెళితే, 2019 ఫలితాలు పునరావృతం అయ్యే అవకాశం ఉందన్న భావన కూడా జనసేన అభిమానుల లోనే ఉంది. ఇది సోషల్ మీడియా యుగం అని ఎంత చెప్పుకున్నప్పటికీ, ప్రధాన మీడియాలో వచ్చే వార్తలకు ఉండే విశ్వసనీయత, రీచ్, సోషల్ మీడియాకు లేదన్న సంగతి బహిరంగ రహస్యమే.

అక్కరకు రాని చిన్నాచితక ప్రయత్నాలు:

దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాలలో ఉనికి కోల్పోయిన కమ్యూనిస్టు పార్టీ లకు సైతం ఆయా రాష్ట్రాలలో చిన్నపాటి పత్రికలు ఉన్నాయి. జనసేన పార్టీ వాణిని వినిపించడానికి తీసుకున్న 99 టీవీ ఆ పనిని సమర్థవంతంగా చేయలేక పోయింది. ఆంధ్రప్రభ పత్రిక అధినేత కుటుంబీకులు, ఏపీ 24 x 7 ఛానల్ కి చెందిన కొందరు వ్యక్తులు జనసేన పార్టీలో ఉండడం వల్ల ఆ రెండు సంస్థలు కొంత వరకు జనసేన కార్యక్రమాలకు కవరేజ్ ఇచ్చినా, అదీ సరిపోలేదు. ఈ నేపథ్యంలో 2024 ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని త్వరలోనే సొంత మీడియా సంస్థలను ఏర్పరుచుకోవాలని పవన్ కళ్యాణ్ అభిమానుల నుండి జనసేన కార్యకర్తల నుండి ఆ పార్టీపై వస్తున్న తీవ్ర ఒత్తిడి కారణంగా ఆ దిశగా పార్టీ కూడా చర్యలు ప్రారంభించినట్లు సమాచారం

మొత్తం మీద:

ఓటమికి ప్రధాన కారణం తెలిసి, ఓటమికి కారణమైన సమస్యకు పరిష్కారం తెలిసి కూడా ఆ పరిష్కారం దిశగా అడుగులు వేయలేకపోతే ఓటమి పునరావృతం అవుతుందని చరిత్ర చెబుతోంది. మీడియా బలం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ వంటి రాష్ట్రాలలో రాజకీయాలు చేయడం అసాధ్యం అని తెలిసి కూడా ఆదిశగా జనసేన పార్టీ ఎందుకు అడుగులు వేయడం లేదన్న జనసేన అభిమానుల ప్రశ్నకు సమాధానం చెప్పే రీతిలోనే జనసేన పార్టీ చర్యలు త్వరలో ఉండబోతున్నాయని రాజకీయ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం ఎంతవరకు నిజం ఉన్నది కాలమే చెప్పాలి.

– జురాన్ (@CriticZuran)

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డేరింగ్ అండ్ డాషింగ్ కేజ్రీవాల్

అవినీతి వ్యతిరేక ఉద్యమం చేసి వచ్చి అవినీతి కేసులో అరెస్టు అయ్యాడన్న ప్రచారం చేస్తున్నారు. సామాన్యుడు కాదు లంచగొండి అని గట్టిగా ప్రజల మైండ్లలోకి ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. తన సీఎం...

విజయవాడ వెస్ట్ రివ్యూ : సుజనా చౌదరి నమ్మకమేంటి ?

ఏపీలో పొత్తుల్లో భాగంగా బీజేపీకి వెళ్లిన నియోజకవర్గం విజయవాడ వెస్ట్. అక్కడ్నుంచి అభ్యర్థిగా సుజనా చౌదరిని ఖరారు చేయడంతో కూటమిలోని పార్టీలు కూడా ఒప్పుకోక తప్పలేదు. నిజానికి అక్కడ జనసేన...

టీడీపీ @ 42 : సర్వైవల్ సవాల్ !

సాఫీగా సాగిపోతే ఆ జీవితానికి అర్థం ఉండదు. సవాళ్లను ఎదుర్కొని అధిగమిస్తూ ముందుకు సాగితేనే లైఫ్ జర్నీ అద్బుతంగా ఉంటుంది. అలాంటి జర్నీ ఒక్క మనిషికే కాదు.. అన్నింటికీ వర్తిస్తుంది. ...

తీహార్ తెలంగాణ కాదు..!!

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి జ్యుడిషియల్ రిమాండ్ లో భాగంగా తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవిత.. జైలు అధికారులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు కల్పించాల్సిన సౌకర్యాలను...

HOT NEWS

css.php
[X] Close
[X] Close