రామ్‌చరణ్ ‘పెద్ది’ సినిమా శరవేగంగా ముస్తాబవుతోంది. ఈ పాన్-ఇండియా చిత్రాన్ని బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్నారు. జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన పెద్ది పోస్టర్స్, గ్లింప్స్‌కి మంచి స్పందన వచ్చింది.
తాజాగా హీరోయిన్ పాత్రను పరిచయం చేశారు. అచ్చియమ్మాగా జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్ విడుదలైంది. భయానికి అర్థం తెలియని అచ్చియమ్మాగా రెండు లుక్స్‌ను రిలీజ్ చేశారు. వింటేజ్ గెటప్‌లో ప్రచారానికి వస్తున్నట్లుగా ఒక లుక్, మైక్ ముందు మాట్లాడుతున్నట్లుగా మరో లుక్. ఈ రెండు పోస్టర్స్ ఆకట్టుకుంటున్నాయి. బుచ్చిబాబు హీరోయిన్ పాత్రను చాలా బలంగా డిజైన్ చేశాడని టాక్. అచ్చియమ్మా పాత్ర జాన్వీ కపూర్ కెరీర్లో గుర్తుంచుకునే పాత్ర అవుతుందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి.
అన్నట్టు.. ఈ నెల 8న హైదరాబాద్‌లో ఏ.ఆర్. రెహ్మాన్ లైవ్ కాన్సర్ట్ జరగనుంది. ఇదే లైవ్ షోలో పెద్ది ఫస్ట్ సింగిల్‌ను లాంచ్ చేసే అవకాశం ఉంది. మార్చి 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. టీం ఇప్పటినుంచే ప్రమోషన్స్ ప్రారంభించడం మంచి పరిణామం.