చంద్రబాబుపై జేపీ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్: లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించమనిగానీ, కనీసం వెనకబడిన ప్రాంతాలకు పన్ను రాయితీలు ప్రకటించమనిగానీ ఏపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఇప్పటివరకు కేంద్రాన్ని అడగనే లేదని జేపీ అన్నారు. హోదా సంజీవని కాకపోతే ఇంకేది సంజీవనో చెప్పాలని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, చంద్రబాబునాయుడును కోరారు. ప్యాకేజి పేరిత ఇచ్చే డబ్బు పాలకుల ఆర్భాటలకే తప్ప ప్రజలకు ఉపయోగపడదన్నారు. పరిశ్రమలకు పన్ను రాయితీలవల్ల కేంద్రంమీద ఒక్క పైసా భారంకూడా పడదని, పైగా అదనపు ఆదాయం వస్తుందని చెప్పారు. ప్రత్యేక హోదా పేరు లేకపోయినా, హోదా వల్ల ఒనగూరే ప్రయోజనాలు కల్పించాలని డిమాండ్ చేశారు.

ఏపీలోని 13 జిల్లాలలో సుదీర్ఘకాలంగా పారిశ్రామికీకరణ జరగలేదని జేపీ చెప్పారు. ఫలితంగా ఉపాధి అవకాశాలు దాదాపు లేవని అన్నారు. రాయితీలొస్తే పరిశ్రమలు వస్తాయని, పరిశ్రమలు వస్తే యువతకు ఉపాధి లభిస్తుందని చెప్పారు. అందుకే ప్రత్యేక హోదాను తొలుత తానే ప్రతిపాదించానని అన్నారు. ఏపీకి ఐదేళ్ళలో రెవెన్యూ లోటు ఎంత ఉందనే విషయాన్ని ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం శాస్త్రీయంగా లెక్కగట్టి నిర్దిష్టమైన ప్రకటన చేయలేకపోయిందని, దీనిపై శ్వేతపత్రం ప్రకటించాలని తాను చాలాసార్లు డిమాండ్ చేశానని జేపీ చెప్పారు. దేశంలో ఎక్కడైనా ఒక వస్తువును తయారు చేయటానికి రు.100 ఖర్చయితే, రాయితీలున్న రాష్ట్రంలో రు.70కే తయారు చేయొచ్చని అన్నారు. తక్కువ ధరలో ఉత్పత్తి చేసే అవకాశం ఉంటే పరిశ్రమలు ఆటోమేటిక్‌గా వస్తాయని, పదేళ్ళు రాయితీలు ఉండి పారిశ్రామికీకరణ జరిగితే తర్వాత అభివృద్ధి కొనసాగుతుందని జేపీ చెప్పారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దుబ్బాకలో టీఆర్ఎస్ గెలుపుపై కేసీఆర్ ఎంత నమ్మకమో..!?

దుబ్బాక ఉపఎన్నిక విషయంలో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ చాలా క్లారిటీగా ఉన్నారు. ధరణి పోర్టల్ ప్రారంభించిన తర్వాత మీడియా ప్రతినిధులతో పిచ్చాపాటిగా మాట్లాడిన కేసీఆర్.. దుబ్బాకలో గెలుపు ఎప్పుడో డిసైడైపోయిందని తేల్చారు....

సంచైతకు కౌంటర్‌గా ఊర్మిళా గజపతి..!

విజయనగరం రాజుల ఫ్యామిలీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ పెట్టిన చిచ్చును.. రాజకీయంగానే ఎదుర్కోవాలని... ఇంక ఏ మాత్రం సహించకూడదని... గజపతుల కుటుంబం నిర్ణయానికి వచ్చినట్లుగా కనిపిస్తోంది. మాన్సాస్ ట్రస్ట్ చైర్ పర్సన్‌గా...

రాయలసీమ ఎత్తిపోతలను రిస్క్‌లో పెట్టేసిన ఏపీ సర్కార్..!

ముందూ వెనుకా చూసుకోకుండా.... రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ పై దూకుడుగా వెళ్లిన ఏపీ సర్కార్.. ఆ ప్రాజెక్ట్‌ను పూర్తిగా రిస్క్‌లో పడేసింది. టెండర్లు ఖరారు చేసి..మేఘా కన్సార్టియంకు పనులు అప్పగించేసిన తర్వాత ఇప్పుడు......

ఏపీలో మద్యం ధరలు భారీగా తగ్గింపు..! తాగమని ప్రోత్సాహమా..?

ఆంధ్రప్రదేశ్‌లో మందు బాబులతో తాగడం మాన్పించాలని మద్యం రేట్లు షాక్ కొట్టేలా పెంచేసిన ప్రభుత్వానికి తత్వం బోధపడినట్లుగా ఉంది. షాక్ కొట్టేలా రేట్లు పెంచితే...ఆ మద్యాన్ని కొని షాక్ కొట్టించుకోకుండా... పక్క రాష్ట్రాల...

HOT NEWS

[X] Close
[X] Close