ఆమరణదీక్షలతో ఫామ్‌లోకి వచ్చేందుకు జేసీ బ్రదర్స్ ట్రయల్ ..!

రాజకీయంగా బ్యాటన్ వారసులకు ఇచ్చేసి…హాయిగా విశ్రాంతి తీసుకుందామనుకున్న జేసీ బ్రదర్స్‌కు.. అస్సలు కలసి రావడంలేదు. ఓటమి ఎరుగని జేసీ సోదరులు.. వారి రికార్డును కాపాడుకున్నారు కానీ వారి వారసులు మాత్రం పరాజయం పాలయ్యారు. తొలి ప్రయత్నంలో వారసుల్ని నిలబెట్టలేక మనోవేదనకు గురయ్యారు. అదే అనుకుంటే.. వైసీపీ ప్రభుత్వం వారిని వెంటాడి.. వేటాడుతోంది. రెండేళ్ల నుంచి వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. వారి ట్రాన్స్ పోర్ట్ వ్యాపారం దగ్గర్నుంచి మైన్స్ వరకూ మొత్తం ఎక్కడిదక్కడ ఉండిపోయింది. వారికి ఆర్థిక నష్టాలకు తోడు… ప్రభుత్వ కేసులు అదనం.

అయితే ఇప్పుడు ప్రభుత్వంపై పోరాటానికి ముందడుగు వేస్తున్నారు. మొదట్లో కొంత కాలం టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు కానీ.. వేధింపులు ఆగకపోవడంతో ఇప్పుడు మరింత దూకుడుగా ఉండాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. పెద్దారెడ్డి నేరుగా ప్రభాకర్ రెడ్డి ఇంటికే వచ్చి సవాల్ చేయడంతో.. ఇక వెనక్కి తగ్గితే.. వర్గాన్ని కాపాడుకోవడం కష్టం అవుతుందన్న అంచనాకు వచ్చారు. అందుకే … జేసీ దివాకర్ రెడ్డి కూడా తెర ముందుకు వచ్చారు. తన వర్గీయులపై అట్రాసిటీ కేసులు అక్రమంగా బనాయిస్తున్నారని చెబుతూ.. ఆమరణదీక్షలకు ప్లాన్ చేశారు. దాన్నిసోమవారమే చేస్తున్నారు. దీక్షల కారణంగా.. తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసులు పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నారు.

టీడీపీ ఓడిపోయిన వెంటనే ఆయనకు బీజేపీ నుంచి ఆఫర్ వచ్చింది. వైసీపీ వేధింపుల నుంచి రక్షణ పొందాలంటే.. బీజేపీలో చేరాలని ఆఫర్ ఇచ్చారు. కానీ జేసీ బ్రదర్స్ తోసి పుచ్చారు. అదే పనిగా పార్టీలు మారడం ఇష్టం లేదని వారు టీడీపీలోనే ఉండిపోయారు. వైసీపీ నుంచి కూడా వారికి ఆఫర్స్ వచ్చినట్లుగా ప్రచారం జరిగింది. కానీ.. ఎందుకోకానీ వారు.. పార్టీ మారేందుకు ఆసక్తి చూపించలేదు. కావాలంటే… రాజకీయాలకు కొంత కాలం దూరంగా ఉండి.. సైలెంట్ గా ఉంటామన్నట్లుగా మాట్లాడారు కానీ… పార్టీ మారలేదు. రెండు రోజుల కిందట.. కూడా జేసీ పవన్ రెడ్డి అదే మాట చెబుతున్నారు. వైసీపీ సర్కార్‌తో తాడోపేడో తేల్చుకుంటాం కానీ వెనక్కి తగ్గేదిలేదంటున్నారు. మొత్తానికి జేసీ బ్రదర్స్ రాజకీయం పోరాటంతో టీడీపీలోనూ.. కాస్తంత ఉత్సాహం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close