ఇక “అన్న జేసీ” వంతు..!?

కాలం మారుతుందని… తమదై కాలం వచ్చినప్పుడు అంతకంతకూ బదులు తీర్చుకుంటామని మాజీ ఎంపీ జేసీదివాకర్ రెడ్డి ప్రభుత్వానికి హెచ్చిరిక జారీ చేశారు. తమకు చెందిన గనుల్లో అధికారులు తనిఖీలు చేయడాన్ని ఖండించారు. తమ గనుల్లో ఎవరైనా నక్సలైట్లు ఉన్నారా అని ఆయన ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. గనులకు సంబంధించిన పర్మిట్లు పెండింగ్‌లో పెట్టి.. తమ ఉపాధిని దెబ్బతీస్తున్నారని ఆయన తాడపత్రిలోని గనుల కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. వైసీపీ నేతలకు చెందిన గనులు చాలా ఉన్నా..వాటిలో సోదాలు చేయకుండా… తమ గనుల్లో మాత్రమే సోదాలు చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. తమ ఉపాధిని దెబ్బతీసి.. తమకు తిండినీరు లేకుండా చేద్దామని చూస్తున్నారని జేసీదివాకర్ రెడ్డి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

తాడిపత్రిలో గనులశాఖ కార్యాలయానికి వెళ్లిన జేసీ దివాకర్‌రెడ్డికి ఖాళీ కుర్చీలే కనిపించాయి. తాను వస్తున్నానని తెలుసుకొని మైన్స్‌ ఏడీ పరారయ్యారని మండిపడ్డారు. పోలీసులు బదిలీలకు భయపడి అధికార పార్టీకి ఊడిగం చేయొద్దని సూచించారు. పోలీసులు ఇంత బానిస బతుకు ఎందుకు బతుకుతున్నారని జేసీ దివాకర్ రెడ్డి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాలం మారుతుంది జాగ్రత్త అని కూడా హెచ్చరికలుజాీర చేశారు. మా ప్రభుత్వం వస్తే మేం కాదు..మా కార్యకర్తలు అధికారులను వదలరని హెచ్చరికలు జారీ చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి జేసీ కుటుంబం తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటోంది.

జేసీ బ్రదర్స్‌లో తమ్ముడు జేసీ ప్రభాకర్ రెడ్డిపై కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత నమోదైన కేసులు అన్నీఇన్నీ కావు. ఆయనను చాలా కాలం పాటు జైల్లో పెట్టారు. ఒక దాంట్లో బెయిల్ వస్తే.. మరో కేసులో జైలులో పెట్టారు. చివరికి కరోనా సోకడంతో ట్రీట్‌మెంట్ కోసం బెయిల్ రావడంతో బయటకు వచ్చారు. ఇప్పుడు.. పెద్ద జేసీగనులపై దృష్టి పెట్టారు. జేసీ ఫ్యామిలీ ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టేందుకు ఇప్పటికే జేసీకి చెందిన ట్రావెల్స్ బిజినెస్‌ ఇప్పటికే రవాణ శాఖ అధికారుల దెబ్బకు మూలన పడింది. గతంలో త్రిశూల్ గనుల కేటాయింపునుకూడా రద్దు చేశారు. ఇప్పుడు మిగిలి ఉన్న గనులను కూడా రద్దు చేసేందుకు వ్యూహం పన్నుతున్నారని ఆయన అనుమానిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

క‌ల్కి.. క‌మ‌ల్.. కంశుడు!

ప్ర‌భాస్ అభిమానులే కాదు, ఇండియ‌న్ సినిమా మొత్తం ఆశ‌గా ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్.. 'క‌ల్కి'. ప్ర‌భాస్ తో పాటు అమితాబ్ బ‌చ్చ‌న్‌, క‌మ‌ల్ హాస‌న్ లాంటి దిగ్గ‌జాలు ఈ సినిమాలో న‌టిస్తున్నారు. ప్ర‌భాస్‌,...

దర్శి రివ్యూ : హోరాహోరీ – కానీ బూచేపల్లికి ఎన్నో మైనస్‌లు !

మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ గెలిచిన రెండే మున్సిపాలిటీల్లో ఒకటి దర్శి. రెండోది తాడిపత్రి. తాడిపత్రిలోనూ కష్టం మీద గెలిచారు కానీ దర్శిలో మాత్రం టీడీపీ స్వీప్ చేసింది. నిజానికి అక్కడ నాయకుడు...

గత ఎన్నికలలో వైసీపీ కోసం ప్రచారం చేసిన వాళ్లేరి ?

అధికార అహంకారం జగన్మోహన్ రెడ్డిని అందరికీ దూరం చేసింది. తాను ఎవరి సాయంతో అధికారం అందుకున్నారో .. వాళ్లందర్నీ అవమానించి , వేధించడంతో దూరమయ్యారు. ఇప్పుడు ఎన్నికల ప్రచారానికి వైసీపీ...

గాజు గ్లాస్ గందరగోళం : తప్పు ఎవరిది ? నిర్లక్ష్యం ఎవరిది ?

రాజకీయం అంటేనే కుట్రలు, కుతంత్రాల సమాహారం. తాము గెలవాలంటే ప్రత్యర్థి ఓడాలి. అలా చేయాలంటే నేరుగా అయ్యా..బాబూ అని ప్రజల్ని ఓట్లు అడిగితేనే సరిపోదు. ఓట్లు చీల్చాలి.. తప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close