వినాయ‌క్ ఆశించాడు.. చిరు నిరాశ ప‌రిచాడు

ఈరోజు వినాయ‌క్ పుట్టిన రోజు. సాధార‌ణంగా… వినాయ‌క్ కి త‌న‌ పుట్టిన రోజున ఏదో ఓ కొత్త సినిమా విశేషం బ‌య‌ట‌పెట్ట‌డం అల‌వాటు. ఇన్నేళ్లుగా త‌న కెరీర్ ఇలానే న‌డిచింది. ఈసారీ అదే ఆశించాడు. వినాయ‌క్ ప్ర‌స్తుతం రెండు సినిమాల ప‌నుల్లో బిజీగా ఉన్నాడు. `లూసీఫ‌ర్‌` రీమేక్ వినాయ‌క్ చేతిలో పెట్టారు. మ‌రోవైపు.. బాల‌కృష్ణ కోసం ఓ క‌థ రెడీ చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలూ ప‌ట్టాలెక్క‌డానికి కాస్త స‌మ‌యం ప‌డుతుంది. కాక‌పోతే.. ఇందులో చిరుతో సినిమా అయితే ఫిక్స్‌. ఈసినిమాకి సంబంధించిన ఎనౌన్స్‌మెంట్ ఈరోజు వ‌స్తుంద‌న్న‌ది వినాయ‌క్ ఆశ‌. కానీ.. చిరు‌ మాత్రం అలాంటి ప్ర‌య‌త్నాలేం చేయలేదు. `వినాయ‌క్‌తో మ‌రో సినిమా చేయ‌బోతున్నారు` అన్న హింట్ కూడా చిరు నుంచి రాలేదు. బాబితో సినిమా చేస్తున్న సంగ‌తి, మెహ‌ర్ ర‌మేష్ సినిమా విష‌య‌మూ చిరు నోటి నుంచే బ‌య‌ట‌కు వ‌చ్చాయి. వినాయ‌క్ తో ప్రాజెక్ట్ అన్న‌ది ఫిల్మ్ న‌గ‌ర్ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోంది త‌ప్ప‌, దీనిపై అఫీషియ‌ల్ గా ఎలాంటి క్లారిటీ లేదు.

ఈ కాంబో గురించిన ప్ర‌క‌ట‌న ఈరోజు వ‌స్తుంద‌ని అటు వినాయ‌క్ స‌న్నిహితులు, ఇటు చిరు ఫ్యాన్స్ అనుకున్నా – చిరు మాత్రం సైలెంట్ అయిపోయాడు. సినిమాకి సంబంధించిన ప్ర‌క‌ట‌న రాక‌పోవ‌డంతో వినాయ‌క్ కూడా నిరాశ చెందాడ‌ని ఇన్‌సైడ్ వ‌ర్గాల టాక్‌. `ఆచార్య‌` త‌ర‌వాత‌… మెహ‌ర్ ర‌మేష్ `వేదాళం` మొద‌లైపోతుంది. ఆ త‌ర‌వాతే లూసీఫ‌ర్‌. అందుకే ఇప్పుడే చెప్పేయ‌డం ఎందుక‌ని చిరు భావించి ఉంటాడు. కానీ వినాయ‌క్ ప్ర‌స్తుతం ఖాళీ. ఏ సినిమా క‌న్‌ఫామ్ కాలేదు. ఇలాంటి స‌మ‌యంలో చిరుతో సినిమా ఖరారైతే బూస్ట‌ప్ గా ఉండేద‌నుకున్నాడు. అది జ‌ర‌గ‌లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close