మాలో మ‌రో ర‌గ‌డ‌: ఈసారి జీవిత వంతు

మా డైరీ ఆవిష్క‌ర‌ణ స‌భ‌లో రాజశేఖ‌ర్ ప్ర‌వ‌ర్త‌న దుమారం రేపిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర‌వాత ఆయ‌న త‌న ప‌దవికి రాజీనామా చేసి వెళ్లిపోయారు. ఇప్పుడు జీవిత వంతు వ‌చ్చింది. ‘మా’లో జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ హోదాలో ఉన్నారు జీవిత‌. ఇప్పుడు ఆమెకూ, ‘మా’కు మ‌ధ్య గొడ‌వ మొద‌లైంది.

ఈ మ‌ధ్య మా డైరీ ఆవిష్క‌ర‌ణ సంద‌ర్భంగా కొంత‌మంది పేద క‌ళాకారుల‌కు టూ వీల‌ర్స్ ప్ర‌దానం చేశారు. అవి కూడా బ‌య‌టి నుంచి స్పాన్స‌ర్ల‌ను తీసుకొచ్చి, ఇప్పించారు. వాటికి సంబంధించిన చెక్‌ల‌ను మా ఇంకా ఇష్యూ చేయ‌లేదు. జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ హోదాలో చెక్ బుక్‌పై సంత‌కాలు చేసే అధికారం జీవిత‌కు ఉంది. ఆవిడేమో సంకాలు చేయ‌కుండా కాల‌యాప‌న చేయ‌డంతో.. న‌రేష్ అధ్య‌క్షుడి హోదాలో చెక్‌ల‌పై సంత‌కాలు చేసి, నిధుల్ని విడుద‌ల చేశారు. ఇది జీవిత‌కు న‌చ్చ‌లేద‌ని తెలుస్తోంది. ‘నేను సంత‌కం చేయ‌కుండా డ‌బ్బులు బ‌య‌ట‌కు ఎలా తీస్తారు’ అంటూ మా కార్యాల‌యానికి వ‌చ్చి, చెక్ బుక్స్‌ని ప‌ట్టుకెళ్లిపోవ‌డ‌మే కాకుండా, గ‌దుల‌కు తాళాలు కూడా వేసుకుని వెళ్లిపోయార‌ట‌. రెండ్రోజుల నుంచి `మా`కి సంబంధించిన ప‌నులేవీ జ‌ర‌గ‌డం లేదు. సిబ్బంది సైతం విధుల‌కు హాజ‌రు కావడం లేదు. దాంతో ఎక్క‌డి ప‌నులు అక్క‌డే ఉండిపోయాయ‌ని తెలుస్తోంది. రాజ‌శేఖ‌ర్ గొడ‌వ స‌ద్దుమ‌ణ‌గ‌క ముందే జీవిత ఈ ర‌కంగా ప్ర‌వ‌ర్తించ‌డం మాలో ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశ‌మైంది. మ‌రి ఈ గొడ‌వ ఎప్పుడు తేలుతుందో..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com